Amit Shah: అమిత్ షా అర్జెంట్ మీటింగ్... ఢిల్లీలో తెలంగాణ పొలిటికల్ హీట్!
ABN, First Publish Date - 2023-02-28T13:34:44+05:30
తెలంగాణ బీజేపీ నేతలను అర్జెంట్‌గా ఢిల్లీకి ఎందుకు పిలిచినట్లు...? ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ జరిగితే పరిణామాలపై అమిత్ షా ఆరా తీస్తున్నారా...? ఢిల్లీ డిప్యూటీ సీఎం అరెస్ట్ తర్వాత..
తెలంగాణ బీజేపీ (Telangana BJP) నేతలను అర్జెంట్‌గా ఢిల్లీకి ఎందుకు పిలిచినట్లు...? ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scam Case) ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) అరెస్ట్ జరిగితే పరిణామాలపై అమిత్ షా (Amit Shah) ఆరా తీస్తున్నారా...? ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia) అరెస్ట్ తర్వాత బీజేపీ దూకుడు పెంచిందా...? బీజేపీ కీలక నేత రెండ్రోజుల రహస్య పర్యటన తర్వాత అమిత్ షా పిలుపొచ్చిందా..?
తెలంగాణ నేతలంతా ఢిల్లీ బాట పట్టాక ఇవే ప్రశ్నలు ఇటు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌తో పాటు ఢిల్లీలోనూ బలంగా వినిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ కు డిప్యూటి సీఎం మనీష్ సిసోడియా సహకరించారని, సౌత్ గ్రూపులో కవిత కూడా ఉందని ఈడీ, సీబీఐలు చార్జ్ షీట్స్ కూడా దాఖలు చేశాయి. సిసోడియా ఆఫీసులోనే కొత్త మద్యం పాలసీ డ్రాఫ్ట్ తయారైందని సీబీఐకి పక్కా ఎవిడెన్స్ దొరికినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకట్రెండు రోజుల్లో కవిత అరెస్ట్ తప్పదని బీజేపీ వర్గాలు బలంగా వాదిస్తున్నాయి.
ఇక, కాంగ్రెస్ ప్లీనరి సమావేశాల్లో అగ్ర నేతల నుండి కాంగ్రెస్-బీఆర్ఎస్ పొత్తు తప్పకపోవచ్చన్న సంకేతాలు కూడా వచ్చినట్లు బీజేపీ విశ్వసిస్తోంది. ఎన్నికల తర్వాత పొత్తు తప్పకపోవచ్చని సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వంటి నేతలు బయట కామెంట్ చేసినప్పటికీ, జాతీయ రాజకీయాల దృష్ట్యా ముందే పొత్తులుంటాయని ఏఐసీసీ అగ్రనేతలు ఆఫ్ ది రికార్డు కామెంట్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో బీజేపీ అధిష్టానం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. పైగా, రెండు మూడు రోజులుగా బీజేపీ కీలక నేత సునీల్ బన్సల్ పార్టీ రాష్ట్ర నాయకత్వంకు సంబంధం లేకుండా కీలక నేతలతో మాట్లాడారు. ఆర్.ఎస్.ఎస్ నేతలతో పాటు, కొన్ని మీడియా సంస్థలతోనూ టచ్ లో ఉన్నారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులున్నాయి, కవిత అరెస్ట్ అయితే రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుందా... బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకుంటుందా, కాంగ్రెస్-బీఆర్ఎస్ కలిస్తే బీజేపీకి ఛాన్స్ ఉంటుందా... ఇలా అన్ని అంశాలపై అమిత్ షా కు రిపోర్ట్ ఇచ్చినట్లు బీజేపీ వర్గాల సమాచారం.
ఇవన్నింటిపై చర్చించేందుకే అమిత్ షా బీజేపీ రాష్ట్రస్థాయిలో ఉన్న అగ్ర నాయకత్వాన్ని ఢిల్లీ పిలిపించినట్లు తెలుస్తోంది. కవిత అరెస్ట్ జరిగితే తీసుకోవాల్సిన స్టెప్స్, కాంగ్రెస్-బీఆర్ఎస్ పొత్తును ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, వారు ఒక్కటైతే బీజేపీ ఫోకస్ ఎలా ఉండాలి... ఇలా ప్రతి అంశంపై డీప్ డిస్కషన్ తో పాటు బీజేపీ పెద్దలు డైరెక్షన్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే, బీజేపీ నేతలు మాత్రం ప్రతి నెలాఖరులో ఆ నెలలో పార్టీ పనితీరుపై పోస్ట్ మార్టంతో పాటు, వచ్చే నెలలో ఏం చేయాలో డిసైడ్ చేస్తారని... అందులో భాగమే ఈ మీటింగ్ అంటూ పైకి చెప్తున్నారు. కానీ, అమిత్ షా మీటింగ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైందిగా విశ్లేషకులు కూడా స్పష్టం చేస్తున్నారు.
Updated Date - 2023-02-28T13:38:05+05:30 IST