ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lokesh Delhi Tour : అమిత్ షాతో కీలక భేటీ తర్వాత.. లోకేష్ ఢిల్లీలో ఏం చేయబోతున్నారు.. రేపు సంచలనమేనా..!?

ABN, First Publish Date - 2023-10-12T17:21:06+05:30

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (Chandrababu) స్కిల్ అక్రమ కేసులో (Skill Development Case) అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు ఎలా మారిపోయాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వ్యవస్థలను తన చేతుల్లో పెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy).. బాబు తర్వాత ఒక్కొక్కర్ని అరెస్ట్ చేయాలని టీడీపీ కీలక నేతలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు కోకొల్లలు...

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (Chandrababu) స్కిల్ అక్రమ కేసులో (Skill Development Case) అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు ఎలా మారిపోయాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వ్యవస్థలను తన చేతుల్లో పెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy).. బాబు తర్వాత ఒక్కొక్కర్ని అరెస్ట్ చేయాలని టీడీపీ కీలక నేతలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు కోకొల్లలు. అక్రమ కేసులు బనాయిస్తూ, కక్ష పూరిత రాజకీయాలు చేస్తున్నారని ఢిల్లీ వేదికగా జగన్ సర్కార్ (Jagan Govt) తీరును జాతీయస్థాయిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) ఎండగడుతున్నారు. ఇప్పటికే జాతీయ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వడం, రాష్ట్రపతితో పాటు పలువురు ముఖ్యనేతలు, పలు పార్టీల అధినేతలను కలిశారు. రెండోసారి పర్యటనలో భాగంగా బుధవారం నాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో (Amit Shah) లోకేష్ భేటీ అయ్యారు.


భేటీ సరే.. తర్వాత ఏంటి..?

షాతో లోకేష్ సుమారు అరగంటకు పైగానే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో అసలేం జరుగుతోంది..? జగన్ సర్కార్ ఎందుకింత కక్షపూరిత రాజకీయాలు చేస్తోంది..? రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏమిటి..? ప్రభుత్వం పనితీరు..? ఇలా అన్ని విషయాలపై సుదర్ఘీ చర్చ జరిగింది. ప్రతి విషయాన్ని షాకు నిశితంగా వివరించారు. చంద్రబాబుపై కేసులు, ట్రయల్‌ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ..తనను, బాబును విచారణ పేరుతో వేధిస్తున్నారని.. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణినీ ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్రమంత్రికి లోకేష్ తెలిపారు. అయితే.. అమిత్ షా మధ్యలోనే కలుగజేసుకుని చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు?.. మీపై ఎన్ని కేసులు పెట్టారు?.. చంద్రబాబు ఆరోగ్యం (Chandrababu Health) ఎలా ఉంది..? లోకేశ్‌ను అడిగారు. ఏపీలో ఎందుకిలా జరుగుతోంది..? 73 ఏళ్ల వయసున్న చంద్రబాబును కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదని షా అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోన్న పరిణామాలన్నింటినీ తాను నిశితంగా గమనిస్తున్నట్లు.. లోకేష్‌కు షా ఒకింత అభయమిచ్చారు. వాస్తవానికి షా ఇలా రియాక్ట్ అవ్వడం ఇది రెండోసారి.. ఆ మధ్య సీఎం జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కూడా చంద్రబాబు అరెస్ట్ ప్రస్తావన రాగా.. సీఎంకు షా తలంటినట్లు కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు నేరుగా లోకేష్ కలవడం, స్వయంగా షానే అన్ని విషయాలు మాట్లాడటంతో ఇప్పుడు ఏం జరగబోతోంది..? అనేదానిపై అటు టీడీపీ శ్రేణుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొనగా.. వైసీపీలో వణుకు మెదలైందట.

లోకేష్ ఏం చేయబోతున్నారు..?

ఇదిలా ఉంటే.. షాతో భేటీలో ఏం జరిగిందనే విషయాలను కూడా మీడియా ముఖంగా లోకేష్ వివరించారు. అమిత్ షాతో ఎలాంటి రాజకీయ అంశాలపై చర్చించలేదు. ఎన్ని కేసులు , ఏ ఏ బెంచ్‌లో ఉన్నాయనే అంశాలను అమిత్ షా అడిగారు’ అని యువనేత చెప్పుకొచ్చారు. చంద్రబాబు కేసుల విషయంపై ఇవాళ సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాదులతో లోకేష్ సమావేశం అయ్యారు. అనంతరం స్కిల్ కేసులో ఎలా ముందుకెళ్లాలి..? ఏం చేస్తే బాగుంటుంది..? బాబును బెయిల్‌పై ఎలా బయటికి తీసుకురావాలి..? తనపై ఉన్న కేసుల విషయంలో ఏం చేయాలనే విషయాలపై న్యాయ నిపుణులతోనూ లోకేష్ చర్చించారు. దీనిపైనా లోకేష్ మాట్లాడుతూ.. రేపు సుప్రీంకోర్టులో 17ఏ పై చరిత్రాత్మక తీర్పు రాబోతోందన్నారు. మరోవైపు.. ఒకరిద్దరు కేంద్ర మంత్రులతో కూడా లోకేష్ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు.. శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్యాష్ పిటిషన్‌పై విచారణ జరగబోతోంది. ధర్మాసనం తీర్పు విషయంలో అంతా మంచే జరగాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. ఇవాళ లోకేష్‌పై ఉన్న స్కిల్ అక్రమ కేసును ఏపీ హైకోర్టు డిస్పోజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబుకు కూడా కోర్టుల్లో బిగ్ రిలీఫ్ దక్కాలని శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి. అయితే లోకేష్ మాత్రం మరో నాలుగైదు రోజులు ఢిల్లీలోనే ఉంటారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.

Skill Case : స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోకేష్‌కు భారీ ఊరట

Updated Date - 2023-10-12T17:33:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising