ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NCBN Cases : అందరి కళ్లూ అటే.. చంద్రబాబు కేసులపై ఇవాళ సుప్రీం, ఏసీబీ కోర్టుల్లో ఏం జరగనుంది..?

ABN, First Publish Date - 2023-10-20T10:15:03+05:30

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై (Quash Petition ) మంగళవారం నాడు సుప్రీంకోర్టులో సుదీర్ఘం విచారణ జరిగిన సంగతి తెలిసిందే..

అవును.. టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) కడిగిన ముత్యంలా వచ్చేస్తారు.. త్వరలోనే రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail) నుంచి బయటికి వచ్చేస్తారు..! నిన్నటి వరకు ఎవరి నోట విన్నా ఇదేమాట.. ఎక్కడ చూసినా అదే చర్చ..! అయితే ఆ మాట రోజురోజుకూ దూరమవుతుండటంపై అటు ప్రజలు.. ఇటు నాయకులు, అభిమానుల్లో నిరాశ పెరుగుతూనే ఉంది. సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఆరోగ్యం (CBN Health) ఇటీవల క్షీణించడంతో బెయిల్‌ వస్తుందని ఆశించారు.. అయితే గురు వారం కూడా చుక్కెదురైంది. చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండుకు వెళ్లి 40 రోజులు దాటింది. 45 ఏళ్ల రాజకీయజీవితంలో.. 14 ఏళ్లు సీఎం పదవిలో ఉన్న బాబు ఇన్ని రోజుల పాటు జనానికి కనిపించకుండా ఉండడం ఇదే మొదటిసారి. దీంతో అభిమానులు రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. కాగా.. శుక్రవారం నాడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో (Supreme Court) రెండు పిటిషన్లు, విజయవాడ ఏసీబీ కోర్టులో (ACB Court) చంద్రబాబుకు సంబంధించిన నాలుగు పిటిషన్లపై విచారణ జరగనున్నది.


సుప్రీం కోర్టులో ఇలా..?

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై (Quash Petition ) మంగళవారం నాడు సుప్రీంకోర్టులో సుదీర్ఘం విచారణ జరిగిన సంగతి తెలిసిందే. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ పై వాడీవేడిగా వాదనలు సాగాయి. వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్‌ చేశారు. ఇరుపక్షాలు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయడానికి ఇవాళ(శుక్రవారం) ఆఖరిరోజు. బాబు పిటిషన్‌పై ఎలాంటి తీర్పు వస్తుందో..? ఎప్పుడు వస్తుందోనని చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణుల్లో ఆందోళనలో ఉన్నాయి. కాగా.. 21 నుంచి 29 దాకా కోర్టుకు దసరా సెలవులు ఉండనున్నాయి. దీంతో తీర్పు ఇవాళే ఉంటుందా.. లేకుంటే సెలవుల అనంతరం సుప్రీం వెల్లడిస్తుందా..? అనేదానిపైనా పెద్ద చర్చే నడుస్తోంది. కచ్చితంగా చంద్రబాబుకు అంతా మంచే జరుగుతుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు.. ఫైబర్‌నెట్ కేసులో (Fibernet Case) ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తన నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ వ్యాజ్యం శుక్రవారం జస్టిన్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఏం. త్రివేదితో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించడంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా..? లేదా..? అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా.. అవినీతి నిరోధక చట్టం సెక్టర్ 17 ఏ ప్రకారం కేసులో గవర్నర్ అనుమతి లేయంగా చంద్రబాబును ఆరెస్టు చేయరాదని ఆయన తరపు సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా పేర్కొన్న దృష్ట్యా.. ఫైబర్ నెట్ కేసులో కూడా ఇదే వర్తిస్తుందని న్యాయనిపుణులు భావిస్తున్నారు.

ఇంతకీ ఏమిటా పిటిషన్లు..!

01 :- ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును పిటి వారెంట్‌పై ఇవ్వాలని సీఐడీ తరపున న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరగనున్నది.

02 :- రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు హెల్త్ రిపోర్ట్ కుటుంబ సభ్యులకు ఇవ్వడం లేదని ఏసీబీ కోర్టులో.. ఆయన తరపున న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై విచారణ జరగనున్నది.

03 :- చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో సీఐడీ అధికారుల కాల్ లిస్ట్ ఇవ్వాలని ఏసీబీ కోర్టులో.. బాబు తరుపున న్యాయవాదుల వేసిన పిటిషన్‌పై విచారణ జరగబోతోంది.

ఇప్పటికే ఈ పిటిషన్‌కు సీఐడీ తరుపున న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు.

04 :- రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో న్యాయవాదులు ములాఖత్ కుదింపుపై ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ములాఖత్ రోజుకు మూడుసార్లు కల్పించాలని పిటిషన్‌లో న్యాయవాదులు పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం నాడు కోర్టులో విచారణ జరగబోతోంది.

అందరి కళ్లూ అటే..!

తెలుగు ప్రజలందరి కళ్లూ సుప్రీం వైపే ఉన్నాయి. సుప్రీంకోర్టులో ఏం జరగబోతోంది..? క్వాష్ పిటిషన్‌ కొట్టివేతకు గురవుతుందా..? చంద్రబాబుకు రిలీఫ్ దొరుకుతుందా..? మేమే కరెక్ట్ అంటున్న సీఐడీ వాదనే గెలుస్తుందా..? ఇన్ని ప్రశ్నలూ జవాబు కోసం ఎదురుచూస్తున్నాయి. మొత్తానికి చూస్తే.. ఏపీ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన స్కిల్‌ కేసు ఇవాళ కీలక మలుపు తీసుకోబోతోందనే చెప్పుకోవాలి. ఈ పిటిషన్‌ విషయంలో తీర్పుపై అటు టీడీపీ, వైసీపీల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఈ తీర్పుపై ఫోకస్ పెరిగిందని చెప్పొచ్చు.

ఏం చేద్దాం.. ఎలా ముందుకెళ్దాం..!

ఇదిలా ఉంటే.. చంద్రబాబు పిటిషన్లుపై తీర్పు ఎలా వస్తుంది..? తీర్పు అనుకూలంగా వస్తే ఏం చేయాలి..? ఆ తీర్పుపై ఎలా రియాక్ట్ అవ్వాలి..? అనేదానిపై ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ రెడ్డి.. పార్టీ ముఖ్యనేతలతో చర్చలు కూడా చర్చించినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డితో సీఎం తన నివాసంలో సమావేశమై లోతుగా చర్చలు జరిపినట్లు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పు ముందు.. ఆ తర్వాత తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై ఈ కీలక సమావేశంలో చర్చించారట. అంతేకాదు.. సుప్రీం తీర్పు ఎలా వచ్చినా సరే.. అందుకు తగ్గట్టుగా అప్రమత్తంగా.. ఎక్కడా ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలని డీజీపీని సీఎం ఆదేశించారని తెలిసింది. మరి సుప్రీం తీర్పు ఎలా ఉంటుందో.. ఏంటో చూడాలి.


ఇవి కూడా చదవండి


CBN Case : క్వాష్ పిటిషన్‌పై చంద్రబాబుకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వస్తే..!


CBN Skill Case : చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు రావొచ్చు..!?


CBN Cases : చంద్రబాబు కేసులపై ఏసీబీ, హైకోర్టులో ఏం తేలుతుందో..!?



Updated Date - 2023-10-20T10:15:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising