YS Jagan Delhi Tour : సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్‌పై ఏపీ ప్రజలకు క్విజ్.. చెప్పుకోండి చూద్దాం..!
ABN, First Publish Date - 2023-03-29T21:36:38+05:30
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) ఈ మధ్య ఢిల్లీ పర్యటనలకు (Delhi Tour) ఎక్కువగా వెళ్తున్నారు. ఆయన ఎందుకు వెళ్తున్నారో..? ఏపీ సమస్యల గురించి వెళ్తున్నారో..?
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) ఈ మధ్య ఢిల్లీ పర్యటనలకు (Delhi Tour) ఎక్కువగా వెళ్తున్నారు. ఆయన ఎందుకు వెళ్తున్నారో..? ఏపీ సమస్యల గురించి వెళ్తున్నారో..? వ్యక్తిగత విషయాల గురించి వెళ్తున్నారో..? ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఆఖరికి సొంత పార్టీ పెద్దలకు కూడా తెలియట్లేదంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జగన్ హస్తినకు వెళ్లడం 14 రోజుల వ్యవధిలో ఇది రెండోసారి! ఈనెల 16వ తేదీన అసెంబ్లీ సమావేశాలను పక్కనపెట్టి మరీ ఢిల్లీకి వెళ్లారు. ఇప్పుడు.. విశాఖలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ-20 సదస్సుకువెళ్లినట్లే వెళ్లి.. బుధవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరారు. రేపు మధ్యాహ్నం ప్రధాని మోదీ (PM Modi), కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో (Amit Shah) జగన్ సమావేశమవుతున్నారు. అయితే.. జగన్ ఢిల్లీకి వెళ్లాలనుకోవడం... ఆ వెంటనే ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి అపాయింట్‌మెంట్లు ఖరారవుతుండటం విశేషం!
సరిగ్గా ఇప్పుడే ఎందుకు..?
ముఖ్యంగా.. బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) కీలకమైన కదలిక వచ్చినప్పుడే జగన్ ఢిల్లీకి వెళుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈనెల 17వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసి వచ్చారు. యాదృచ్ఛికమో, కాదో తెలియదుకానీ... ఆ వెంటనే వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు మందగించింది. ‘వాళ్లిద్దరూ నిందితులే! ఏ క్షణమైనా అరెస్టు చేస్తా’మని తెలంగాణ హైకోర్టులోనే చెప్పిన సీబీఐ.. తర్వాత విచారణకు కూడా పిలవలేదు. ‘కేసు దర్యాప్తు లో జోక్యం చేసుకోం’ అని హైకోర్టు స్పష్టంగా చెప్పినా.. పిలిచి ప్రశ్నించేందుకు ఆటంకాలు లేకున్నా సీబీఐ మౌనంగా ఉండిపోయింది. దీనికిముందు అవినాశ్‌రెడ్డిని సీబీఐ 4 సార్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే! జగన్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి వచ్చాక ఆ ఊపు, దూకుడు మాయమయ్యాయి. సోమవారం నాడు ఎంపీ అవినాశ్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిష న్ దాఖలు చేశారు. మంగళవారం సీఎం ఢిల్లీ టూర్ ఖరారయింది. దీంతో టీవీల్లో ఒక్కటే బ్రేకింగ్‌లు... ఢిల్లీకి వెళ్లబోతున్న సీఎం అం టూ ఒక్కటే హడావుడి! రెండు కీలక ప్రశ్నలు తెరపైకి వచ్చాయి! ఒకటి.. అసలు వివేకా కేసులో ఏం జరుగుతోంది? 2.. ఈ కేసు దర్యాప్తునకూ, సీఎం ఢిల్లీ టూర్‌కి లింకు ఏమిటి? అనే ప్రశ్నలు ఏపీ ప్రజల్లో మెదులుతున్నాయి.
నారా లోకేష్ క్విజ్..!
జగన్ వరుస ఢిల్లీ పర్యటనలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. జగన్ ఢిల్లీకి అస్తమాను ఎందుకెళ్తున్నారు అని ఏపీ ప్రజలకు ప్రశ్న సంధించారు. అంతేకాదు.. దీనికి మూడు ఆప్షన్లు కూడా ఇచ్చి సమాధానం చెప్పమన్నారు. జగన్ ఢిల్లీ టూర్ ఇది ఎన్నోసారి?.. ఇప్పటి వరకూ ఢిల్లీ పర్యటనలతో రాష్ట్రానికి ఏం సాధించారు?.. ఢిల్లీకెళ్లడానికి ప్రత్యేక విమానానికి ఎన్ని కోట్లు ఖర్చు? అనే ఆప్షన్లు ఇచ్చారు. దీనిపై టీడీపీ కార్యకర్తలు, లోకేష్ వీరాభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కొందరు జగన్ ఢిల్లీ పర్యటన ఖర్చు ఎంత అనేది లెక్కలేసి మరీ చెబుతున్నారు. ‘ప్రజలను తాకట్టు పెట్టి.. తనను తాను క్షేమంగా ఉంచుకుంటున్నాడు’ అని మరికొందరు టీడీపీ వీరాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఎన్నిసార్లు పర్యటించారో ఎంచుకోలేదు కానీ.. జగన్ తనకు.. తన సోదరుడు అవినాష్ రెడ్డికి బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ప్రత్యేక ఫ్లైట్ల కోసం సుమారు రెండు వేల కోట్లు ఖర్చుపెట్టారని సామాన్య ప్రజలు, నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఇక వైసీపీ కార్యకర్తలు దీనిపై తీవ్ర స్థాయిలోనే స్పందిస్తూ కౌంటర్ల వర్షం కురిస్తున్నారు.
జగన్ ఢిల్లీటూర్ల పై ప్రజలకు క్విజ్ పోటీ..
1) జగన్ ఢిల్లీ టూర్ ఇది ఎన్నోసారి?
2) ఇప్పటి వరకూ రాష్ట్రానికి ఏం సాధించారు?
3) ప్రత్యేక విమానానికి ఎన్ని కోట్లు ఖర్చు?
ఇదిగో ఈ క్విజ్‌లో మీరూ పాల్గొని మీ అభిప్రాయం తెలియజేయవచ్చు.. ఇక ఆలస్యమెందుకు ట్విట్టర్ ఓపెన్ చేసేయండి..!
Updated Date - 2023-03-29T21:43:20+05:30 IST