Posani On Rajinikanth row : రజనీకాంత్ చెన్నైలో సూపర్‌స్టార్ ఏమో.. మాకు మాత్రం ఈయనే.. మరో రచ్చ రేపిన పోసాని
ABN, First Publish Date - 2023-05-01T22:21:04+05:30
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Superstar Rajanikanth) గురించే చర్చ.. ఏ లీడర్ మీడియా (Media) ముందుకు వచ్చినా తలైవా (Thalaiva) గురించే మాట్లాడేస్తున్నారు...
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Superstar Rajanikanth) గురించే చర్చ.. ఏ లీడర్ మీడియా (Media) ముందుకు వచ్చినా తలైవా (Thalaiva) గురించే మాట్లాడేస్తున్నారు. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు బాస్ వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) గురించి మాట్లాడారో లేదో.. మీడియా గొట్టాల ముందు వాలిపోయారు వైసీపీ నేతలు (YSRCP Leaders). ‘టార్గెట్ తలైవా’ అంటూ వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు విమర్శిస్తుంటే.. ఇక అదేపార్టీకి చెందిన సోషల్ మీడియాతో (Social Media) మాత్రం ఇష్టానుసారం కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే రజనీని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తున్నారు. అయితే అంతే రీతిలో టీడీపీ, రజనీ వీరాభిమానులు కౌంటర్ల వర్షం కురిపిస్తున్నారు. సరిగ్గా ఇదే టైమ్‌లో నంది అవార్డ్స్ (Nandi Awards) గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తావన వచ్చింది. ప్రముఖ నిర్మాతలు అశ్వనీదత్, ఘట్టమనేని ఆదిశేషగిరి రావులు (Adiseshagiri Rao) ఈ అవార్డ్స్ గురించి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలే చేశారు. అటు రజనీ కామెంట్స్.. ఇటు నిర్మాతలు అవార్డ్స్ గురించి చేసిన కామెంట్స్‌కు ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) రియాక్ట్ అయ్యారు. ఇప్పటి వరకూ ఒక రచ్చ అయితే.. పోసాని రియాక్ట్ అయ్యాక ఈ వ్యవహారం అంతా అగ్గిరాజేసినట్లయ్యింది.
ఇంతకీ నిర్మాతలు ఏమన్నారు..!?
‘ఇప్పుడు నడుస్తున్న నంది అవార్డుల సీజన్ వేరు.. ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ అంటూ వాళ్లకు అవార్డులు ఇస్తారు. ఇవి సినిమాలకు అవార్డులు ఇచ్చే రోజులు కావు. సినిమాలకు నంది అవార్డులు ఇచ్చే రోజులు రావాలంటే రెండు మూడేళ్లు పడుతుంది. అప్పుడు మనందరం అవార్డులు అందుకోవచ్చు’ అని జగన్ సర్కార్‌పై (Jagan Govt) నిర్మాత అశ్వనీదత్ పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇప్పుడున్న జగన్ అధికారంలో నుంచి పోయి చంద్రబాబు ప్రభుత్వం (CBN Govt) ఏర్పాటు చేస్తే తప్ప నంది అవార్డ్స్ దిక్కులేదని నిర్మాత చెప్పుకొచ్చారన్న మాట.
మరోవైపు ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ.. ‘ సూపర్‌స్టార్ కృష్ణ గారి పేరుమీద బుర్రిపాలెంలో ఓల్డేజ్ హోమ్ కడుతున్నాం. ఆయనకు ఎలాంటి కోరికలు లేవు. ఏ అవార్డులపై ఆసక్తి ఉండేది కాదు. ఈ రోజుల్లో ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నవాళ్లకే అవార్డులు ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాక నంది అవార్డులను పట్టించుకోట్లేదు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫిల్మ్ ఇండస్ట్రీని పట్టించుకోట్లేదు. ప్రభుత్వ అవార్డులకు పెద్దగా ప్రాధాన్యత ఉందని నేను అనుకోవట్లేదు’ అని అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ ఇద్దరూ మాట్లాడారు.
అవార్డులపై పోసాని రియాక్షన్ ఇదీ..
అశ్వనీదత్ వ్యాఖ్యలపై పోసాని చాలా ఘాటుగా స్పందించారు. ‘ఉత్తమ రౌడీ ఉత్తమ గుండా అని కాదు.. మీరు ఉత్తమ వెన్నుపోటుదారుడు. ఉత్తమ లోఫర్, ఉత్తమ మోసగాడు అవి కదా ఇవ్వాలి. ఉత్తమ వెదవలు, ఉత్తన సన్యాసులు అని మీ (అశ్వనీదత్) వాళ్ళకే ఇవ్వాలి. ఎందుకు మీరు జగన్ గారి మీద పడి ఏడుస్తున్నారు. మీకు ఆయన ఏం అన్యాయం చేశారు..? చంద్రబాబు మాదిరిగా వెన్నుపోటు పొడిచారా?. పలానా వారికి సీఎం జగన్ అన్యాయం చేసాడని నిరూపించండి’ అని అశ్వనీదత్‌కు పోసాని సవాల్ విసిరారు. అవును.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నంది అవార్డులు ఇవ్వలేదన్న మాట వాస్తవమేనని.. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతోందన్నారు. రెండేళ్లు కరోనా వచ్చిందని.. దాని నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకున్నారని పోసాని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత దేనికి ప్రియారిటీ ఇవ్వాలో దానికే జగన్ ఇస్తున్నారన్నారు. సీఎం జగన్ అవార్డులు ఇస్తే, ఎవరూ పేరు పెట్టనివిధంగా ట్రాన్ఫరెన్స్‌తోనే ఇస్తారని పోసాని వ్యాఖ్యానించారు.
మాకూ సూపర్‌స్టార్ ఉన్నారు..!
‘రజనీకాంత్ రోజూ చెన్నై నుంచి విజయవాడ వచ్చి చంద్రబాబును పొగుడుకోమనండి.. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రజనీకాంత్ తమిళవాళ్లకే సూపర్ స్టార్. తెలుగు వాళ్లకు కాదు. మాకూ సూపర్ స్టార్ ఉన్నారు.. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి గారికి జగన్ గారు అంటే ఎంతో ప్రేమ.. అన్నా అన్నా అంటూ వైఎస్సార్ గారికి ఇచ్చినంత గౌరవం చిరంజీవి గారికి జగన్ గారు ఇస్తారు’ అని పోసాని చెప్పుకొచ్చారు. అయితే ఎప్పుడూ చిరు గురించి పెద్దగా మాట్లాడని పోసానికి సడన్‌గా ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందబ్బా అని మెగాభిమానులు కాసింత ఆలోచనలో పడ్డారు. పైగా మెగా ఫ్యామిలిలోని పవన్ కల్యాణ్‌ను వైసీపీ నేతలు తిట్టిపోస్తుంటే.. ఈయన మాత్రం అదే ఫ్యామిలీలోని చిరును మాత్రం ఆకాశానికెత్తేశారు. అటు తిట్టుడు.. ఇటు పొగడ్తలు జనాలు, వీరాభిమానులు ఎలా అర్థం చేసుకుంటారో ఏంటో..!
మొత్తానికి చూస్తే.. ఇప్పుడిప్పుడే రజనీకాంత్ వ్యవహారం సమసిపోతోందనుకున్న టైమ్‌లో పోసాని మీడియా ముందుకొచ్చి రచ్చలేపారనే చెప్పుకోవచ్చు. ఇక దీనిపై అటు టీడీపీ నేతలు మాట్లాడటం.. ఇటు వైసీపీ నుంచి రియాక్షన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి. ఇక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు, అభిమానులు తెగ కొట్టుకుంటున్నారు కానీ అసలు వ్యక్తి రజనీకాంత్ ఇంతవరకూ ఈ విమర్శలపై మాత్రం అస్సలే రియాక్ట్ అవ్వలేదు. ఇంకెన్ని రోజులు ‘టార్గెట్ తలైవా’ ఎపిసోడ్ నడుస్తుందో.. ఏంటో మరి.
******************************
ఇవి కూడా చదవండి..
******************************
CM KCR : నాడు ‘అమ్మ’.. నేడు సార్ విషయంలో సేమ్ సీన్.. తిట్టిపోసినోళ్లే ప్రోత్సహిస్తున్నారా.. ఈ మొక్కుడు వెనుక ఇంత పెద్ద కథుందా..!?
******************************
Mallareddy On AP : ఏపీ గురించి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇన్ని మాటలు అనేశారేంటి.. రచ్చ రచ్చ చేశారుగా..!
******************************
Chikoti Arrest : అరెస్టయిన చికోటి ప్రవీణ్ థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్ కోసం ఏ రేంజ్‌లో ప్లాన్ చేశాడో తెలిస్తే..
******************************
Chikoti Praveen : థాయిలాండ్‌లో చికోటి ప్రవీణ్ అరెస్ట్.. 14 మంది మహిళలు కూడా..
******************************
Casino King Chikoti : థాయిలాండ్‌లో చికోటితో పట్టుబడిన వారిలో వైసీపీ నేతలు.. కీలకంగా వ్యవహరించిన మహిళ..!
******************************
New Secretariat : కొత్త సచివాలయంకు వెళ్లిన ఉద్యోగుల్లో గందరగోళం.. తొలిరోజు సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారంటే..
******************************
Mallareddy Comedy : బాబోయ్.. మల్లారెడ్డి.. పాలు, పూలు, కూరగాయలు అమ్మడమే కాదు.. ఇంకా చాలానే చేశారుగా.. పగలబడి నవ్వే విషయం చెప్పిన కేటీఆర్..
******************************
KCR Warning : సీఎం కేసీఆర్‌తో కీలక సమావేశం తర్వాత ఏపీ గురించి మల్లారెడ్డి ఏమన్నారో తెలిస్తే.. మరోసారి రచ్చ..
******************************
Updated Date - 2023-05-01T22:38:13+05:30 IST