ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CBN CID Enquiry : రెండో రోజు ముగిసిన చంద్రబాబు సీఐడీ విచారణ.. ఇవాళ ఎన్ని ప్రశ్నలు అడిగారంటే..?

ABN, First Publish Date - 2023-09-24T17:38:54+05:30

స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) సీఐడీ విచారణ (CID Enquiry) రెండో రోజు ముగిసింది. ఇవాళ ఒక్కరోజే..

స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) సీఐడీ విచారణ (CID Enquiry) రెండో రోజు ముగిసింది. ఇవాళ ఒక్కరోజే 12 గంటలపాటు బాబును సీఐడీ అధికారుల బృందం విచారించింది. దాదాపు 30 అంశాలపై 120 ప్రశ్నలు అడిగి ఇబ్బందిపెట్టినట్లు తెలియవచ్చింది. ముఖ్యంగా.. షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపుపై, డాకుమెంట్స్ చూపించి నిధులు ఎందుకు కేటాయించాల్సి వచ్చిందనే అంశాలపై.. బాబును సీఐడీ అధికారులు ప్రశ్నించినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకూ చంద్రబాబు జవాబు చెప్పినట్లుగా తెలిసింది. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలో విచారణ జరిగింది.


సీల్డ్ కవర్‌లో నివేదిక!

శనివారం, ఆదివారం రెండ్రోజులపాటు జరిగిన సీఐడీ కస్టడీ, రిమాండ్ ముగిసింది. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో బాబును వర్చువల్‌గా సీఐడీ హాజరుపరచనుంది. కస్టడీ సమయంలో సీఐడీ అధికారుల వ్యవహరించిన తీరుపై చంద్రబాబును న్యాయ అధికారి అడిగే అవకాశం ఉంది. విచారణ అనంతరం న్యాయమూర్తి ముందు వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరుపరచాలని కస్టడీకి ఇచ్చిన రోజే న్యాయాధికారి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ రెండ్రోజుల విచారణలో ఏం జరిగింది..? అనేదానిపై సీల్డ్ కవర్‌లో విచారణ నివేదికను సీఐడీ సమర్పించనున్నది.

కస్టడీ పొడిగిస్తారా..?

ఇదిలా ఉంటే.. మరో మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. కస్టడీకి ఎందుకివ్వాలి..? అనేదానిపై ఏసీబీ న్యాయమూర్తికి సీఐడీ తరఫు లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. ఇక చంద్రబాబు తరపున పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తున్నారు. కస్టడీ పొడిగింపుపై సీఐడి పిటీషన్ దాఖలు చేస్తే వాదనలు వినాలని పోసాని కోరగా.. సీఐడీ పిటీషన్ తర్వాత అవసరమైతే కౌంటర్ వేయాలని న్యాయమూర్తి సూచించారు. అయితే అనుకున్నట్లుగానే కస్టడీ పొడిగించాలని సీఐడీ పిటిషన్ వేసింది. దీనిపై చంద్రబాబు లాయర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కస్టడీకి ఇవ్వాల్సిన అవసరమే లేదని పోసాని న్యాయమూర్తిని కోరుతున్నారు. రిమాండ్ పొడిగిస్తే కారణాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కస్టడీ పూర్తి కాకుండా, విచారణ చేయకుండా రిమాండ్‌పై ఎలా మాట్లాడతారని న్యాయమూర్తి ప్రశ్నించారు. పోలీసు కస్టడీ పూర్తయ్యాక విచారించాలని న్యాయమూర్తి సూచించారు. రిమాండ్‌పై ముందే స్పందించడం కరెక్ట్ కాదని పోసానికి న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఇరువర్గాల వాదనలు వినిపించిన తర్వాత న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


ఇవి కూడా చదవండి


NCBN Arrest : ఢిల్లీలో చినబాబు.. ఏపీలో బాలయ్య బాబు ఇద్దరి టార్గెట్ ఒక్కటే.. వణికిపోతున్న వైసీపీ!


NCBN CID Enquiry : చంద్రబాబు సీఐడీ విచారణతో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పరిస్థితి ఎలా ఉందో చూడండి


Lokesh Delhi Tour : హుటాహుటిన హస్తినకు లోకేష్.. ఏపీలో మారిన సీన్.. ఏం జరగబోతోంది..?


Updated Date - 2023-09-24T18:04:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising