ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rapaka Son Marriage : పెళ్లికెళ్లి ఎమ్మెల్యే రాపాకకు ఊహించని గిఫ్ట్ ఇవ్వనున్న సీఎం వైఎస్ జగన్.. అదేంటో తెలిస్తే..!

ABN, First Publish Date - 2023-06-07T14:42:17+05:30

ఏపీలో అసలే ఎన్నికలకు సమయం ఆసన్నమైంది.. పార్టీలన్నీ ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకోవడం లేదు. గతంలో ఎంత పెద్ద కార్యక్రమం అయినా విస్మరించిన నేతలు ఇప్పుడు చిన్న చిన్న కార్యక్రమాలను కూడా వదలడం లేదు. కార్యక్రమం ఏదైనా తమకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందనే తలంపుతోనే ఉన్నారు. ఇక అలాంటిది ఏకంగా వేరొక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీ అధినేతకు తమ కుమారుడి పెళ్లిలో పెద్ద పీట వేస్తే ఆగుతారా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీలో అసలే ఎన్నికలకు సమయం ఆసన్నమైంది.. పార్టీలన్నీ ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకోవడం లేదు. గతంలో ఎంత పెద్ద కార్యక్రమం అయినా విస్మరించిన నేతలు ఇప్పుడు చిన్న చిన్న కార్యక్రమాలను కూడా వదలడం లేదు. కార్యక్రమం ఏదైనా తమకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందనే తలంపుతోనే ఉన్నారు. ఇక అలాంటిది ఏకంగా వేరొక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీ అధినేతకు తమ కుమారుడి పెళ్లిలో పెద్ద పీట వేస్తే ఆగుతారా? ఇప్పుడిదంతా ఎందుకు అంటే.. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు (Rajole MLA Rapaka Varaprasad) కుమారుడి పెళ్లి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికలో సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) దంపతుల ఫోటో వేయడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమే అయ్యింది.. అంతకుమించి విమర్శలు కూడా వెల్లువెత్తాయ్. రాపాక వచ్చేసి జనసేన తరుఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే.. ఆ తర్వాత వైసీపీ వకల్తా పుచ్చుకోవడం విశేషం.

ఎక్కడ చూసినా ఇదే చర్చ!

నిజానికి రాపాక జనసేన తరుఫున పోటీ చేసి గెలిచినా కూడా ఆది నుంచి వైసీపీకి అండగా నిలుస్తూ వస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా చాలు జగన్‌ను ఆకాశానికి ఎత్తడమే పనిగా పెట్టుకున్నారు. ఆయన ఫోటోకు పాలాభిషేకం చెయ్యడం వంటివి చేస్తుంటారు. జనసేన తరుఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారని అంతా భావిస్తే.. ఆయన మాత్రం జగన్‌కు భజన చేయడమే పనిగా పెట్టుకున్నారు. అసెంబ్లీలో సైతం వైసీపీ ఎమ్మెల్యేలను మించి జగన్ దేవుడు అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక ఇప్పుడు ఏకంగా తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికపైనే జగన్ దంపతుల ఫోటోను ముద్రించి వారి ఆశీస్సులతో వివాహం జరుగుతున్నట్టు కలరింగ్ ఇచ్చారు. అంతటితో ఆగని రాపాక.. ‘మాకు దైవ సమానులైన మా ప్రియతమ నాయకులు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. భారతమ్మ గార్ల ఆశీస్సులతో’ అంటూ వారిద్దరి ఫోటోను పెళ్లి పత్రికపై ముద్రించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ కార్డు చూసిన వైసీపీ నేతలే అవాక్కయిన పరిస్థితి. మరోవైపు జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు రాపాకపై మండిపడుతున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. వైసీపీ ఎమ్మెల్యేలను మించిన విధేయత రాపాక చూపించడంపై ఆసక్తికర చర్చ జరిగింది. అయితే ఇదంతా జగన్ దృష్టిలో పడటానికేనని విమర్శలు లేకపోలేదు.

ఇదీ అసలు కథ..!

రాపాక కుమారుడి వివాహం నేటి (జూన్ 7వ తేదీ) రాత్రి ఒంటిగంట రెండు నిమిషాలకు జరగనుంది. ఈ వేడుకకు సీఎం జగన్ కుటుంబ సమేతంగా విచ్చేస్తున్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఆసక్తికర చర్చ ఏంటంటే.. రాపాక కుమారుడి పెళ్లికి హాజరయ్యే జగన్.. ఎమ్మెల్యేకు ఊహించని గిఫ్టు ఇవ్వబోతున్నారని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు జగన్‌పై రాపాక చూపించిన భక్తికి.. పెళ్లికెళ్లి టికెట్ కన్ఫర్మ్ చేస్తారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం రాజోలు నియోజకవర్గంలో వైసీపీకి దిక్కు దివాణం లేకుండా పోయింది.! గతంలో రాపాకపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వర రావు.. రాపాక వైసీపీకి అనుకూలంగా మారడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం రాజోలు నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న రాపాకే వైసీపీకి పెద్ద దిక్కుగా మారారు. ఈయన తర్వాత కానీ.. సొంత పార్టీలో కానీ చెప్పుకోదగిన నేతలెవరూ లేకపోవడంతో రాపాకకే టికెట్ పక్కాగా ఇచ్చేస్తారన్నది ఎప్పట్నుంచో నడుస్తున్న టాక్. ఇప్పుడిక జగన్ కూడా రాపాక ఆదరిస్తూ.. శుభకార్యానికి వెళ్తుండటంతో దీనికి మరింత బలం చేకూరినట్లయ్యింది. సొంత పార్టీకి ద్రోహం చేశారని భావిస్తున్న జనసేన ఈయన్ను ఓడించడానికి చాలా రోజుల నుంచే అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోందని టాక్. రానున్న ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

Updated Date - 2023-06-07T14:43:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising