ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Adilabad: జిల్లాలో అడిగినంత ఎమ్మెల్యేలకు ఇవ్వకుంటే పనులు కావు.. బట్టబయలైన వసూళ్ల వ్యవహారం..!

ABN, First Publish Date - 2023-03-15T12:33:04+05:30

బీఆర్ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో గులాబీ బాస్‌కు కోపమొచ్చింది. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఝలక్ ఇచ్చారా?.. దళిత బంధు పథకంలో వసూళ్లపై కన్నెర్ర చేశారా?.. ప్రభుత్వ పథకాల్లో వసూళ్ల పర్వం మరోసారి తెరపైకి వచ్చిందా?.. సొంత పార్టీ నేతలే అధినేతకు ఫిర్యాదులు చేశారా?.. వసూళ్ల వ్యవహారం ఇద్దరు ఎమ్మెల్యేల పుట్టి ముంచనుందా?.. ఇంతకీ.. వసూళ్లకు పాల్పడ్డ నేతలెవరు?.. వసూళ్ల వ్యవహారం సడెన్‌గా ఎందుకు తెరపైకి వచ్చింది?..అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం.

బహిరంగంగా హెచ్చరించడంపై చర్చోపచర్చలు

బీఆర్ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో గులాబీ బాస్‌కు కోపమొచ్చింది. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో జరుగుతున్న అవినీతిపై కన్నెర్ర చేశారు. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన కొందరు నేతలు దళితబంధు లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు సమాచారం ఉందని, తీరు మార్చుకోవాలని కేసీఆర్‌ బహిరంగంగా హెచ్చరించడంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఆ క్రమంలో.. ఆదిలాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సాగుతున్న వసూళ్ల దందా మళ్ళీ తెరపైకి వస్తోంది. నిజానికి.. బోథ్ నియోజకవర్గంలో వసూళ్లపై నిత్యం రగడ సాగుతోంది.

అక్కడ బీఆర్ఎస్‌లో తీవ్రమైన వర్గపోరు ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం నడుస్తోంది. బోథ్‌లో దళిత బంధు మాత్రమే కాదు.. ఏ స్కీమ్‌లోనైనా లబ్ధిదారులు అడిగినంత ఇవ్వకుంటే పనులు కావన్న చర్చ జోరుగా సాగుతోంది. సాక్షాత్తూ.. బీఆర్ఎస్ ముఖ్య నేతలే అనేకసార్లు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుపై బహిరంగ ఆరోపణలు చేశారు. లోకల్ బాడీ ఎలక్షన్స్‌ టికెట్ల కోసమూ కార్యకర్తల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు ప్రచారం ఉంది. స్థానిక సంస్థల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, ఉపాధి హామీ పనులు, చివరికి కళ్యాణలక్ష్మి లాంటి స్కీముల్లోనూ అందినంత దండుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఎమ్మెల్యే సన్నిహితులే పెద్ద మొత్తంలో వసూళ్లు

ప్రధానంగా.. దళితబంధులో మండల స్థాయి బీఆర్ఎస్ నేతలు లబ్ధిదారుల దగ్గర 2 లక్షల నుంచి 5లక్షల వరకు వసూల్ చేసినట్టు, ఇంకా చేస్తున్నట్టు టాక్‌ నడుస్తోంది. దానిపై జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో గొడవ జరిగింది. వసూళ్లు నిజమేనని, ఒక ఎమ్మెల్యే సన్నిహిత నాయకులు పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తున్నారని విపక్ష నేతలు ఆరోపించారు. ఆ ఆరోపణలకు కొందరు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మద్దతు కూడా పలికారు. దాంతో.. గత నాలుగేళ్లుగా జరిగిన వసూళ్ల దందాపై ఎప్పటికప్పుడు సీఎంవోకి ఫిర్యాదులు చేస్తున్నారు. నిఘా వర్గాలు కూడా నివేదించడంతో కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా.. ఖానాపూర్ నియోజకవర్గంలో వసూళ్ల దందాపై మొదటి నుంచి తీవ్రమైన ఆరోపణలున్నాయి. అక్కడ దళితబంధు లబ్ధిదారుల నుంచి 30 నుంచి 50 శాతం దండుకుంటున్నట్టు ఫిర్యాదులు వెళ్లాయి. దళితబంధు ఆశించి భంగపడ్డ పలువురు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తోంది. పంచాయతీ నిధుల నుంచి మొదలు గుట్కా వ్యాపారుల వరకు ఏ ఒక్కరినీ వదలడం లేదన్న టాక్‌ ఉంది. అన్ని ప్రభుత్వ పథకాల్లోనూ వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అంతేకాదు.. ఇప్పటివరకు పార్టీ వీడిన నేతలంతా ఎమ్మెల్యే రేఖానాయక్‌పైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అయితే.. ఆ ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించినా.. నియోజకవర్గంలోని పరిణామాలపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి.

ప్రతి నెలా 10 లక్షల చొప్పున మామూళ్లు

ఇదిలావుంటే.. అన్నింటికిమించి ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త, రవాణా శాఖ అధికారి శ్యాంనాయక్‌ కూడా వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన పని చేస్తున్న రవాణా శాఖతోపాటు గులాబీ పార్టీలోనూ కలకలం రేపుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే కావాలని ఎప్పటినుంచో కలలు కంటున్న ఆయన.. అందుకోసం వేస్తున్న అడుగులు వివాదాస్పదంగా మారుతున్నాయి. ముఖ్యంగా.. ఆలు లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా.. ఇప్పటినుంచే ఎన్నికల నిధుల పేరిట అక్రమ వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఆ క్రమంలో.. ఎన్నికల ఖర్చు కోసం ప్రతి నెలా 10 లక్షల చొప్పున మామూళ్లు ఇవ్వాలని వేధిస్తున్నట్లు సహచర రవాణా శాఖ అధికారులు.. కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఖానాపూర్ నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అయనపై.. పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా గులాబీబాస్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

నిర్మల్, ముథోల్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల

మొత్తంగా.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఒక్క బోథ్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల్లోనే కాదు.. నిర్మల్, ముథోల్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాలలోనూ దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరిట కొందరు బీఆర్ఎస్ నేతలు భారీగా వసూళ్లు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా.. కేసీఆర్ హెచ్చరికలతో రాబోయే రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా బీఆర్ఎస్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

Updated Date - 2023-03-15T12:33:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising