ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS Politics : ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్.. బండి సంజయ్‌పై పోటీచేసేదెవరంటే..

ABN, First Publish Date - 2023-05-05T21:19:46+05:30

తెలంగాణలో (Telangana) ఎన్నికల సీజన్ దాదాపు వచ్చేసినట్లే.. పార్టీల అధినేతలు వరుస సమావేశాలు, బహిరంగ సభలతో బిజిబిజీగా గడుపుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణలో (Telangana) ఎన్నికల సీజన్ దాదాపు వచ్చేసినట్లే.. పార్టీల అధినేతలు వరుస సమావేశాలు, బహిరంగ సభలతో బిజిబిజీగా గడుపుతున్నారు. మరోవైపు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికలకు ఎలా ప్లాన్ చేసుకోవాలనేదానిపై వ్యూహాలు రచిస్తున్నారు. అభ్యర్థుల విషయంలో ఒక అడుగు ముందుకేసిన బీఆర్ఎస్ (BRS) ఇటీవల ఎమ్మెల్యే టికెట్లు విషయంలో క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాదు.. పద్ధతి మార్చుకోకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయని మరికొందరు ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ (CM KCR) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి పంపారు. ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో సీఎం ఇలా ఉంటే.. ఎంపీ అభ్యర్థులు గురించి మంత్రి కేటీఆర్ (Minister KTR) చూసుకుంటున్నారట. ఇందులో భాగంగానే కరీంనగర్ ఎంపీ అభ్యర్థిని కేటీఆర్ ప్రకటించేశారు.

బండిపై పోటీచేసేది ఈయనే..

శుక్రవారం నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హుస్నాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై పోటీచేసే అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్‌‌ను ప్రకటించారు. ఇదే కార్యక్రమంలో బండిపై ప్రశ్నల వర్షం కురిపించారు.బీజేపీ ఎంపీగా ఉన్న బండి సంజయ్ నాలుగేండ్లలో ఏం చేశాడో చెప్పే దమ్మందా..?. కరీంనగర్ ఎంపీ ఎవరంటే చెప్పుకోవడానికి నాకు సిగ్గు అవుతోంది. కరీంనగర్ ఎంపీగా మళ్ళీ వినోద్‌ను గెలిపించి.. బండి సంజయ్‌ను ఇంటికి పంపాలి. గత ఎన్నికల్లో వినోద్‌‌ను ఎంపీగా గెలిపించుకుంటే కరీంనగర్‌కు ట్రిపుల్‌ ఐటీ వచ్చేది. .బండి సంజయ్.. ఓ గుడి, బడి, యూనివ‌ర్సిటీ కట్టలేదు. కేవలం మతాల పేరుతో రెచ్చగొట్టడం తప్ప చేసిందేమీ లేదు అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాగా.. కేటీఆర్ ప్రకటనతో ఎంపీ అభ్యర్థిగా వినోద్ పేరు ఖరారైంది. కాగా ప్రస్తుతం వినోద్ తెలంగాణ ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత పార్టీ జాతీయ వ్యవహారాలన్నింటినీ వినోదే చక్క బెడుతున్నారని చెబుతుంటారు.

మొత్తానికి చూస్తే.. బండిపై ఎవరు పోటీచేస్తారా అనేదానిపై గత కొన్నిరోజులుగా సందిగ్ధత నెలకొంది. అంతేకాదు.. వినోద్ ఎమ్మెల్యేగా పోటీచేస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే కేటీఆర్ తాజా ప్రకటనతో ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Balineni : తీవ్ర భావోద్వేగానికి లోనైన బాలినేని.. ఈసారి ఏకంగా..

******************************

Kotam Reddy : వైసీపీలో పెను ప్రకంపనలు రేపుతున్న కోటంరెడ్డి కామెంట్స్.. త్వరలోనే అంతా చెప్పేస్తానంటూ సంచలనం..

******************************

Rains In AP : వైఎస్ జగన్ అలా.. చంద్రబాబు ఇలా.. ఏపీ ప్రజలారా ఈ సీన్ చూశాక..!

******************************

Revanth Reddy : ప్రియాంక చేతుల మీదుగా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్..

******************************

Updated Date - 2023-05-05T22:22:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising