ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Politics : వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియంపై వెంకయ్య సెటైర్లు.. ఇలా అనేశారేంటి..!?

ABN, First Publish Date - 2023-02-12T13:52:29+05:30

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (AP CM Jagan Mohan Reddy) ప్రభుత్వ పాఠశాలల్లో (Govt Schools) ప్రతిష్టాత్మకంగా ఇంగ్లీష్ మీడియం (English Medium) ప్రవేశపెట్టారు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (AP CM Jagan Mohan Reddy) ప్రభుత్వ పాఠశాలల్లో (Govt Schools) ప్రతిష్టాత్మకంగా ఇంగ్లీష్ మీడియం (English Medium) ప్రవేశపెట్టారు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచి 6 వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 2021-22 నుంచి దశలవారీగా పదో తరగతి వరకూ పెంచుకుంటూ పోతోంది ప్రభుత్వం. దీనిపై మొదట ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత రాగా.. ఆ తర్వాత పరిస్థితులన్నీ సద్దుమణిగాయి. అయితే.. ఇంగ్లీష్ మీడియం వ్యవహారంపై తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkayya Naidu) స్పందిస్తూ సెటైర్ల వర్షం కురిపించారు. ఇంతకీ ఆయన ఇంగ్లీష్ మీడియం గురించి ఏమన్నారు..? మాతృభాష గురించి ఏమన్నారనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

వెంకయ్య కామెంట్స్ ఇవీ..

మాతృభాషను ప్రతి ఒక్కరూ తప్పక నేర్చుకోవాలి. ఆంగ్లాన్ని నేర్చుకున్నా మాతృభాషను ఎవరూ విస్మరించకూడదు. పిల్లలకు మాతృభాషను తల్లిదండ్రులు తప్పక నేర్పించాలి. విజయవాడలో మహాత్మాగాంధీ రోడ్‌ను ఎంజీరోడ్ (MG Road) అనడం మన దౌర్భాగ్యం. ఎంజీ రోడ్డును మహాత్మా గాంధీ రోడ్డుగానే పిలవాలని కోరుతున్నాను. ధర్మ రక్షణ కోసం, మానసిక ప్రశాంతక, సంపూర్ణ ఆరోగ్యాన్ని కల్పన కోసం పూర్వికులు ఆలయాలు నిర్మించారు. సూర్యుడు, వెలుతురు వినియోగించుకున్నన్నాళ్లు మనం ఆరోగ్యంగా ఉంటాం. రాత్రి త్వరగా పడుకుని సూర్యోదయం వేళల్లో లేవాలి. సెల్ ఫోన్ అతిగా వినియోగిస్తే హెల్ ఫోన్ అవుతుంది. సెల్ ఫోన్‌ను పరిమితగా మాత్రమే వాడాలి. ధర్మాన్ని మనం రక్షిస్తే మనల్ని రక్షిస్తుందిఅని వెంకయ్య పిలుపునిచ్చారు.

అందుకే కరోనా రాలేదు..

‘ నీరు, చెట్లను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. నిత్యం వెలుతురుతో మనం నివసించాలి. గాలి, వెలుతురు సూర్యరష్మికి దగ్గరగా ఉంటారు.. కాబట్టే గ్రామీణ ప్రాంతాల్లో వారికి కరోనా ఎక్కువగా రాలేదు. 80 శాతం పట్టణ ప్రాంతాల వారికే కరోనా వచ్చింది. సూర్యరశ్మిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రజలు ఆదాయాన్ని పెంచుకుని ఇతరులతో పంచుకుంటేనే ఆనందం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ పరిరక్షించాలి. మంత్రాలు చదివి వాటి అర్థాన్ని తెలుగులో భక్తులకు అర్థం చెప్పాలని పురోహితులకు చెబుతున్నాను. అందరూ నవ్వుతూ బ్రతకాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఇతరులకు ప్రేమను పంచుతూ సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నానుఅని వెంకయ్య సలహాలు, సూచనలు చేశారు.

కాగా.. నిన్న ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేసిన వెంకయ్య.. ఇవాళ ఇంగ్లీష్ మీడియంపై ఇలా సెటైర్ల (Sattaires) వర్షం కురిపించారు. వాస్తవానికి తాను రాజకీయాలకు దూరంగానే ఉంటున్నాని ఆయన చెబుతున్నా.. ఇలా కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలవడమే కాదు ఏపీ పాలిటిక్స్‌లో (AP Politics) హాట్ టాపిక్ అవుతున్నారు. మరి వెంకయ్య వ్యాఖ్యలపై అధికార పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్ వేస్తుందో వేచి చూడాలి మరి.

ఇవి కూడా చదవండి..

AP Capitals : ఏపీ రాజధానిపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు.. ఈ కామెంట్స్‌తో..

*************************

Lokesh Yuvagalam : నాన్నను చూడాలని బ్రాహ్మణిని అడిగిన దేవాన్ష్.. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా...!

*************************
YS Jagan : లెక్కలు తీసి మరీ పరువు తీసిన కేంద్రం.. సిగ్గో.. సిగ్గు మూడున్నరేళ్లలో సీఎం జగన్ కట్టిన ఇళ్లు ఎన్నో తెలిస్తే షాకే..!

*************************

Updated Date - 2023-02-12T13:52:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising