Ponguleti and Jupally : క్లైమాక్స్‌కు చేరుకున్న కాంగ్రెస్‌లో చేరికలు.. నిన్న సాయంత్రం బెంగళూరులో.. ఇవాళ కోమటిరెడ్డి ఇంట్లో కీలక భేటీలు.. ఫైనల్‌గా..!
ABN, First Publish Date - 2023-06-11T16:23:34+05:30
తెలంగాణ కాంగ్రెస్‌లో (TS Congress) చేరికలు క్లైమాక్స్ దశకు చేరుకున్నాయి. అటు బీఆర్ఎస్ (BRS) నుంచి.. ఇటు బీజేపీ (BJP) నుంచి అసంతృప్త నేతలు అంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు...
తెలంగాణ కాంగ్రెస్‌లో (TS Congress) చేరికలు క్లైమాక్స్ దశకు చేరుకున్నాయి. అటు బీఆర్ఎస్ (BRS) నుంచి.. ఇటు బీజేపీ (BJP) నుంచి అసంతృప్త నేతలు అంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. ఎప్పుడు ఏ నేత సొంత పార్టీకి గుడ్ బై చెప్పేసి వేరే పార్టీలోకి జంప్ అవుతారో తెలియని పరిస్థితి. మరోవైపు నేతల వరుస భేటీలు, చేరికలతో రాష్ట్ర రాజకీయాలు (TS Politics) ఒక్కసారిగా హీటెక్కాయి. శనివారం నాడు మహబూబ్‌నగర్‌లో (Mahbubnagar).. అదే రోజు సాయంత్రం బెంగళూరులో (Bangalore).. ఇప్పుడు హైదరాబాద్‌లో (Hyderabad) వరుస సమావేశాలతో కాంగ్రెస్‌లో చేరే నేతలు బిజిబిజీగా ఉన్నారు. పార్టీలో చేరితే పరిస్థితేంటి..? అసలే ప్రాధాన్యత లేకపోవడం వల్ల సొంత పార్టీకి గుడ్ బై చెప్పి బయటికొచ్చాం.. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరితో ఎలా ఉంటుంది..? అని అన్ని విషయాలు ఆచితూచి మరీ అడుగులేస్తున్నారు. ముఖ్యంగా కీలక నేతలు.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) , మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) కాంగ్రెస్‌లో చేరికపై దాదాపు క్లారిటీ వచ్చింది కానీ.. ముహూర్తం ఫిక్స్ చేసుకోవడంలో తర్జన భర్జన పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే తెలంగాణ రాజకీయాలు బెంగళూరు చేరుకున్నాయి. అసలు తెలంగాణ రాజకీయాలకు బెంగళూరుతో సంబంధమేంటి..? నిన్న, ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాలేంటి..? ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో (Komati Reddy Venkatareddy) భేటీ అయిన నేతలెవరు..? వారంతా ఏం డిసైడ్ అయ్యారు..? భేటీ తర్వాత కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ ఏంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
శనివారం అంతా ఇలా..!
కన్నడనాట కాషాయ పార్టీని కనివినీ ఎరుగని రీతిలో ఓడించి కాంగ్రెస్ (Karnataka Congress) అఖండ విజయం సాధించడంతో తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు మొదలయ్యాయి. అప్పటి వరకూ బీజేపీ వైపే అడుగులు వేయాలనుకున్న నేతలంతా ఒక్కసారిగా కాంగ్రెస్ వైపు టర్న్ అవుతున్నారు. అంతేకాదు.. బీఆర్ఎస్ సిట్టింగ్‌లు కూడా అసంతృప్తితో రగిలిపోతూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ వరుస పరిణామాలతో రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త జోష్ వచ్చినట్లయ్యింది. శనివారం నాడు మహబూబ్‌నగర్ కీలక నేత మల్లు రవితో (Mallu Ravi) జూపల్లి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డితో (Kuchukulla Damoder Reddy) మరో నేత భేటీ అయ్యి కీలక మంతనాలు జరిపారు. పార్టీలో చేరితే ఇచ్చే ప్రాధాన్యత విషయాలపై ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలు.. మల్లుతో చర్చించారు. అనంతరం అక్కడ్నుంచి నేరుగా బెంగళూరుకు పిలుపు రావడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో (TPCC Chief Revanth Reddy) కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు వెళ్లారు. వీరితో పాటు కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడు రాజేష్ కూడా ఉన్నారు. అయితే.. బెంగళూరు వేదికగా తెలంగాణ నేతలు కీలక భేటీలు జరుగుతుండటం, దీనంతటికి కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో (DK Shivakumar) సమావేశం కావడం కీలక పరిణామమే. మొత్తం డీకే సమక్షంలోనే చర్చలు జరిగాయి. అనంతరం ఈ పరిణామాలన్నింటినీ కాంగ్రెస్ హైకమాండ్‌తో చెప్పి డీకే, రేవంత్ సంప్రదింపులు జరిపారు. ఇప్పటికే జూపల్లి, పొంగులేటి, దామోదర్‌ల చేరిక కాంగ్రెస్‌లో అని తేలిపోయింది. మరో రెండ్రోజుల్లో ఈ ముగ్గురూ మీడియా ముందుకు వచ్చి.. కాంగ్రెస్ కండువా కప్పుకోవడంపై అధికారిక ప్రకటన చేయబోతున్నారు.
ఇవాళ ఇలా..!
బెంగళూరు సమావేశం ముగిశాక ఆదివారం నాడు హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పొంగులేటి, జూపల్లి భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరే ముందు పార్టీ ముఖ్యనేతలను ఒక్కొక్కరిగా జూపల్లి కలుస్తున్నారు. కోమటిరెడ్డి నివాసానికి శ్రీధర్ బాబుతో కలిసి వచ్చిన పొంగులేటి.. ఎంపీతో భేటీ అయ్యారు. అయితే మీడియా ఉండటంతో పొంగులేటి ముఖం చాటేసి వెళ్లిపోయారు. అయితే సమావేశం అనంతరం జూపల్లి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ టీ తాగడానికి మాత్రమే కోమటిరెడ్డి దగ్గరికి వచ్చాను. ఏ పార్టీలో చేరుతానో ఇంకా డిసైడ్ అవ్వలేదు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాను’ అని జూపల్లి చెప్పుకొచ్చారు. ఇన్ని భేటీలు, కీలక మంతనాలు జరిగిన తర్వాత కూడా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని జూపల్లి చెబుతుండటం గమనార్హం.
కోమటిరెడ్డి ఏమన్నారంటే..
‘ నల్గొండలో జూన్-18 లేదా 19న ప్రియాంక గాంధీ సభ ఉంటుంది. ప్రియాంక సభ తర్వాత కాంగ్రెస్ ఎలా ఉంటుందో చూడండి. వైఎస్ షర్మిల పార్టీలోకి వస్తే మాకు మంచిదే.జూపల్లి నేను పాత మిత్రులం. కాంగ్రెస్‌లోకి వస్తే బాగుంటుందని జూపల్లికి నేను చెప్పాను. క్షేత్రస్థాయిలో మా పార్టీ బలం చూసి కేసీఆర్ భయపడుతున్నారు. మా ప్రభుత్వం రాగానే ప్రజాదర్బార్ నిర్వహిస్తాం. జగదీశ్వర్ రెడ్డి హైట్ ఎంత ఉంది? ఆయన ఏం మాట్లాడుతున్నారు..?. నేను శ్రీధర్ బాబు ఎలా ఉన్నాం? జగదీష్ రెడ్డి ఎలా ఉన్నాడు?.. మేం ప్రజల నుండి వచ్చిన నాయకులం. జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు ఉంటారు.. రేపు పోతారు’ అని కోమటిరెడ్డి మీడియాకు వెల్లడించారు. మరోవైపు శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. వైఎస్ షర్మిల- డీకే శివ కుమార్‌లు వ్యక్తిగత పరిచయంతో కలిశారని.. చేరికల విషయంలో అధిష్ఠానందే తుది నిర్ణయమన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీ లేదని కేసీఆర్ ప్రచారం చేస్తున్నారని శ్రీధర్ మండిపడ్డారు.
మొత్తానికి చూస్తే.. కాంగ్రెస్‌లో చేరికలు దాదాపు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. జూపల్లి, పొంగులేటి, కూచుకళ్ల అయితే ప్రస్తుతానికి రెడీ అయిపోయారు. ముహూర్తం ఫిక్స్ చేసుకోవడం మాత్రమే మిగిలుంది. ఎవరి సమక్షంలో పార్టీలో చేరతారో..? వీళ్లంతా పార్టీలో చేరాక ఆయా నియోజకవర్గాల్లో, జిల్లాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
******************************
ఇవి కూడా చదవండి..
******************************
CBN Vs KCR : కేసీఆర్‌కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ రె‘ఢీ’.. గట్టిగానే ప్లాన్ చేశారుగా..!
******************************
BRS Vs Congress : తెలంగాణలో మారిపోతున్న పాలిటిక్స్.. కాంగ్రెస్‌లో చేరికపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. మరో అసంతృప్త నేత కూడా..
******************************
TS BJP : హస్తినలో బిజిబిజీగా ఈటల రాజేందర్.. హైకమాండ్ ఇచ్చే కీలక పదవి ఇదే..?
******************************
Apsara Murder Case : శంషాబాద్ అప్సర హత్యకేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి.. పిన్ టూ పిన్ వివరాలు ఇవే..!
******************************
TS BJP : హమ్మయ్యా.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు, బీఆర్ఎస్‌తో సంబంధాలపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది..!
******************************
Updated Date - 2023-06-11T16:30:07+05:30 IST