ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CBN Arrest : చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ప్రకటన.. ఏం జరగబోతోంది..!?

ABN, First Publish Date - 2023-09-26T11:42:22+05:30

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ప్రకటన చేసింది. తన రిమాండ్ క్వాష్ చేయాలని కోర్టులో దాఖలు చేసిన చంద్రబాబు పిటిషన్‌పై ..

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ప్రకటన చేసింది. తన రిమాండ్ క్వాష్ చేయాలని కోర్టులో దాఖలు చేసిన చంద్రబాబు పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో రేపటి విచారణ జాబితాలో వెల్లడించింది. ఇవాళ విచారణకు వస్తుందని టీడీపీ శ్రేణులు భావించినప్పటికీ అది కాస్త బుధవారానికి వాయిదా పడింది. అంతేకాదు.. ప్రస్తావన అవసరం లేకుండానే రేపటికి విచారణ తేదీని సీజేఐ ఖరారు చేశారు. మొత్తానికి చూస్తే.. రేపు కచ్చితంగా సుప్రీంలో విచారణ ఉంటుందని స్పష్టత వచ్చింది. కాగా.. ఇవాళ రాజ్యాంగ ధర్మాసనం విచారణ ఉన్నందున సాధారణ కేసుల విచారణ ఉండదని అంతకుముందు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పేర్కొన్నారు.


సెలవులు ఇలా..!

కాగా.. సీజేఐ నేతృత్వంలో క్యూరేటివ్ పిటిషన్‌పై నేడు స్పెషల్ బెంచ్ సమావేశం జరగనుంది. స్పెషల్ బెంచ్ సమావేశం నేపథ్యంలో ప్రస్తావనలను సీజేఐ డీవై చంద్రచూడ్ నేడు అనుమతించలేదు. అయితే.. సెప్టెంబర్-28 నుంచి అక్టోబర్-02 వరకు సుప్రీంకోర్టుకు సెలవుల నేపథ్యంలో బుధవారం నాడు బాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో క్వాష్ పిటీషన్‌పై హైకోర్టు తీర్పును సుప్రీంలో చంద్రబాబు సవాలు చేసిన సంగతి తెలిపిందే. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో గత శనివారం స్పెషల్ లీవ్ పిటీషన్‌ను లాయర్ గుంటూరు ప్రమోద్ కుమార్ దాఖలు చేశారు. అయితే బుధవారం నాడు సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్‌పై ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే అంతా మంచే జరగాలని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

హైకోర్టు ఏం చెప్పింది..?

దర్యాప్తు తుది దశలో జోక్యం చేసుకోలేమంటూ.. గత శుక్రవారం క్వాష్ పిటీషన్‌ను హైకోర్టు త్రోసి పుచ్చింది. సెక్షన్- 482 కింద దాఖలైన వ్యాజ్యంలో మినీ ట్రయల్ నిర్వహించలేమని హైకోర్టు తెలిపింది. 17 (ఏ) సెక్షన్ చంద్రబాబుకు వర్తించదని హైకోర్టు చెప్పింది. దీంతో పాటు.. సీమెన్స్‌కు నిధుల విడుదలకు సిఫారసులతో నిధుల దుర్వినియోగమని.. ఇది అస్పష్టమైన వ్యవహారమని, నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. 17(ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందని సుప్రీంలో దాఖలు చేసిన పిటీషన్‌లో చంద్రబాబు తరపు లాయర్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సెలవులు ఉండటంతో ఇంచార్జి జడ్జి ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి చూస్తే.. బుధవారం చంద్రబాబు పిటిషన్లన్నింటిపైనా విచారణ జరగనుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది బిగ్ డే అని చెప్పుకోవచ్చేమో.!


ఇవి కూడా చదవండి


AP Politics : సాయిరెడ్డి- సుబ్బారెడ్డి మధ్య అంతర్యుద్ధం.. తాడేపల్లి ప్యాలెస్‌కు గొడవ..!?


CBN Arrest : 15 నిమిషాల ములాఖత్‌లో అచ్చెన్నకు చంద్రబాబు ఏం చెప్పారు..?


YSRTP : కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనంపై వైఎస్ షర్మిల కీలక ప్రకటన.. డెడ్‌లైన్..


CBN Skill Case : సీఐడీ విచారణలో చంద్రబాబుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారా..!?


NCBN Remand : చంద్రబాబుకు మళ్లీ రిమాండ్ పొడిగింపు.. ఈసారి ఎన్నిరోజులంటే..?


CBN CID Enquiry : రెండో రోజు ముగిసిన చంద్రబాబు సీఐడీ విచారణ.. ఇవాళ ఎన్ని ప్రశ్నలు అడిగారంటే..?


Updated Date - 2023-09-26T12:34:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising