ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nara Lokesh and Jr Ntr : బావ నుంచి పిలుపొచ్చింది.. అన్నింటికీ ఫుల్ క్లారిటీ కూడా వచ్చేసింది.. ఇక డిసైడ్ కావాల్సింది బాద్ షానే..!

ABN, First Publish Date - 2023-02-25T19:52:12+05:30

నందమూరి- నారా కుటుంబాలకు (Nandamuri- Nara Families) చాలా గ్యాప్ వచ్చింది..? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు (Nara Lokesh) జూనియర్ ఎన్టీఆర్‌కు (Jr Ntr) అస్సలు పడట్లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా పరిస్థితులున్నాయ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందమూరి- నారా కుటుంబాలకు (Nandamuri- Nara Families) చాలా గ్యాప్ వచ్చింది..? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు (Nara Lokesh) జూనియర్ ఎన్టీఆర్‌కు (Jr Ntr) అస్సలు పడట్లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా పరిస్థితులున్నాయ్.. అని చాలా రోజులుగా కొందరు విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. అంతేకాదు.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి (Ntr Politics) వస్తే లోకేష్‌కు చెక్ పడుతుందనే రానివ్వట్లేదనే విషప్రచారం కూడా పెద్ద ఎత్తునే జరిగింది. లోకేష్‌కు-ఎన్టీఆర్‌ పోటీ అవుతాడనే టీడీపీకి (Telugudesam) దూరం పెట్టిందని కూడా మరికొందరు పనిగట్టుకుని మరీ ప్రచారం చేశారు. ఈ రేంజ్‌‌లో ఆరోపణలు వచ్చినప్పటికీ అటు నారా ఫ్యామిలీ నుంచి కానీ.. ఇటు నందమూరి కుటుంబం వైపు నుంచి ఏ ఒక్కరూ రియాక్ట్ అవ్వలేదు. అయితే ఫస్ట్ టైమ్.. ఈ ఆరోణలు, విమర్శలపై నారా లోకేష్ స్పందించి ఒకే ఒక్క మాటతో అందరి నోరూ మూపించేశారు. ఇంతకీ జూనియర్ రావడం లోకేష్‌కు ఇష్టమా లేదా..? ఈయన కామెంట్స్‌కు టీడీపీలో, సోషల్ మీడియాలో ఎలాంటి చర్చ జరుగుతోంది..? అసలు ఈ వ్యవహారంపై ఎన్టీఆర్ రియాక్ట్ అవుతారా..? అనేదానిపై ప్రత్యేక కథనం.

ఇదీ అసలు కథ..

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేకున్నా.. రాజకీయంగా మాత్రం ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తూ వస్తున్నారు. రెండ్రోజులకోసారి ఎవరో ఒకరు ఆయన పేరును ప్రస్తావిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితులు, ఆప్తులు వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi), కొడాలి నాని (Kodali Nani) అయితే రోజుకోక సారైనా జూనియర్ ప్రస్తావన తెస్తుంటారు. జూనియర్ ఎన్టీఆరే.. టీడీపీకి నిజమైన వారసుడంటూ కామెంట్స్ చేసి రచ్చ చేసిన రోజులు కూడా ఉన్నాయ్. అంతేకాదు రాజకీయాల్లోకి రావాలని ఎన్టీఆర్‌కు ఆసక్తి ఉన్నా.. చంద్రబాబు, లోకేష్ అడ్డుకుంటున్నారని కూడా మాట్లాడిన సందర్భాలున్నాయ్. వాస్తవానికి జూనియర్‌కు రాజకీయాలేమీ కొత్తకాదు.. 2009 ఎన్నికల్లో (2009 AP Elections) ఏపీలో టీడీపీ కోసం కోసం ఎన్టీఆర్ ప్రచారం చేశారు. అయితే ఎన్నికలకు మరికొద్ది రోజులు ఉందని ఉగాది పండుగ ఇంట్లో జరుపుకునేందుకు వెళుతుండగా జూనియర్ రోడ్డు ప్రమాదానికి (Ntr Road Accident) గురయ్యారు. కొద్దిరోజులపాటు ఆస్పత్రిలో బెడ్‌కే ఆయన పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు ఎన్టీఆర్. ఆయన్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అభిమానులు, టీడీపీ కార్యకర్తలు సైతం ఆహ్వానించారు. ఎన్టీఆర్ కూడా పార్టీకి అవసరం ఉన్నప్పుడు ఒక్క పిలుపు వస్తే చాలు వచ్చేస్తానని కూడా క్లియర్ కట్‌గానే చెప్పారు. ఆ మధ్య కేంద్రమంత్రి అమిత్ షాతో జూనియర్ భేటీ కావడంతో చిత్రవిచిత్రాలుగా వార్తలు వచ్చాయి. నాటి నుంచి నేటివరకూ ఎన్టీఆర్ రాజకీయంగా అంతగా వార్తల్లో నిలవలేదు కానీ ఈ మధ్య మళ్లీ ఆయన పేరు తరుచుగా వినిపిస్తోంది. యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ యువకులతో నిర్వహించిన ముఖాముఖిలో ఎన్టీఆర్ గురించి ప్రస్తావన వచ్చింది.

ఇదీ లోకేష్ మనసులోని మాట..!

జూనియర్ ఎన్టీఆర్‌ను పాలిటిక్స్‌లోకి ఆహ్వానిస్తారా..? అని యూత్ నుంచి లోకేష్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి లోకేష్ చాలా బ్యాలెన్స్‌గా.. ఒకే ఒక్క మాటతో తాను చెప్పాల్సింది చెప్పేశారు. ‘జూనియర్ ఎన్టీఆర్‌ను నూటికి నూరు శాతం రాజకీయాల్లోకి ఆహ్వానిస్తాను. ఎవరైతే ఏపీలో మార్పు ఆశిస్తున్నారో, ఏపీ అగ్రస్థానానికి వెళ్లాలని కోరుకుంటున్నారో.. ఆంధ్రులు గర్వపడేలా ఉండాలని ఆశిస్తారో వారంతా రాజకీయాల్లోకి రావాల్సిందే’ అని తన మనసులోని మాటను లోకేష్ బయటపెట్టారు. ఈ మాటతో ఇప్పటి వరకూ లోకేష్-ఎన్టీఆర్ (Lokesh-Ntr) మధ్య బేధాలున్నాయని విమర్శలు చేసిన.. ఇంకా చిత్ర విచిత్రాలుగా విష ప్రచారం చేసిన వారికి బుద్ధి వచ్చేలా సమాధానం చెప్పేశారాయన. దీంతో నారా-నందమూరి కుటుంబాల మధ్య గొడవలు కానీ.. లోకేష్-ఎన్టీఆర్ మధ్య మనస్పర్థలు కానీ లేవని తేలిపోయింది.

బావ నుంచి రావాల్సిన పిలుపు వచ్చింది కానీ.. ఇక ఎన్టీఆరే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నమాట. అయితే లోకేష్ కామెంట్స్‌పై సొంత పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తునే రియాక్ట్ అవుతున్నారు. ‘ఎన్టీఆర్‌ను ఆహ్వానించాల్సింది ఏముంది.. ఎప్పట్నుంచో రాజకీయాల్లోనే ఉన్నారుగా’ అని కొందరు టీడీపీ వీరాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు.. ‘ సరైన టైమ్‌లో ఆహ్వానం వెళ్లింది.. ఇక ఆలస్యం చేయకుండా వచ్చి వైసీపీని ఢీ కొట్టండి’ అని అంటున్నారు.

ఇప్పుడు రియాక్షన్ ఏంటో..?

తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌దే.. ఆయనే నిజమైన వారసుడు.. జూనియర్ వస్తేనే టీడీపీకి మళ్లీ పాతరోజులు వస్తాయి.. నందమూరి ఫ్యామిలీని నారా ఫ్యామిలీ కంట్రోల్ చేస్తోంది.. ఎన్టీఆర్ వస్తే లోకేష్‌కు పోటీ అవుతారనే రానివ్వట్లేదు.. ఇవీ పదే పదే వల్లభనేని వంశీ, కొడాలి నాని నోటి నుంచి వచ్చేవి. అయితే వీటన్నింటికీ లోకేష్ ఒకే ఒక్క మాటతో విమర్శకులకు గట్టిగానే గడ్డిపెట్టారు. మరి ఆహ్వానం వచ్చింది.. అభ్యంతరమూ లేదని కూడా లోకేష్ చెప్పేశారు. ఇప్పుడు ఆ విమర్శకుల నుంచి ఎలాంటి కామెంట్స్ వస్తాయో చూడాలి. నిజంగానే జూనియర్ ఎంట్రీ ఇస్తే.. అత్యంత ఆప్తులు అని చెప్పుకునే ఆ ఇద్దరూ వైసీపీలోనే ఉంటారా.. లేకుంటే టీడీపీలోకి వచ్చేస్తారా..? అనేది తేల్చుకోవాల్సిందేనేమో.

మొత్తానికి చూస్తే.. లోకేష్ ఆహ్వానంతో చాలారోజులుగా ప్రశ్నలుగా మిగిలిపోయిన వాటికి సరైన సమాధానమే వచ్చింది. బావ నుంచి పిలుపు వచ్చింది ఇక బాద్ షా డిసైడ్ కావాల్సిందే మిగిలుంది. మరి జూనియర్ మనసులో ఏముందో..? ఆచితూచి అడుగులేస్తారా..? లేకుంటే ఇంకా రావాల్సిన వ్యక్తుల నుంచి పిలుపుకోసం వేచి చూస్తున్నారా..? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదేమో.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

YSR Congress : ఎంపీ విజయసాయిరెడ్డి అవసరం ఇక వైసీపీకి లేదా.. వరుస ఝలక్‌లతో YS Jagan ఇస్తున్న సంకేతాలేంటి.. ఆ ఒక్క ఘటనతో..!?

******************************

YuvaGalam Padayatra : నారా లోకేష్ ఇంతలా స్లిమ్ అవ్వడానికి కారణం ఎవరో తెలుసా.. ఫస్ట్ టైమ్ పెదవి విప్పిన యువనేత..

******************************

AP Capitals : సిగ్గో.. సిగ్గు.. ఏపీ పరువు తీస్తున్న వైఎస్ జగన్.. కేవలం మూడేళ్లలో రాజధాని కడతామంటున్న BRS.. ఎంత కామెడీ అయిపోయిందో..!

******************************

Updated Date - 2023-02-25T20:12:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising