కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Modi TS Tour : మోదీ వరంగల్ వచ్చివెళ్లాక తెలంగాణ బీజేపీలో ఒకటే గుసగుస.. దేని గురించంటే..?

ABN, First Publish Date - 2023-07-08T19:04:03+05:30

అవును.. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనతో (Modi Telangana Tour) కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటికొచ్చాయి..! వరంగల్‌లోని హన్మకొండ వేదికగా బీజేపీ భారీ బహిరంగ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు ప్రధానితో పాటు పలువురు కేంద్ర ముఖ్యనేతలు, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy), ఎంపీ బండి సంజయ్‌తో (MP Bandi Sanjay) పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు...

Modi TS Tour : మోదీ వరంగల్ వచ్చివెళ్లాక తెలంగాణ బీజేపీలో ఒకటే గుసగుస.. దేని గురించంటే..?
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవును.. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనతో (Modi Telangana Tour) కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటికొచ్చాయి..! వరంగల్‌లోని హన్మకొండ వేదికగా బీజేపీ భారీ బహిరంగ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు ప్రధానితో పాటు పలువురు కేంద్ర ముఖ్యనేతలు, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy), ఎంపీ బండి సంజయ్‌తో (MP Bandi Sanjay) పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మోదీ సభ ముగించుకుని ఢిల్లీకెళ్లారో లేదో ఈ సభలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు ఇప్పుడు అటు మీడియా.. ఇటు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో చర్చనీయాంశం అయ్యాయి. అంతేకాదు.. బీజేపీ శ్రేణులు కూడా ఒకింత అసంతృప్తికి లోనైంది. ఇంతకీ సభలో ఏం జరిగింది..? ఎందుకింతలా చర్చనీయాంశం అయ్యింది..? బీజేపీ శ్రేణులు, అగ్రనాయకత్వం ఏమంటోంది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..


Modi-and-Bandi-Kishan.jpg

ఇదీ అసలు కథ..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించాక వరంగల్ సభలో కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి తొలి అగ్నిపరీక్ష ఎదుర్కొన్నారు..! ఈ పరీక్షలో పాసయ్యారా..? లేదా..? అనే సంగతి అటుంచితే.. ఇప్పుడంతా సభ ఎలా సాగింది..? ప్రసంగంలో ఎవరు అదరగొట్టారు..? కొత్త అధ్యక్షుడు ఎలా మాట్లాడారు.. ఏం మాట్లాడారు..? బండి సంజయ్ ఎలా మాట్లాడారు..? ఈ ఇద్దరిలో ఎవరు తమ ప్రసంగంతో జనాల్ని మెప్పించారు..? అనేదే ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. First Impression Is The Best Impression అనేది అందరికీ తెలిసిందే. అయితే.. కిషన్ రెడ్డి తొలి బహిరంగ సభతో.. ఆయన ప్రసంగంతో మెప్పించలేకపోయారని బీజేపీ శ్రేణుల నుంచి కామెంట్స్ వస్తున్నాయి. కిషన్ రెడ్డి మాట్లాడుతున్నంత సేపు విమర్శలు చేసినా, బీజేపీ గురించి చెప్పుకున్నా ఆశించినంతగా ప్రసంగం సాగలేదనే టాక్ పార్టీలో గట్టిగానే సాగుతోంది. ఎందుకంటే ఎక్కడా పదునైన మాటలు, అగ్రెసివ్‌గా మాట్లాడినట్లుగానీ లేదు. దీంతో సభకు వచ్చిన సభికులు, బీజేపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు. వాస్తవానికి కిషన్‌కు ఈ పదవి స్వీకరించడం.. ఇలా బహిరంగ సభల్లో మాట్లాడటం కొత్తేమీ కాకపోయినప్పటికీ ఇప్పుడు బీజేపీలో ఉన్న పరిస్థితుల్లో కచ్చితంగా జోరు పెంచాల్సిందేనని సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు, బీజేపీ వీరాభిమానులు సూచిస్తున్నారు.

బండి ప్రసంగం ఇలా..!?

బండి సభకు హాజరయ్యారో లేదో ఆయన్ను అలా స్టేజ్‌మీద చూసిన బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఈలలు, కేకలతో హోరెత్తించారు. మరోవైపు నినాదాలతో సభా ప్రాంగణం మొత్తం మార్మోగిపోయింది. ఇక ప్రసంగం మునుపటిలా అంత యాక్టివ్‌గా మాట్లాడకపోయినప్పటికీ చెప్పాల్సింది చెప్పి.. ముగించేశారు. ఒకానొక సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా.. అటు బండి ప్రసంగాన్ని.. ఇటు జనాల రియాక్షన్‌ను కళ్లార్పకుండా చూసిన పరిస్థితి. ఎందుకంటే ఆ రేంజ్‌లో బండి ప్రసంగం.. అభిమానుల నినాదాల మోత ఉంది!. బండి సంజయ్‌కు ఉన్న క్రేజ్, రేంజ్ ఇదీ అధిష్టానానికి అర్థమైంది కదూ.. అని ఆయన వీరాభిమానులు సోషల్ మీడియాలో పోస్టులతో వైరల్ చేస్తున్నారు. బండికి కిషన్ రెడ్డికి ఎంత తేడా అనేది క్లియర్‌కట్‌గా అర్థమయ్యింది కదా అంటూ అని మరికొందరు కార్యకర్తలు ట్విట్టర్‌లో హోరెత్తిస్తున్నారు. వాస్తవానికి.. బహిరంగ సభల్లో, ప్రెస్‌మీట్‌లో బండి పదునైన మాటల తూటాలతో దూసుకెళ్లేవారు. బండి మాట్లాడుతున్నంత సేపు పార్టీ శ్రేణులు టీవీలు, యూట్యూబ్‌లకు అతుక్కుపోయేవారు. ఎందుకంటే పంచ్‌లు, విమర్శల వర్షం వేరేలా ఉండేది. ఇప్పుడు అధ్యక్ష పదవి పోయాక కూడా.. అదే పంథాను బండి కొనసాగించారు. దీంతో అభిమానులు ఒకింత ఎమోషనల్ కూడా అయ్యారు. ‘నిజమైన కార్యకర్త మీరే బండన్నా’ అని కార్యకర్తలు ట్వీట్లు చేస్తున్నారు.

రియాక్షన్స్ ఇలా..!?

కిషన్ రెడ్డి ప్రసంగంలో గట్టి విమర్శలు, పదునైన పదాలు ఎక్కడా కనిపించకపోవడంతో అగ్రనాయకత్వం ఒకింత అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. ప్రసంగంలో మార్పు రావాలని.. ఇలాగైతే కష్టమని సొంత పార్టీలో నేతలు చర్చించుకుంటున్న పరిస్థితట. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి యువమోర్చా, ఎమ్మెల్యే, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, రెండోసారి అధ్యక్ష పదవిలో.. ఇంత సీనియార్టీ ఉన్న కిషన్ రెడ్డి రాటుతేలాల్సింది.. ఇలాంటి ప్రసంగాలు చేస్తే ఎలా..? అని ఓ ముఖ్యనేత ఢిల్లీ నుంచి కాల్ చేసి ప్రశ్నించినట్లు తెలియవచ్చింది. ఇటు బీజేపీ కార్యకర్తలు, అభిమానుల నుంచి కూడా కిషన్‌పై ఇదే స్పందన వస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత.. అసలే బీజేపీ మూడోస్థానానికి పడిపోవడం.. కాంగ్రెస్ యమా జోష్ మీద ఉంది. ఈ పరిస్థితుల్లో నేతలను, కార్యకర్తలను కాపాడుకోవాలి.. అంతకుమించి మాట తీరు మార్చి బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టాల్సిందేనని ఢిల్లీ నుంచి వచ్చిన ఫోన్‌లో క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డిలో ఎప్పుడు మార్పు వస్తుందో.. పార్టీ శ్రేణులు, అగ్రనాయకత్వం మెప్పును ఎప్పుడు పొందుతారో వేచి చూడాల్సిందే మరి.


ఇవి కూడా చదవండి


Bandi Sanjay : బండి సంజయ్ అసంతృప్తి చల్లారేది అప్పుడేనా.. తెరపైకి సరికొత్త డిమాండ్..!?


BRS Vs Congress : కేసీఆర్‌కు ఊహించని ఝలక్.. ‘కారు’ దిగడానికి సిద్ధమైన బిగ్ బ్రదర్స్.. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏమిటంటే..!?


Kishan Reddy : ‘బండి’ని తప్పించి మరీ కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వడం వెనుక ఇంత కథుందా.. అది కూడా రెండోసారి..!?


TeluguDesam : ఎన్డీఏ మీటింగ్‌కు టీడీపీ.. తర్వాత జరగబోయేది ఇదేనా..?


Telangana BJP : ‘బండి’ని తప్పించాక యమా స్పీడ్‌ మీదున్న ఈటల.. ఈ అస్త్రాలన్నీ ప్రయోగించబోతున్నారా..!?


Updated Date - 2023-07-08T19:19:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising