ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kala Venkatarao: జగన్‌పై కళా వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు.. హిందూజా భూములను సీఎంకు..

ABN, First Publish Date - 2023-03-03T19:07:27+05:30

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (YSR Congress Party President), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) పై టీడీపీ (TDP) సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. జగన్ అవినీతి వల్లే విద్యుత్ వినియోగదారులపై భారం పడిందని ఆయన ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (YSR Congress Party President), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) పై టీడీపీ (TDP) సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. జగన్ అవినీతి వల్లే విద్యుత్ వినియోగదారులపై భారం పడిందని ఆయన ఆరోపించారు. ఏపీలో విద్యుత్ వినియోగదారులపై రూ.55,273 కోట్ల భారం పడిందని, రూ.3,082 కోట్లు 2021-22 కొనుగోళ్ల భారాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేస్తామనడం అన్యాయమని కిమిడి కళావెంకట్రావు అన్నారు. తన బినామీ కంపెనీ అయిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ (SHIRDI SAI ELECTRICALS) కు రూ.2,629 కోట్లు విలువైన బిల్లులు చెల్లించారని కిమిడి కళావెంకట్రావు ఆరోపించారు. హైదరాబాద్లోని హిందూజా భూముల (Hinduja lands)ను జగన్కు క్విడ్ ప్రోకో (Quid pro quo)లో కట్టబెట్టేందుకు ప్రభుత్వం ఆ కంపెనీకి రూ.1,234 కోట్లు అప్పు తెచ్చి చెల్లిస్తోందని కిమిడి ఆరోపించారు.

జగన్ లూఠీ, అవినీతికి విద్యుత్ వినియోగదారులు బలి అవ్వాలా? అని కిమిడి ప్రశ్నించారు. డిస్కమ్లకు (Discoms) చెల్లించాల్సిన ప్రభుత్వ బకాయిలపై ఈఆర్సీ దృష్టిపెట్టకుండా వినియోగదారులపై భారాలు మోపడం ఎంతవరకు న్యాయం? అని కిమిడి అన్నారు. విశాఖ పారిశ్రామిక సదస్సు ఒక ఎన్నికల స్టంట్ మాత్రమేనని కిమిడి కళావెంకట్రావు మండిపడ్డారు. నాలుగేళ్లలో విద్యుత్ రంగానికి జగన్ రెడ్డి చేసిందేమిటి?, సోలార్, విండ్ పీపీఏలను రద్దు చేశాడని,.. (గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల Green energy plants)పై దాడులు చేయించాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటించారని, ఒక్క యూనిట్ అదనపు విద్యుత్ ఉత్పత్తి చేయలేదని కిమిడి కళావెంకట్రావు ఆక్షేపించారు.

ఇటీవల టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు (Kala Venkatarao) మాట్లాడుతూ సీఎం జగన్ రెడ్డికి (CM Jagan) ఇవే ఆఖరు ఎన్నికలని అన్నారు. మాచర్ల (Macherla) ఘటనపై స్పందించిన ఆయన జగన్ ప్రభుత్వంపై జనం విసిగెత్తిపోయారని,.. నిన్నటి మంత్రులు, ఎమ్మెల్యేల భేటీతో సీఎం సౌండ్ తగ్గిందన్నారు. రానున్న ఎన్నికల తర్వాత జగన్రెడ్డి ప్యాలెస్కే పరిమితమవుతారన్నారు. అరాచకం, కిరాతకంతో వైసీపీ ప్రభుత్వం కూడినదని,.. పుంగనూరు, మాచర్ల వంటి పలు ఘటనలు అందుకు సాక్ష్యాలని కిమిడి కళావెంకట్రావు మండిపడ్డారు.

మాచర్ల ఘటనలో పోలీసుల వైఫల్యం లేదని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ రవిశంకర్ తెలిపారు. టీడీపీ కార్యాలయాన్ని ఎవరూ తగులబెట్టలేదని, కేవలం ఫర్నీచర్ కొంత బయట వేసి నిప్పుపెట్టారన్నారు. కిరాయి హంతకులు మాచర్లలో ఉన్నారన్న సమాచారంతో కార్డన్ సెర్చ్ చేశామని, కాని పెద్దగా అనుమానితులు దొరకలేదన్నారు. గతంలో ఫ్యాక్షన్లో ఉన్న వాళ్లు రాత్రి ఘర్షణల్లో పాల్గొన్నారని, వారందరిని గుర్తిస్తున్నామన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

అందుకే ఎమ్మెల్సీ కవిత కొత్త డ్రామాలు ఆడుతున్నారు

Updated Date - 2023-03-03T19:11:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!