Telangana Elections : తెలంగాణ ఎన్నికల్లో నవతరం.. ఎక్కడ చూసినా కొత్త ముఖాలు!!
ABN, First Publish Date - 2023-11-11T10:08:22+05:30
New Generation In Telangana Assembly Elections : ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కనిపిస్తున్న కొత్త ట్రెండ్ ఏమిటో తెలుసా!? ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎక్కడ చూసినా కొత్త ముఖాలు! బీఆర్‌ఎస్ మినహా అన్ని పార్టీల్లోనూ అత్యధికులు నవతరం! తొలిసారిగా శాసన సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నవారు! వీరిలో కొంతమంది అయితే, అసలు ఎన్నికల బరిలోకి దిగడం ఇదే తొలిసారి!
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కనిపిస్తున్న కొత్త ట్రెండ్ ఏమిటో తెలుసా!? ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎక్కడ చూసినా కొత్త ముఖాలు! బీఆర్‌ఎస్ మినహా అన్ని పార్టీల్లోనూ అత్యధికులు నవతరం! తొలిసారిగా శాసన సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నవారు! వీరిలో కొంతమంది అయితే, అసలు ఎన్నికల బరిలోకి దిగడం ఇదే తొలిసారి! వారిలో కొందరు ఎన్నారైలు! మరికొందరు డాక్టర్లు! ఇంకొందరు మాజీ ప్రభుత్వ ఉద్యోగులు! మరికొందరు నాయకుల వారసులు! వీరంతా ఇప్పుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు! అదృష్టం వరిస్తే.. నేరుగా అసెంబ్లీలోనే ‘అధ్యక్షా..’ అననున్నారు! నాలుగు దశాబ్దాల కిందట టీడీపీని ప్రారంభించినప్పుడు మాత్రమే ఇంత పెద్ద స్థాయిలో రాజకీయాల్లోకి నవతరం అడుగుపెట్టింది. తెలంగాణ రాజకీయాల్లోకి కొత్త నీటి ప్రవాహం ఇప్పుడు ఇంత జోరుగా రావడానికి కారణం లేకపోలేదు! కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల్లోని సీనియర్లను బీ(టీ)ఆర్‌ఎస్ లాగేసింది! వారిలో కొందరికి మళ్లీ టికెట్లు ఇచ్చింది! ఇంకొందరికి మొండిచెయ్యి చూపింది! ఇంకా కొందరికి నామినేటెడ్ పదవులతో సరిపెట్టింది! ఆయా పార్టీల్లో.. ఆయా స్థానాల్లో శూన్యం ఏర్పడింది! దానిని కొత్త తరం భర్తీ చేస్తోంది! కాంగ్రెస్‌లో చాలాచోట్ల కొత్త అభ్యర్థులకు చాన్స్ దక్కింది! ఇక, క్షేత్రస్థాయిలో బీజేపీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుండడంతో ఆ పార్టీలోకి కొత్త నీరు వచ్చింది! కొత్తగా తెరపైకి వచ్చిన బీఎస్పీ నవతరాన్ని బరిలోకి దించుతోంది! ఇలా తెలంగాణ రాజకీయాల్లోకి నవతరం అందులోనూ ఉన్నత విద్యావంతులు అడుగు పెట్టడం శుభ పరిణామమే! వెరసి, అన్ని పార్టీల నుంచీ ఈ ఎన్నికల్లో వంద మందికిపైగానే తొలిసారిగా ఎమ్మెల్యే ఎన్నికల బరిలోకి దిగుతున్నారు! వారిలో కొందరి వివరాలతో.. ‘ఆంధ్రజ్యోతి’ స్పెషల్ ఫీచర్!!
Updated Date - 2023-11-11T11:24:49+05:30 IST