AV Subbareddy Vs Akhila : లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్తత.. ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ వర్గం దాడి.. తీవ్ర గాయాలు..
ABN, First Publish Date - 2023-05-16T22:02:51+05:30
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో (Nara Lokesh Yuvagalam) ఉద్రిక్తత చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా టీడీపీ నేత, బోండా ఉమా మహేశ్వరరావు వియ్యంకుడు ఏవీ సుబ్బారెడ్డిపై (AV Subbareddy) మాజీ మంత్రి భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya) వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు..
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో (Nara Lokesh Yuvagalam) ఉద్రిక్తత చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా టీడీపీ నేత, బోండా ఉమా మహేశ్వరరావు వియ్యంకుడు ఏవీ సుబ్బారెడ్డిపై (AV Subbareddy) మాజీ మంత్రి భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya) వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఏవీ నోటీ నుంచి రక్తం కారడం ఆయన అభిమానులు, కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తోంది. లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra) 101వ రోజుకు చేరుకుంది. ఇవాళ నంద్యాల-ఆత్మకూరు (Nandyal-Atmakur) రోడ్డులో పాదయాత్ర సాగుతుండగా.. అటు అఖిల.. ఇటు ఏవీ సుబ్బారెడ్డి తమ బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సుబ్బారెడ్డి.. దమ్ముంటే డైరెక్ట్‌గా కక్ష తీర్చుకోవాలంటూ సవాల్ విసిరారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గీయులను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోనికి వచ్చింది.
భూమా మరణాంతరం..!
భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి ఇద్దరూ ప్రాణ స్నేహితులు. భూమా బతికున్నంత వరకూ అన్నీ తానై చూసుకున్న ఏవీ.. ఆయన మరణాంతరం ఒక్కసారిగా విబేధాలొచ్చాయి. నాటి నుంచి తాను రాజకీయాల్లోకి రావాలని ఏవీ ప్లాన్ చేసుకున్నారు. అంతేకాదు.. అయితే నంద్యాల, లేకుంటే ఆళ్లగడ్డ నుంచి పోటీచేయాలని ఏవీ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో అఖిల ప్రియ వర్సెస్ ఏవీగా పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటి వరకూ ఈ రెండు వర్గాల మధ్య ఎన్నిసార్లు గొడవలు జరిగాయో లెక్కలేదు. ఆ మధ్య ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ భర్త నేతృత్వంలో హత్యకు ప్లాన్ చేయడాన్ని కూడా కడప జిల్లా పోలీసులు గుర్తించిన కేసులు పెట్టిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమే అయ్యింది. నాటి నుంచి నేటి వరకూ ఈ రెండు వర్గాల వారు ఎక్కడ ఎదురుపడినా కొట్లాటలు.. ఎప్పుడు మీడియా ముందుకొచ్చిన మాటల తూటాలు పేలుతున్నాయి.
అసలేం జరిగింది..!?
రానున్న ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న.. తనకే కచ్చితంగా టికెట్ వస్తుందన్న ధీమాతో సుబ్బారెడ్డి ఉన్నారు. ఈ విషయాన్ని లోకేష్ పాదయాత్ర ద్వారా అందరికీ తెలియజేయాలని భావించిన ఏవీ సుబ్బారెడ్డి తన బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో ఎవరు ఎవర్ని రెచ్చగొట్టుకున్నారో.. లేకుంటే పనిగట్టుకుని మరీ ఇలా దాడిచేశారో తెలియట్లేదు కానీ.. పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనపై టీడీపీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుంది..? పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారు..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Updated Date - 2023-05-16T22:12:10+05:30 IST