CBN Skill Case : సీఐడీ విచారణలో చంద్రబాబుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారా..!?
ABN, First Publish Date - 2023-09-24T21:23:25+05:30
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu) రెండ్రోజుల పాటు సీఐడీ (CID) విచారించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని (Rajahmundry Central Jail) హాల్లో 12 మంది సీఐడీ అధికారుల బృందం శనివారం, ఆదివారం విచారించింది.. థర్డ్ డిగ్రీ..
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu) రెండ్రోజుల పాటు సీఐడీ (CID) విచారించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని (Rajahmundry Central Jail) హాల్లో 12 మంది సీఐడీ అధికారుల బృందం శనివారం, ఆదివారం విచారించింది. ఈ విచారణ జరిగినంత సేపూ బాబు తరఫున ఇద్దరు లాయర్లు పక్కనే ఉండగా.. ప్రక్రియ మొత్తం సీఐడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. రెండ్రోజుల పాటు జరిగిన ఈ విచారణలో ఉదయం, సాయంత్రం వైద్య పరీక్షలు చేయడం, గంటకోసారి 5 నిమిషాలు బాబుకు బ్రేక్ ఇవ్వడం.. మధ్యాహ్నం భోజనానికి విరామం ఇలా అన్ని సౌకర్యాలతో విచారణ జరిగింది. అయితే.. విచారణలో మొదటి రోజు మాత్రం సీఐడీ వర్సెస్ సీబీఎన్‌గా పరిస్థితులు ఉన్నట్లు బయటికి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా.. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి..? ఈ కార్పొరేషన్ ఆలోచన ఎందుకు వచ్చింది? దాని అవసరమేమిటి?.. కార్పొరేషన్‌లో ఘంటా సుబ్బారావును, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీనారాయణను ఎందుకు నియమించారు? అని చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించారు.
ఇవాళ ఏం జరిగింది..!?
రెండు రోజు విచారణ ఎలా జరిగిందనేది బయటికి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ.. 12 గంటలపాటు జరిగిన విచారణలో దాదాపు 30 అంశాలపై 120 ప్రశ్నలు అడిగి ఇబ్బందిపెట్టినట్లు తెలియవచ్చింది. ముఖ్యంగా.. షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపుపై, డాకుమెంట్స్ చూపించి నిధులు ఎందుకు కేటాయించాల్సి వచ్చిందనే అంశాలపై.. బాబును సీఐడీ అధికారులు ప్రశ్నించినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకూ చంద్రబాబు జవాబు చెప్పినట్లుగా తెలిసింది. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఆదివారం విచారణ పూర్తయ్యాక ఏసీబీ న్యాయమూర్తి ముందు సీఐడీ అధికారులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా జడ్జీ, చంద్రబాబు మధ్య సుమారు 15 నిమిషాల పాటు విచారణకు సంబంధించి చర్చకు వచ్చింది. ఈ ఇద్దరూ ఏం మాట్లాడకున్నారు..? బాబును జడ్జి ఏం అడిగారు..? చంద్రబాబు ఏం సమాధానాలు చెప్పారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం..
జడ్జి - చంద్రబాబు మధ్య సంభాషణ ఇలా..!
01 :-
జడ్జి : చంద్రబాబు గారు.. మిమ్మల్ని రెండ్రోజుల కస్టడీలో పోలీసులు ఎలా చూశారు..?
చంద్రబాబు : ఏం ఇబ్బంది లేదండి.. విచారణ అంతా బాగానే జరిగింది
02 :-
జడ్జి : కోర్టు చెప్పిన నిబంధనలు పాటించారా..?
చంద్రబాబు : అవును.. పాటించారు
03:-
జడ్జి : విచారణ సమయంలో మీ న్యాయవాదులు ఎదురుగానే ఉన్నారా..?
చంద్రబాబు : అవును.. ఉన్నారండి..
04:-
జడ్జి : విచారణ సందర్భంగా సీఐడీ అధికారులు ఏమైనా ఇబ్బంది పెట్టారా..? థర్డ్ డిగ్రీ ప్రయోగించారా..?
చంద్రబాబు : అధికారులు నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు
05 :-
జడ్జి : ఈ కస్టడీలో వచ్చిన నివేదికను మేం పరిశీలిస్తాం.. ఇంకేమీ ఇబ్బందులు లేవు కదా..?
చంద్రబాబు : హా.. ఏమీ ఇబ్బందులు లేవండి
06:-
జడ్జి : నివేదిక కోర్టుకు అందాక.. మీకు ఒక కాఫీ ఇవ్వాలని ఆదేశిస్తాం
చంద్రబాబు : అలాగేనండి
07:-
జడ్జి : విచారణలో మీకు ఎటువంటి ఇబ్బంది కలగలేదుగా..?
చంద్రబాబు : అలాంటిది ఏమీ లేదండి
08:-
జడ్జి : విచారణకు ముందు.. ఆ తర్వాత వైద్య పరీక్షలు చేయించారా..?
చంద్రబాబు : హా.. చేయించారండి..
09:-
జడ్జి : సరే.. చంద్రబాబుగారు ఉంటామండి
చంద్రబాబు : అలాగేనండి..
10 :-
జడ్జి : సోమవారం నాడు బెయిల్‌పై విచారిస్తాం..
చంద్రబాబు : ఓకేనండి
11 :-
జడ్జి : మీరు జ్యుడీషియల్ కస్టడీలో మాత్రమే ఉన్నారు..
చంద్రబాబు : అలాగేనండి
సహకరించలేదు..!
చంద్రబాబు రెండ్రోజుల విచారణపై సీఐడీ తరపున న్యాయవాది వివేకానంద స్పందించారు. ‘ చంద్రబాబుకు పోలీసు కస్టడీ పొడిగించాలని కోర్టును కోరాం. కస్టడీలో చంద్రబాబు సహకరించలేదు. వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబుతో న్యాయమూర్తి మాట్లాడారు. విచారణ జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు. అక్టోబర్-05 వరకు జ్యూడిషియల్ రిమాండ్ వేశారు. కస్టడీ పిటీషన్ రేపు వేసే అంశం పరిశీలిస్తాం. విచారణకు సహకరించలేదని మా (సీఐడీ) అధికారులు చెప్పారు. సోమవారం నాడు కోర్టుకు ఈ అంశాలన్నీ నిశితంగా వివరిస్తాం. అంతేకాదు.. రేపు చంద్రబాబు బెయిల్ పిటీషన్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసులో అక్రమాలపై విచారణ సాగుతుంది’ అని వివేకానంద చెప్పుకొచ్చారు.
రిమాండ్‌కు ఇలా..!
ఇలా చంద్రబాబును సెంట్రల్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరుపరిచిన తర్వాత.. సీఐడీ అడిగిన రిమాండ్‌పై ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు, సీఐడీ తరఫున లాయర్లు వాదనలు వినిపించారు. రిమాండ్‌కు ఇవ్వాలని సీఐడీ.. అస్సలు ఇవ్వాల్సిన అక్కర్లేదని బాబు తరఫున పోసాని వెంకటేశ్వర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా ఇరువురి వాదనలు విన్న తర్వాత అక్టోబర్-05 వరకు చంద్రబాబుకు రిమాండ్ విధిస్తున్నట్లు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అంటే.. ఇంకా 11 రోజులపాటు చంద్రబాబు జైల్లోనే ఉండాల్సి రావడంతో టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
NCBN Remand : చంద్రబాబుకు మళ్లీ రిమాండ్ పొడిగింపు.. ఈసారి ఎన్నిరోజులంటే..?
CBN CID Enquiry : రెండో రోజు ముగిసిన చంద్రబాబు సీఐడీ విచారణ.. ఇవాళ ఎన్ని ప్రశ్నలు అడిగారంటే..?
NCBN Arrest : ఢిల్లీలో చినబాబు.. ఏపీలో బాలయ్య బాబు ఇద్దరి టార్గెట్ ఒక్కటే.. వణికిపోతున్న వైసీపీ!
NCBN CID Enquiry : చంద్రబాబు సీఐడీ విచారణతో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పరిస్థితి ఎలా ఉందో చూడండి
Lokesh Delhi Tour : హుటాహుటిన హస్తినకు లోకేష్.. ఏపీలో మారిన సీన్.. ఏం జరగబోతోంది..?
Updated Date - 2023-09-24T21:47:18+05:30 IST