ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana Polls : ఇవాళ నామినేషన్ వేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రముఖులు వీరే..

ABN, First Publish Date - 2023-11-09T22:39:21+05:30

Nomination Day : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి అభ్యర్థులకు ఇక కొన్ని గంటలు మాత్రమే మిగిలుంది. శుక్రవారం నాడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు. అయితే గురువారం మంచి రోజు కావడంతో నామినేషన్లు వేయడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలంతా క్యూ కట్టారు...

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి అభ్యర్థులకు ఇక కొన్ని గంటలు మాత్రమే మిగిలుంది. శుక్రవారం నాడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు. అయితే గురువారం మంచి రోజు కావడంతో నామినేషన్లు వేయడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలంతా క్యూ కట్టారు. ఏకాదశి మంచిరోజు కావడమే ఇందుకు కారణం. ఉదయాన్నే నామినేషన్ పత్రాలను ఇష్ట దేవాలయాల్లో పూజలు చేసి అనంతరం ర్యాలీలతో రిటర్నింగ్ కార్యాలయాలకు బయల్దేరారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ర్యాలీలు, పార్టీల జెండాలు, నినాదాలు.. ఈలలు, కేకలతో నియోజకవర్గాలన్నీ కళకళలాడాయి. మరోవైపు.. బైక్ ర్యాలీ, బహిరంగ సభ, సమావేశాలు కూడా పెద్దఎత్తునే జరిగాయి. ఈ కార్యక్రమాలకు ఆయా పార్టీల శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు ప్రకటించారు. దీంతో పలు నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బంది పడిన నేతలు కొందరు ఉంటే.. ర్యాలీలో పడి అసలు విషయం మరిచిపోయి చివరి నిమిషంలో ఉరుకులు, పరుగులు తీస్తూ వెళ్లి నామినేషన్ వేయాల్సిన పరిస్థితి.


బీఆర్ఎస్ తరఫున.. :-

సీఎం కేసీఆర్ : గజ్వేల్‌, కామారెడ్డి

కేటీఆర్ : సిరిసిల్ల

హరీశ్ రావు : సిద్దిపేట

ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి : నిర్మల్‌

శ్రీనివాస్ గౌడ్ : శ్రీనివాస్ గౌడ్

కొప్పుల ఈశ్వర్ : ధర్మపురి

చింతా ప్రభాకర్ : సంగారెడ్డి

పద్మా దేవేందర్ రెడ్డి : మెదక్‌

నోముల భగత్ : నాగార్జున సాగర్‌

చిరుమర్తి లింగయ్య : నకిరేకల్‌

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి : మునుగోడు

గండ్ర వెంకటరమణారెడ్డి : భూపాలపల్లి

కంచర్ల భూపాల్‌ రెడ్డి : నల్లగొండ

జీవన్ రెడ్డి : జీవన్‌రెడ్డి

వీరితో పాటు కోనేరు కోనప్ప, గాదరి కిశోర్‌ కుమార్‌, శానంపూడి సైదిరెడ్డి, ఎన్‌.భాస్కర్‌ రావు, డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, ఆరూరి రమేశ్‌, కంచర్ల భూపాల్‌ రెడ్డి, పైళ్ల శేఖర్‌ రెడ్డి, నోముల భగత్‌‌తో పాటు పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా.. కత్తిపోటుగా యశోద ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో వచ్చిన దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు.

కాంగ్రెస్ తరఫున వీరే.. :-

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి : మునుగోడు

వేముల వీరేశం : నకిరేకల్

పొంగులేటి శ్రీనివాసరెడ్డి : పాలేరు

పరమేశ్వర్ రెడ్డి : ఉప్పల్

దామోదర రాజనర్సింహ : ఆందోల్

వంశీ కృష్ణ : అచ్చంపేట్

నాయిని రాజేందర్ రెడ్డి : వరంగల్ వెస్ట్

జగ్గారెడ్డి - సంగారెడ్డి

వీరితో పాటు పలువురు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా శుక్రవారం నాడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం కామారెడ్డిలో కాంగ్రెస్ సభ జరగనుంది. ఈ సభకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరై బీసీ డిక్లరేషన్ విడుదల చేయనున్నారు. మరోవైపు.. పెండింగ్‌లో ఉన్న ఐదు నియోజకవర్గాలకు అధిష్టానం ప్రకటించింది. పటాన్ చెరువు - కట్టా శ్రీనివాస్ గౌడ్, తుంగతుర్తి - మందుల సామెల్, సూర్యాపేట - రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మిర్యాలగూడ- బత్తుల లక్ష్మారెడ్డి, చార్మినార్ - ముజీబ్ షరీఫ్ అభ్యర్థులుగా అధిష్టానం ప్రకటించగా.. శుక్రవారం నాడు వీరంతా నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు.

Updated Date - 2023-11-09T22:46:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising