ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana BJPలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పెద్దల పర్యటనలు..అధిష్టానం టాస్క్‌లతో నేతల తర్జనభర్జన..

ABN, First Publish Date - 2023-02-24T12:16:19+05:30

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కమలం పార్టీ సన్నద్ధమవుతోంది. దానిలో భాగంగా పార్టీని సంస్థాగతంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణలో పోలింగ్ బూత్‌ల‌ బలోపేతంపై కమలం పార్టీ ఫోకస్ పెట్టిందా?.. సరళ్ యాప్ అప్‌డేట్‌పై బీజేపీ కసరత్తు చేస్తోందా?.. పోలింగ్ బూత్ కమిటీలపై అగ్ర నాయకత్వం ఆరా తీస్తోందా?.. సంస్థాగతంగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా పెద్దలు పర్యటనలు చేస్తున్నారా?.. అయితే.. కొన్ని విషయాలు.. కమలనాథులకు తలనొప్పిగా మారాయా?.. అధిష్టానం టాస్క్‌లతో తర్జనభర్జన పడుతున్నారా?.. ‌ఇంతకీ.. కమలనాథులకు తలనొప్పిగా మారిన అంశాలేంటి?.. కమలనాథులు ఎందుకు తర్జనభర్జన పడుతున్నారు?...అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

స్ట్రీట్ మీటింగ్స్‌తో కాషాయలదళం బిజీ బిజీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కమలం పార్టీ సన్నద్ధమవుతోంది. దానిలో భాగంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇందుకు బూత్ స్థాయి కమిటీలపై దృష్టి సారించారు. ఇప్పటికే.. ప్రజా సమస్యలే లక్ష్యంగా కమలం పార్టీ ముందుకు వెళ్తోంది. స్ట్రీట్ మీటింగ్స్‌తో కాషాయదళం బిజీ బిజీగా ఉంది. ఒకట్రెండు రోజులతో ఆ సభలు కూడా ముగియబోతున్నాయి. దాంతో.. కమలనాథులు నెక్ట్స్‌ టార్గెట్‌ను ఫిక్స్ చేసుకున్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ముగిసిన వెంటనే.. బూత్ స్వశక్తికరణ్ పేరిట మరో డ్రైవ్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. పార్టీని బూత్ స్థాయికి చేర్చేందుకు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఉపయోగపడతాయని బీజేపీ భావిస్తోంది. అదేసమయంలో స్వశక్తికరణ్​ కార్యక్రమంతోపాటు పోలింగ్ బూత్‌ల బలోపేతంపై ఫోకస్‌ పెట్టనుంది.

కమిటీల ఏర్పాటు ఎంతమేరకు వచ్చింది?

ఇదిలావుంటే... పోలింగ్ బూత్ ఇన్‌చార్జ్‌ల నియామకం కమలం పార్టీకి పెద్ద టాస్క్‌గా మారింది. అయితే.. బూత్ స్వశక్తికరణ్ పేరిట దాన్ని సులువుగా పూర్తిచేయడంపై కసరత్తులు చేయనుంది. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌తో పార్టీని ప్రతి ఇంటికీ చేర్చడంపై నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. బూత్ స్వశక్తికరణ్ ద్వారా పోలింగ్ బూత్‌ల వారీగా కమిటీలు వేసి భవిష్యత్‌లో పార్టీ బలాన్ని మరింత పెంచుకోవాలని బీజేపీ నాయకత్వం చూస్తోంది. అందుకే.. బూత్ స్థాయి కమిటీల ఏర్పాటుతోపాటు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, సరళ్ యాప్‌పై బీజేపీ హైకమాండ్ సీరియస్‌గా దృష్టి సారిస్తోంది. ఇప్పటివరకు కమిటీల ఏర్పాటు ఎంతమేరకు వచ్చింది?.. ఎన్ని వీథి సభలు నిర్వహించారనే దానిపై సమీక్షలు నిర్వహించబోతోంది.

అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ సమీక్షలు

మరోవైపు.. సరళ్‌ యాప్‌లో భాగంగా ఎంతమంది పేర్లను అప్‌డేట్ చేశారనే అంశాలపై హైకమాండ్ ఫోకస్ పెంచనుంది. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్‌లు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, సహా ఇన్‌చార్జ్‌ అర్వింద్ మీనన్ రానున్నారు. రాష్ట్ర పదాధికారులు, అన్ని జిల్లాల అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లతో భేటీ కానున్నారు. దానిలో భాగంగా.. రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ సమీక్షలు జరగనున్నాయి. హైకమాండ్ వ్యూహాలను పూర్తిస్థాయిలో అమలు చేయడమే లక్ష్యంగా సునీల్‌బన్సల్ టూర్ సాగనుంది. బీజేపీ జాతీయ నేతల వ్యూహాలను ఇంప్లిమెంట్ చేయడంపై టాస్క్ మాస్టర్ ఫోకస్ చేయబోతున్నారు.

తెలంగాణలో సుమారు 35వేల బూత్ కమిటీలు

అంతవరకూ బాగానే ఉన్నా.. బూత్ కమిటీల నియామకం కమలం పార్టీకి పెద్ద టాస్క్‌గా మారింది. ఒక్కో బూత్ కమిటీలో 22మంది సభ్యులు ఉండాలనే నిబంధన జాతీయ నాయకత్వం విధించింది. ‌తెలంగాణలో సుమారు 35వేల బూత్ కమిటీలున్నాయి. ఇప్పటివరకు 10వేల బూత్ కమిటీలు మాత్రమే కమలం పార్టీ పూర్తి చేసింది.‌ అందుకే.. తెలంగాణ నాయకత్వంపై అధిష్టానం ఒత్తిడి పెంచుతోంది. దీంతో.. బూత్ కమిటీల నియామకం పూర్తి చేయలేక బీజేపీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు. బూత్ కమిటీల నియామకం బిగ్ టాస్క్‌గా మారడంతో సమన్వయం చేసుకునేందుకు కమిటీని నియమించారు. పలు ప్రాంతాల్లో కమిటీల‌ నియామకాలు పూర్తికాకపోవడంతో కమిటీ సభ్యులతో భేటీ కానున్నారు. కమిటీల ఏర్పాటులో ఎదురవుతున్న చిక్కులను అధిగమించేందుకు ఎలాంటి వ్యూహాలతో వెళ్లాలనే అంశంపై ప్రధానంగా చర్చ సాగనుంది.

మొత్తంగా.. తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో తెలంగాణ బీజేపీపై అధిష్టానం ఒత్తిడి పెంచుతోంది. వరుసగా.. ఒక్కో కార్యక్రమంతో.. ప్రజల్లోకి వెళ్తోంది. అదే క్రమంలో.. పోలింగ్‌ బూత్‌లపై ఫోకస్‌ పెంచుతోంది. ఈ నేపథ్యంలో... బీజేపీ వ్యూహాలు ఏ మేరకు సక్సెస్‌ అవుతాయో చూడాలి మరి.

Updated Date - 2023-02-24T12:16:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising