ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana Congress మంటలు చల్లారినట్లేనా?..వెంకట్‌రెడ్డి ఎపిసోడ్‌పై ఎలాంటి చర్చ జరుగుతోంది..?

ABN, First Publish Date - 2023-02-18T12:40:36+05:30

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రోజుకో మాటతో పార్టీ శ్రేణులను కన్ఫ్యూజ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోమటిరెడ్డి కామెంట్స్‌తో కాంగ్రెస్‌లో చెలరేగిన మంటలు చల్లారినట్లేనా?.. ఇన్‌ఛార్జ్‌ థాక్రేకు ఇచ్చిన వివరణతో సమస్య సమసిపోతుందా?.. చర్యలు లేకుండానే వివాదానికి ఫుల్‌స్టాప్ పడుతుందా?.. ఇంతకీ.. ఆ కామెంట్స్‌పై వెంకట్‌రెడ్డి ఇచ్చిన వివరణ ఏంటి?.. ఆయన వ్యవహారం పట్ల పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది?.. అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

కాంగ్రెస్ కార్యకర్త ఫోన్‌ కాల్‌ ఆడియో కలకలం

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రోజుకో మాటతో పార్టీ శ్రేణులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. పార్టీకి డ్యామేజ్ చేసేలా పదేపదే మాట్లాడుతున్నారని కొందరు నేతలు సీరియస్ అవుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా.. తాను సూచించిన అభ్యర్థిని పెడితే వారి కోసం ప్రచారం చేస్తానని చెప్పి వెంకట్‌రెడ్డి మాట తప్పారని గుర్తు చేస్తున్నారు. సరిగ్గా ఆ ఎన్నికల ముందు ఆస్ట్రేలియా వెళ్లి అక్కడి నేతలతో కాంగ్రెస్ గెలవదన్న కామెంట్స్‌పై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అంతేకాదు.. మునుగోడులోని ఓ కాంగ్రెస్ కార్యకర్తకు ఫోన్ చేసి.. రాజగోపాల్‌రెడ్డికి పని చేయాలని కోరిన ఆడియో కూడా కలకలం సృష్టించింది. అయితే.. ఆ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నోటీసులు ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

అగ్గి మీద గుగ్గిలం అవుతున్న కాంగ్రెస్‌ నేతలు

మునుగోడు ఇష్యూ పక్కన పెడితే.. తాజాగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన కామెంట్స్‌ కాంగ్రెస్‌లో కాక రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎవరికి పూర్తిస్థాయి మెజార్టీ రాదని.. హంగ్ వస్తే కేసీఆర్ తమతో కలుస్తారని వ్యాఖ్యానించారు. ఆ కామెంట్స్‌ కాంగ్రెస్‌కు భారీ డ్యామేజ్ చేశాయని సొంత పార్టీ నేతలే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బ తీసేలా మాట్లాడుతున్న వెంకట్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పెద్దసంఖ్యలో హై కమాండ్‌కు ఫిర్యాదులు వెళ్ళాయి. దాంతో.. తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే రంగంలోకి దిగారు. వెంకట్‌రెడ్డిని పిలిచి మందలించారని తెలుస్తోంది. అయితే.. కోమటిరెడ్డి.. తాను అలా మాట్లాడలేదని మీడియాలో తప్పుగా రిపోర్ట్ అయిందని వివరణ ఇచ్చినట్లు టాక్‌ నడుస్తోంది. కాంగ్రెస్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదన్నారు. హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పారు. కేవలం సర్వేల ప్రకారం హంగ్ వచ్చే అవకాశం ఉందని మాత్రమే అన్నానని వెంకట్‌రెడ్డి సర్ది చెప్పారు.

పార్టీకి నష్టం చేసేలా మాట్లాడొద్దని మాత్రమే వార్నింగ్

ఇదిలావుంటే.. కోమటిరెడ్డి పదే పదే కాంగ్రెస్‌కి నష్టం చేసేలా మాట్లాడుతున్నా చర్యలు తీసుకోకపోవడాన్ని కొందరు నేతలు తప్పు పడుతున్నారు. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కామెంట్స్ చేశారని అద్దంకి దయాకర్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్నారు. అలాగే.. ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై కామెంట్స్ చేశారని మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అంతకుముందు.. మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ వంటి నేతను సస్పెండ్ చేశారు. కానీ.. వెంకట్‌రెడ్డికి గతంలోనే ఒకసారి నోటీస్ ఇచ్చి వదిలేశారు. ఇక.. ఇప్పుడు కూడా ఇన్‌చార్జ్‌ ఠాక్రే వివరణ తీసుకున్నారు. పార్టీకి నష్టం చేసేలా బయట మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చారు. దాంతో.. వివాదం సద్దు మణిగినట్లేనని ఇన్‌ఛార్జ్‌ కార్యదర్శి బోసురాజు ప్రకటించారు.

చర్యలకు అధిష్టానం ఎందుకు వెనకాడుతుందో?

ఒకవైపు తెలంగాణలో పార్టీలన్నీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్ళాయి. టీకాంగ్రెస్‌ చీఫ్‌ పాదయాత్ర చేస్తున్నారు. కేడర్‌లో జోష్ నింపి ఎన్నికలకు సిద్ధం చేయాల్సిన కీలక తరుణంలో డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్న వెంకట్‌రెడ్డిపై చర్యలకు కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు వెనకాడుతుందో అర్థం కావడం లేదని సొంత పార్టీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా.. వెంకట్‌రెడ్డి కామెంట్స్‌ ఓ రేంజ్‌లో కాకరేపినప్పటికీ.. ఇన్‌చార్జ్‌ ఎంట్రీతో వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడ్డట్లు అయింది. అయితే.. గతంలో ఇద్దరు, ముగ్గురు విషయంలో క్రమశిక్షణ చర్యలు తీసుకున్న అధిష్టానం.. వెంకట్‌రెడ్డి విషయంలో ఎందుకు ఆచితూచి అడుగులు వేస్తుందనేది అంతుపట్టని వ్యవహారంగా మారింది.

Updated Date - 2023-02-18T12:40:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising