ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu Case : త్వరలో బయటికి చంద్రబాబు.. పట్టాభిషేకమే!

ABN, First Publish Date - 2023-09-18T16:38:13+05:30

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అక్రమ అరెస్టుపై (Chandrababu Arrest) తెలుగు రాష్ట్రాలతో దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది...

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అక్రమ అరెస్టుపై (Chandrababu Arrest) తెలుగు రాష్ట్రాలతో దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ (Skill Development) అంటూ అక్రమ కేసులు బనాయించి బాబును జగన్ సర్కార్ (Jagan Govt) కక్షపూరితంగా అరెస్ట్ చేసిందని సినీ, రాజకీయ.. పలు రంగాలు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా (Social Media) వేదికగా.. మీడియా ముఖంగా మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై కన్నెర్రజేస్తున్నారు ప్రముఖులు. మరోవైపు.. తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగోడు ఉన్న ప్రతిచోట బాబు అక్రమ అరెస్టుపై నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా టీడీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీ వేదికగా నిరసన చేపట్టారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసనలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. జగన్ సర్కార్ తీరును ఎండగట్టారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని.. అధికార దుర్వినియోగం చేసి చంద్రబాబును అరెస్టు చేశారని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు (MP Rammohan Naidu) మండిపడ్డారు.


బాబుకు పట్టాభిషేకమే..!

చంద్రబాబు అక్రమ అరెస్టుపై మాజీ ఎంపీ, సీనియర్ నేత మురళీ మోహన్ (Murali Mohan) స్పందించారు. చంద్రబాబు త్వరలో బయటకు వస్తారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడి వెలుతురు ఆపలేరు. చంద్రబాబు త్వరలో బయటికి వస్తారు. చంద్రబాబు అరెస్ట్ పట్ల ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. చంద్రబాబు అరెస్టుతో మహిళలు బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. అన్యాయంగా అరెస్ట్ చేశారు.. కాబట్టే చంద్రబాబుకు మద్దతుగా నిరసనలు జరుగుతున్నాయి. చంద్రబాబును మళ్ళీ ప్రజలు ఆశీర్వదించి పట్టాభిషేకం చేస్తారుఅని మురళీ మోహన్ తెలిపారు.

రాష్ట్రపతి పాలన కావాలి..!

ఏపీలో నిరంకుశ పాలన జరుగుతుంది. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కాలని చూస్తున్నారు. అధికార దుర్వినియోగం చేసి నిరంకుశ పాలన చేస్తున్నారు. జాతీయ నాయకులు కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రం కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో అరాచక పాలన ఉంది. కేంద్రం అవసరమైతే రాష్ట్రపతి పాలన పెట్టాలి. జాతీయ నాయకులు కేంద్రం కల్పించుకుని రాష్ట్రాన్ని కాపాడాలిఅని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ (Konakalla Narayana) డిమాండ్ చేశారు.

ఏపీని కాపాడండి..!

జగన్ ఏపీలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. ఏపీ సైకో పరిపాలన ఉంది. జగన్ పాలన వల్ల రాష్ట్రం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్‌పై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 10 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసింది. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు. ఎఫ్ఐఆర్‌లో పేరు కూడా లేని వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రధాని, హోంమంత్రి కి తెలియకుండా జరిగిందా..?. మోదీ, అమిత్ షా ఎందుకు దర్యాప్తు చేయడం లేదు..?. నిధుల దుర్వినియోగంపై కేంద్ర ఆర్ధికమంత్రి ఎందుకు దర్యాప్తు చేయడం లేదు..?. వెంటనే ప్రధాని, హోం మంత్రి ఏపీపై దృష్టి సారించాలి. ఏపీని ఆ ఇద్దరే కాపాడాలి. మంగళవారం నాడు రాజ్‌ఘాట్ వద్ద మా నిరసన తెలుపుతాం. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందని నేను అనడం లేదు. ఏపీలో పరిస్థితులు ప్రధాని హోదాలో తెలుసుకోవాలి కదాఅని మాజీ మంత్రి, సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. మంగళవారం కూడా ఢిల్లీ వేదికగా బాబు అక్రమ అరెస్టుపై నిరసనలు కంటిన్యూ కానున్నాయి.

TS Assembly Polls : కేసీఆర్‌కు దిమ్మదిరిగేలా కాంగ్రెస్ ఎన్నికల హామీలు.. ఈ దెబ్బతో..!?

Updated Date - 2023-09-18T16:39:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising