ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS BJP : గంట వ్యవధిలోనే మాట మార్చేసిన ఎమ్మెల్యే రఘునందన్.. అబ్బే అదంతా తూచ్..!

ABN, First Publish Date - 2023-07-03T20:02:54+05:30

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (MLA Raghunandan Rao) మాట మార్చేశారు. పదేళ్లుగా పార్టీ కోసం శ్రమిస్తున్నా ఎలాంటి పదవి లేకపోవడంతో గత కొన్నిరోజులుగా ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారన్న విషయం తెలిసిందే. అంతేకాదు.. దీనికి తోడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (MLA Raghunandan Rao) మాట మార్చేశారు. పదేళ్లుగా పార్టీ కోసం శ్రమిస్తున్నా ఎలాంటి పదవి లేకపోవడంతో గత కొన్నిరోజులుగా ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారన్న విషయం తెలిసిందే. అంతేకాదు.. దీనికి తోడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. మరోవైపు తన ముఖ్య అనుచరుల దగ్గర పదవుల విషయంలో అన్యాయం జరుగుతోందని త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని కూడా వార్తలు గుప్పుమన్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఢిల్లీ (Delhi) నుంచి పిలుపొచ్చింది. అయితే.. హస్తినకు వెళ్లిన తర్వాత కూడా కేంద్ర, రాష్ట్ర నాయకత్వంపై, ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ కామెంట్స్ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ హాట్ టాపిక్ అయ్యాయి. అయితే.. గంట వ్యవధిలోనే ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. అబ్బే.. తాను ఆ కామెంట్స్ చేయలేదని ఏదో సరదాగా అంటే మీడియా చానెల్స్ సీరియస్‌గా తీసుకున్నాయని మాట మార్చేశారు.

అంతా తూచ్..!

నేను పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించేవాడిని కాదు. నేను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. బీజేపీ కోసం పదేళ్లుగా శ్రమిస్తున్నాను. పార్టీలో పదవులు కోరుకోవడం తప్పుకాదు. నేను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని తపిస్తున్నాను. నేను సరదాగా మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. కొన్ని టీవీ చానెల్స్‌లో కొంతమంది మిత్రులు నామీద ఉన్న ప్రేమతో (సెటైరికల్‌గా) నేను అనని మాటలను అన్నట్లుగా ప్రసారం చేశారు. గౌరవనీయులు ఆల్ ఇండియా బీజేపీ అధ్యక్షుడు నడ్డాగారిని, హోం మంత్రి అమిత్ షా గారిని తప్పుగా మాట్లాడినట్లు మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నాయి. మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా.. నేను ఇవాళ ఎక్కడా ప్రెస్‌మీట్ పెట్టలేదు. కనీసం ఆఫ్ ది రికార్డ్ చిట్చాట్ కూడా చేయలేదు. దుబ్బాక నియోజకవర్గం నిధుల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలవడానికి వెళ్లినప్పుడు కొందరు మీడియా మిత్రులు కనిపించగా టీ తాగుతూ సరదాగా మాట్లాడాను. ఆ సమయంలో నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్లు కథనాలు వచ్చాయి. దయచేసి మరోసారి ఇలా తప్పుడు కథనాలు ప్రచురించొద్దు. తప్పుగా ప్రచురించిన, ప్రసారం చేసిన కథనాలను దయచేసి ఉపసంహరించుకోవాలి. అధికారికంగా, అనధికారికంగా పార్టీ శ్రేయస్సు కోసమే పనిచేశానే తప్ప.. రాష్ట్ర, కేంద్ర నాయకత్వాలను ధిక్కరించి మాట్లాడలేదు. తక్షణమే తప్పుడు కథనాలను మీడియా ప్రతినిధులు నిలిపేయాలని కోరుతున్నాను. మీడియాలో పనిచేసి వచ్చిన వ్యక్తిగా నేను రెక్వెస్ట్ చేస్తున్నాను. తెలంగాణ బీజేపీలో మార్పులు, చేర్పులపై కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటానుఅని మీడియాను రఘునందన్ రావు కోరారు.

ఇంతకీ రఘు ఏమన్నారు..?

నాకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలి. మూడు పదవుల్లో ఏదో ఒక పదవి ఇవ్వాలి. అందుకలో ఒకటి పార్టీ అధ్యక్ష పదవి, ఇంకొకటి ఫ్లోర్ లీడర్.. మరొకటి జాతీయ అధికార ప్రతినిధి. పదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నాను.. నేనెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాకూడదు. కొన్ని విషయాల్లో నా కులమే నాకు శాపం కావచ్చు. రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుంది. రెండోసారి కూడా దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తాను. దుబ్బాకకు అమిత్ షా (Amit Shah) వచ్చి ప్రచారం చెయ్యలేదు. నాకు దుబ్బాక ఎన్నికల్లో ఎవరూ సాయం చెయ్యలేదు. నేను పార్టీలో ఉండాలని అనుకుంటున్నాను. మునుగొడులో రూ. 100 కోట్లు పెట్టిన బీజేపీ గెలవలేదు. సొంతంగానే నేను దుబ్బాక ఎన్నికల్లో గెలిచాను. అదే రూ. 100 కోట్లు నాకిస్తే తెలంగాణను దున్నేసేవాడిని. దుబ్బాకలో నన్ను చూసే ప్రజలు గెలిపించారు.. బీజేపీని చూసి కాదు. నాకంటే ముందు బీజేపీ పోటీచేస్తే 3500 ఓట్లు వచ్చాయి. బండి సంజయ్‌(Bandi Sanjay)ది స్వయం కృతాపరాధం.. పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన సంజయ్‌కు వంద కోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చేంత డబ్బు ఎక్కడిది. పార్టీ డబ్బులో నాకూ వాటా ఉంది. పేపర్ ప్రకటనలలో తరుణ్ చూగ్ (Tarun Choog), సునీల్ బాన్సల్‌ (Sunil Bansal) బొమ్మలు కాదు.. రఘునందన్ (Raghunandan), ఈటెల రాజేందర్ (Etela Rajender) బొమ్మలుంటే ఓట్లు వేస్తారు. పార్టీకి శాసనసభపక్ష నేత లేడనే విషయం జేపీ నడ్డా (JP Nadda)కు తెలియదుఆ విషయమై ప్రశ్నిస్తే అదేంటి అంటూ నన్నే నడ్డా అడిగారు. నేను గెలిచినందుకే ఈటెల పార్టీలోకి వచ్చారు. బండి సంజయ్ మార్పుపై మీడియాలో వస్తున్నవన్నీ నిజాలే. పదేళ్లలో పార్టీ కోసం నాకంటే ఎక్కువ ఎవరు కష్టపడలేదుఅని రఘునందన్ రావు అన్నారు. అయితే ఈ కామెంట్స్ చేసిన తర్వాతే తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని.. ప్రత్యేకంగా మీడియా మీట్ నిర్వహించి మరీ పై విధంగా వివరణ ఇచ్చుకున్నారు.


ఇవి కూడా చదవండి


Hyderabad : తార్నాకలో దారుణం.. యువతికి లిఫ్ట్ ఇచ్చి లైంగిక దాడి.. బైక్‌పై నుంచి దూకడంతో..


Bandi Sanjay : ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ చెప్పిందే జరిగింది.. కేంద్ర కేబినెట్‌లోకి ‘బండి’.. అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి.. ఈటల పరిస్థితేంటంటే..!?


TS Congress Manifesto : తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. ఇవన్నీ అందులో ఉంటాయా.. అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు..!?


Updated Date - 2023-07-03T20:08:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising