ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PM Modi tour: సీఎం కేసీఆర్‌కు పూర్తి విభిన్నంగా తమిళనాడు సీఎం స్టాలిన్.. మోదీ వస్తే ఏం చేశారో తెలుసా..

ABN, First Publish Date - 2023-04-08T16:52:20+05:30

సీఎం కేసీఆర్ మాదిరిగానే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం ప్రత్యక్షంగా ఎన్నోసార్లు మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడినప్పుడు కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలన్నీ బీజేపీ-డీఎంకే మధ్య తీవ్ర రాజకీయ వైరానికి అద్దం పడుతున్నాయి. అయినప్పటికీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్/చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) తెలంగాణ పర్యటనలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ (CM KCR) వరుసగా డుమ్మా కొడుతుండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. క్షేత్రస్థాయి రాజకీయాల్లో బీజేపీ-బీఆర్ఎస్ (BJP Vs BRS) నువ్వా-నేనా అన్నట్టు తలపడుతున్న నేపథ్యం, నేతల రాజకీయ విమర్శలు-ప్రతివిమర్శల మధ్య గత కొంతకాలంగా సీఎం కేసీఆర్ ఇదే ధోరణిని అవలంభిస్తున్నారు. ప్రధాని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖం చాటేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటే బీజేపీ నుంచి రాజకీయ విమర్శలు వస్తాయని కేసీఆర్ భావిస్తున్నారనే అనుకున్నా.. కనీసం ఎయిర్‌పోర్టుకు వెళ్లి ప్రధానికి స్వాగతం చెప్పేందుకు కూడా మొగ్గుచూపకపోవడం విమర్శలపాలు చేస్తోంది.

ఇప్పటికే పలుమార్లు ప్రధాని పర్యటనలకు ఏవో కారణాలతో దూరంగా ఉన్న కేసీఆర్ అదే సీన్‌ను మరోసారి రిపీట్ చేశారు. వందే భారత్ ట్రైన్ ప్రారంభానికి ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పంపించి చేతులు దులుపుకున్నారు. దీంతో ఎంత రాజకీయ వైరం ఉంటే మాత్రం దేశ ప్రధానికి స్వాగతం చెప్పడానికి అంత ఇబ్బంది ఏంటి? ఈ విధంగా ఎన్నిసార్లు తప్పించుకుంటారు? పదేపదే ఇలా వ్యవహరించడం సబబేనా? అనే ప్రశ్నలు సీఎం కేసీఆర్‌కు ఎదురవుతున్నాయి. ఇదే విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. కేసీఆర్‌పై కాస్త గట్టిగానే మండిపడ్డారు. ప్రధాని మోదీ పర్యటనకు రాలేనంత బిజీ షెడ్యూల్ ఏంటో తెలంగాణ సమాజానికి చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

తమిళనాడు సీఎం అలా.. తెలంగాణ సీఎం ఇలా..

సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రతిష్టాత్మక వందే భారత్ ట్రైన్ (Vande Bharat train) ప్రారంభం, ఇతర కార్యక్రమాలు ముగించుకుని షెడ్యూల్ ప్రకారం భాగ్యనగరం నుంచి తమిళనాడు రాజధాని చెన్నై చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి మోదీకి ఆహ్వానం పలికారు. అంతేకాదు శాలువా కప్పి మరీ సాదరస్వాగతం చెప్పారు. గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం స్టాలిన్‌, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు ప్రధానికి స్వాగతం పలిన వారిలో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ప్రకటించింది.

సీఎం స్టాలిన్ నాయకత్వం వహిస్తున్న డీఎంకే (DMK) పార్టీ కూడా బీజేపీకి పూర్తి వ్యతిరేకంగా పంథాను కొనసాగిస్తోంది. కాంగ్రెస్‌తో చెలిమి చేస్తోన్న ఈ పార్టీ ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు ఘాటు విమర్శలు చేసింది. సీఎం స్టాలిన్ సైతం ప్రత్యక్షంగా ఎన్నోసార్లు మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడినప్పుడు కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలన్నీ బీజేపీ-డీఎంకే మధ్య తీవ్ర రాజకీయ వైరానికి అద్దం పడుతున్నాయి. అయినప్పటికీ రాష్ట్రానికి ప్రధాని మోదీ వచ్చినప్పుడు స్వాగతం పలికేందుకు సీఎం స్టాలిన్ సంశయించడం లేదు. ఎయిర్‌పోర్టుకు వెళ్లి స్వాగతం పలుకుతున్నారు. శనివారం కూడా అదే జరిగింది. ప్రధాని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేసీఆర్ ముఖం చాటేయగా.. స్టాలిన్ మాత్రం తన కేబినెట్‌తో కలిసి వెళ్లి మరీ స్వాగతం పలికారు. దీంతో కేసీఆర్‌ వైఖరిపై విమర్శలు మరింత పెరిగాయి. స్టాలిన్‌కు లేని ఇబ్బంది కేసీఆర్‌కు ఎంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి ఈ పరిణామం ఎలాంటి రాజకీయ విమర్శలకు దారితీస్తుందో వేచిచూడాలి.

Updated Date - 2023-04-08T16:55:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising