Rahul Gandhi Disqualified : రాహుల్‌పై అనర్హత వేటుతో కాంగ్రెస్‌లో కలకలం.. వయనాడ్ నుంచి పోటీ చేసేదెవరు.. ప్రియాంక బరిలోకి దిగుతారా..!?
ABN, First Publish Date - 2023-03-24T22:45:17+05:30
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడ్డ నేపథ్యంలో.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్..
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడ్డ నేపథ్యంలో.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ (Wayanad Lok Sabha) స్థానం ఖాళీ అయ్యింది. రాహుల్‌కు వ్యతిరేకంగా సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును.. పైకోర్టులు కొట్టివేయకుంటే.. ఆయన ఆరేళ్ల దాకా ఎన్నికల్లో పోటీకి అర్హతను కోల్పోతారు. ఈ నేపథ్యంలో వయనాడ్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో.. తమ సిటింగ్ స్థానాన్ని నిలబెట్టుకుని తీరుతామని కాంగ్రెస్ ఘంటాపథంగా చెబుతోంది. ఆ స్థానం నుంచి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) పోటీ చేసే అవకాశాలున్నాయని కేరళ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
కేరళలో రెండు ఉప ఎన్నికలు..!
కేరళలో వారం రోజుల వ్యవధిలో రెండు ఉప ఎన్నికల ఘంటికలు మోగాయి. వారం క్రితం దేవికులం(Devikulam) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఎ.రాజా(MLA A.Raja)పై హైకోర్టు అనర్హత వేటు వేసింది. దేవికులం నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కాగా.. రాజా క్రిస్టియన్ అని కోర్టు నిర్ధారించింది. తప్పుడు పత్రాలతో రిజర్వ్డ్ స్థానం నుంచి ఎన్నికైన రాజా సభ్యత్వాన్ని రద్దు చేసింది. దాంతో.. ఆ స్థానం ఇప్పుడు ఖాళీ అయ్యింది. తాజాగా శుక్రవారం రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై వేటు పడడంతో ఇప్పుడు వయనాడ్ ఖాళీ అయ్యింది. దీంతో.. ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.
ఎన్నికల సంఘం ఆచితూచి అడుగులు!
రాహుల్ గాంధీపై ఎంత వేగంగా అనర్హత వేటు వేశారో.. అంతే వేగంగా భారత ఎన్నికల సంఘం(ECI) ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాల్లేవని రాజ్యాంగ/న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఓ హత్యకేసులో జైలు శిక్ష పడ్డ లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్‌పై అనర్హత వేటు పడ్డ విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం ఆగమేఘాలపై నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ, కేరళ హైకోర్టు(Kerala High Court) సెషన్స్ కోర్టు విచారణను రద్దు చేసింది. దాంతో.. ఎన్నికల సంఘం(Election Commission of India) తన నోటిఫికేషన్‌ను స్తంభింపజేయాల్సి వచ్చింది. ఇప్పుడు రాహుల్ గాంధీ విషయంలోనూ సెషన్స్ కోర్టు(Surat Court) రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దాన్ని గుజరాత్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు(Supreme Court) రద్దు చేసే అవకాశాలున్నాయి. లేదా.. శిక్షను తగ్గించడమో.. జరిమానాతో సరిపెట్టడమో.. పరువునష్టానికి తగ్గట్లుగా పరిహారానికి ఆదేశాలు జారీ చేయడమో జరిగే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అప్పుడు కేరళ హైకోర్టు తీర్పును ఉటంకిస్తూ.. రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించి, తన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకునే అవకాశాలున్నాయి. అదే సమయంలో.. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 8(4)ను లోక్‌సభ సచివాలయం విస్మరించిన నేపథ్యంలో.. కోర్టు న్యాయసమీక్ష(1993 నాటి కిహోలో హోలాహాన్ వర్సెస్ జాచిల్హు కేసులో సుప్రీంకోర్టు తీర్పు) చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం వెంటనే చర్యలు ప్రారంభించబోదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
వయనాడ్‌పై కాంగ్రెస్‌కే పట్టు!
2009, 2014లో ఈ స్థానం కాంగ్రెస్ హస్తగతమైంది. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.ఐ.షానవాస్ తన ప్రత్యర్థి, సీపీఎం(CPM) అభ్యర్థి సత్య మొకేరీపై 20,870 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోగా.. అక్కడ కాంగ్రెస్ మరింతగా పుంజుకుంది. రాహుల్ గాంధీ బరిలోకి దిగడంతో.. వయనాడ్ కాంగ్రెస్‌కు బలమైన కంచుకోటగా మారిపోయింది. రాహుల్ గాంధీకి 7.06 లక్షల ఓట్లు రాగా.. ఆయన సమీప అభ్యర్థి, సీపీఎం నేత పీపీ సునీర్ 2.74 లక్షల ఓట్లతో సరిపెట్టుకున్నారు. మూడోస్థానంలో ఉన్న బీజేపీ నేత తుషార్ వెల్లపల్లికి 78,816 ఓట్లు వచ్చాయి. ఈ మూడున్నరేళ్ల కాలంలో రాహుల్ గాంధీ నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా యువతకు దగ్గరయ్యారు.
రాహుల్ గాంధీకి సంబంధించిన మరిన్ని కథనాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
తెరపైకి ప్రియాంక పేరు..
రాహుల్ గాంధీపై అనర్హత వేటు ఇప్పుడు కేరళలో కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తోంది. ఉప ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధమని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(KPCC) అధ్యక్షుడు కె.సుధాకరన్(K.Sudhakaran) స్పష్టం చేశారు. రాహుల్‌పై అనర్హత వేటు నేపథ్యంలో శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. వయనాడ్ నియోజకవర్గ ఓటర్లే తీర్పు చెబుతారని వ్యాఖ్యానించారు. సత్యం, ధర్మం, న్యాయం కాంగ్రెస్ వైపే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అయితే.. ఒకవేళ రాహుల్ గాంధీపై సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును పైకోర్టులు సమర్థిస్తే.. వయనాడ్ అభ్యర్థి ఎవరనే అంశంపై కేరళ కాంగ్రెస్ వర్గాల్లోనూ, ఆ పార్టీ అధిష్ఠానంలోనూ చర్చ మొదలైంది. ఈ చర్చల్లో ప్రియాంక గాంధీ వాద్రాను వయనాడ్ బరిలో నిలబెట్టాలని కాంగ్రెస్ పెద్దలు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ‘‘ప్రియాంకను నిలబెట్టడం వల్ల వయనాడ్‌కు గాంధీల కుటుంబంతో సంబంధం కొనసాగుతుంది. ప్రజల నుంచి సానుభూతి వచ్చే అవకాశాలున్నాయి. ప్రియాంక నాయకత్వానికి ఇదో అవకాశంగా మారనుంది’’ అని కేరళ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వయనాడ్‌లో 93.15% ఓటర్లు గ్రామీణ ప్రాంతాలవారని, వారిలో సానుభూతి అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అక్కడ కేవలం 6.85% మేర పట్టణ జనాభా ఉందని చెబుతున్నారు.
వయనాడ్ నియోజకవర్గ ఓటర్ల వివరాలు(2019 జాబితా ప్రకారం)
మొత్తం ఓటర్లు: 12,49,420
పురుషులు: 6,14,822
మహిళలు: 6,34,598.
****************************
ఇవి కూడా చదవండి
******************************
YSRCP : ఉండవల్లి, మేకపాటిపై వేటు వేసే పరిస్థితి ఎందుకొచ్చింది.. ఓటింగ్‌కు ముందు జగన్‌తో భేటీ.. ఆ అరగంటలో ఏం జరిగింది.. ఒక్క మాటతో..!
******************************
Suspension on 4 MLAs : వైసీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడిన నిమిషాల వ్యవధిలోనే జరిగిన సీన్ ఇదీ.. నిరూపిస్తారా..!
******************************
Big Breaking : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్
******************************
MLC Election Results : క్రాస్ ఓటింగ్ వేసిందెవరో తెలుసన్న సజ్జల.. ఎమ్మెల్యే శ్రీదేవి రియాక్షన్ ఇదీ.. ఇవాళ ఉదయమే...
******************************
MLC Election Results : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు వెన్నుపోటు పొడిచింది ఈ ఇద్దరు ఎమ్మెల్యేలేనా.. ఫోన్ స్విచాఫ్ రావడంతో...!
******************************
Updated Date - 2023-03-24T22:50:57+05:30 IST