ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS Congress : తెలంగాణ కాంగ్రెస్ వెనుకపడిందేం.. అందరూ కమలం వైపు చూస్తున్నారేంటి.. రేపో మాపో..!?

ABN, First Publish Date - 2023-04-14T18:56:52+05:30

తెలంగాణలో కాంగ్రెస్‌ ఎందుకో వెనుకపడింది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ చేరికలు ఓ రేంజ్‌లో ఉంటాయని.. అది కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో భారీగానే ఉంటాయని అందరూ అనుకున్నారు కానీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తెలంగాణలో కాంగ్రెస్‌ ఎందుకో వెనుకపడింది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ చేరికలు ఓ రేంజ్‌లో ఉంటాయని.. అది కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో భారీగానే ఉంటాయని అందరూ అనుకున్నారు కానీ సీన్ మొత్తం రివర్స్ అవుతోంది. అటు బీఆర్ఎస్ నుంచి.. ఇటు కాంగ్రెస్ నుంచి దారులన్నీ కమలంవైపుకే వెళ్తున్నాయి. అసలు తెలంగాణ కాంగ్రెస్‌ వైపు చూసే నాథుడే లేకుండా పోయారా..? కొత్త చేరికల సంగతి దేవుడెరుగు.. ఉన్న నేతలను కూడా కాంగ్రెస్ ఎందుకు పోగొట్టుకుంటోంది..? అసలు హస్తం పార్టీలో ఏం జరుగుతోందనే విషయాలపై ప్రత్యేక కథనం.

ఎందుకు వెనుకపడిందో..!

కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్‌లో ఇదిగో ఈ రోజు గొడవల్లేవనే పరిస్థితుల్లేవు. ఎప్పుడు చూసినా ఏదో ఒక వివాదం.. ఎవరో ఒకరు మీడియా ముందుకు రావడం రచ్చ రచ్చ చేయడం ఇదే తంతుగా నడుస్తూనే ఉంది. ఒక సమస్య సమసిపోయింది.. ఇక అంతా ఓకే అనుకునే సమయంలో ఏదో ఒక వ్యవహారం మళ్లీ తెరపైకి వస్తుంటది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. రేవంత్‌‌రెడ్డికి టీపీసీసీ చీఫ్‌ పదవి వచ్చాక పరిస్థితులు మారుతాయ్ అనుకున్నారు కానీ.. అపట్నుంచే వివాదాలు మరింత చెలరేగిపోయాయి. ఇది ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా జగమెరిగిన సత్యమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వర్గపోరు, అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ కీలక నేతలంతా ఒక్కొక్కరుగా కమలం గూటికి చేరిపోతున్నారు. ఈ మధ్యనే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేసి.. కాషాయ కండువా కప్పుకున్నారు. మరికొందరు కూడా అదేబాట పడతారని ఇన్‌సైడ్ టాక్. అయితే ఈసారి మాత్రం చాలా పెద్ద తలకాయలే కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

అందరి చూపు బీజేపీ వైపే..!

ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా కాషాయ పార్టీవైపే అడుగులు వేయచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ ఇద్దరి కేడర్ మాత్రం కాంగ్రెస్‌లో చేరాలని డిమాండ్ చేస్తోంది. దీంతో సమాలోచనలో చేస్తున్నారని సమాచారం. వాస్తవానికి చేరికలపై బీజేపీ ప్రత్యేక దృష్టే పెట్టిందని చెప్పుకోవచ్చు. అధికార, ప్రతిపక్ష పార్టీలో ఎవరైనా అసంతృప్తి ఉన్నారంటే చాలు వారితో వెంటనే టచ్‌లోకి వెళ్లడం మొదలుకుని కాషాయ కండువా కప్పేవరకు చాలా స్ట్రాటజీతో కమలనాథులు ముందుకెళ్తారని ఆ పార్టీ వీరాభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. తెలంగాణలో అయితే ఈ చేరికలకు సంబంధించి ప్రత్యేకంగా కమిటీనే ఏర్పాటు చేయడం.. ఈ కమిటికి వేరొక పనిలేకుండా ఇదే పని మీద ఉండాలని ఢిల్లీ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఇప్పుడు పొంగులేటి, జూపల్లి చేరికపై కూడా ఢిల్లీలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ బిజిబిజీగా గడుపుతున్నట్లు తెలియవచ్చింది.

ఎన్నికల ముందే ఇలా ఉంటే..!

కాంగ్రెస్‌లో చేరికలపై ప్రత్యేక దృష్టి సారించిన నాథుడే లేడన్నది ఇప్పుడు కార్యకర్తలు నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ. అటు ఢిల్లీ పెద్దలు, ఇటు రాష్ట్ర పెద్దలు ఎవరూ పెద్దగా పట్టించుకునే పరిస్థితుల్లో లేరట. పైగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోకుండా ఉండటం, రోజురోజుకూ పార్టీలో అసంతృప్తులు ఎక్కువై పోతుండటంతో అసలుకే ఎసరు వస్తోందట. అందుకే ఉన్ననేతలే పక్క పార్టీలోకి వెళ్తున్నారట. ఇక బయటి నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చే పరిస్థితి అంటే అస్సలు ఆ ముచ్చటే లేకుండా పోతోందట. ఎన్నికలకు ముందే ఈ పరిస్థితులు ఉంటే.. రానున్న రోజులు, అది కూడా ఎన్నికల సీజన్ రాగానే ఎలా ఉంటుందో ఊహకందని పరిస్థితి. కాంగ్రెస్ వెనుకపడిందనడానికి కారణలు ఇంతకుమించి కారణాలు ఇక చెప్పక్కర్లేదేమో. ఎన్నికలు సమీపిస్తున్నా తెలంగాణ కాంగ్రెస్ అసలు ఆ ఉత్సాహం కనిపించకపోవడం గమనార్హం. మున్ముందు కాంగ్రెస్‌లో ఇంతకుమించి దారుణ పరిస్థితులు వచ్చినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇకనైనా తెలంగాణ కాంగ్రెస్‌‌లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది కార్యకర్తల నుంచి వస్తున్న మాట. మరి మున్ముందు అయినా మార్పులు, చేర్పులు ఉంటాయో లేదో వేచి చూడాలి.

*****************************

ఇవి కూడా చదవండి..

*****************************

AP Politics : ప్చ్.. వైఎస్‌ జగన్‌లో మునుపటి కళ ఏమైందో.. ఈ పరిణామాలే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా.. మళ్లీ ఆ రోజులు ఎప్పుడొస్తాయో..!?

*****************************

YSRCP : అప్పట్లో స్టేజ్‌పై రజిని ఏడవటం.. ఇప్పుడు ముఖ్య నేతల భేటీకి సంబంధమేంటి.. ఎక్కడో తేడా కొడుతోందే..!?

*****************************

Rajini Emotional : బాబోయ్.. నిండు సభలో జగన్ గురించి మాట్లాడుతూ విడదల రజిని కంటతడి.. నాడు అలా.. నేడు ఇలా.. సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియోలు..

*****************************

Ambedkar Jayanti : అంబేడ్కర్ జయంతి రోజున అడ్డంగా బుక్కయిన బండి సంజయ్‌.. ఓ రేంజ్‌లో ట్రోలింగ్స్.. సీన్ కట్ చేస్తే..!

*****************************

Updated Date - 2023-04-14T18:59:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising