NCBN Case : చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో తీర్పు ఎప్పుడొస్తుంది..!?
ABN, First Publish Date - 2023-10-09T17:49:17+05:30
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుపై (Nara Chandrababu) సీఐడీ (CID) అక్రమంగా స్కిల్ కేసు (Skill Case) బనాయించి అరెస్ట్ చేసి నేటికి నెలరోజులయ్యింది. ఇప్పటికే తాను నిర్దోషిని అని నిరూపించుకోవడానికి కింది స్థాయి నుంచి దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకూ చంద్రబాబు న్యాయపోరాటం చేస్తున్నారు..
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుపై (Nara Chandrababu) సీఐడీ (CID) అక్రమంగా స్కిల్ కేసు (Skill Case) బనాయించి అరెస్ట్ చేసి నేటికి నెలరోజులయ్యింది. ఇప్పటికే తాను నిర్దోషిని అని నిరూపించుకోవడానికి కింది స్థాయి నుంచి దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకూ చంద్రబాబు న్యాయపోరాటం చేస్తున్నారు. అక్టోబర్-09న సోమవారం నాడు సుప్రీంకోర్టులో ‘క్వాష్ పిటిషన్’ పై.. ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్‌పై.. ఇక హైకోర్టులో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు, ఫైబర్ నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్‌పై విచారణ జరిగింది. ఏసీబీ, హైకోర్టుల తీర్పు సంగతి అటుంచితే.. క్వాష్ పిటిషన్‌పై తీర్పు బాబుకు సానుకూలంగానే వస్తుందని టీడీపీ శ్రేణులు భావించాయి కానీ.. నిరాశే మిగిలింది. గతంలో వాదనల దగ్గరే ఆపేసిన సుప్రీంకోర్టు.. ఇవాళ కూడా అటు సీఐడీ.. ఇటు చంద్రబాబు తరఫున లాయర్ల వాదనలు విన్నది. జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్‌సాల్వే, అభిషేక్ మను సింఘ్వీ, సిద్ధార్థ లూథ్రా.. సీఐడీ తరఫున ఏపీ సర్కార్ తరపున లాయర్ ముకుల్ రోహత్గి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
తీర్పు ఎప్పుడు.?
సోమవారం ఉదయం ప్రారంభమైన ఇరుపక్షాల వాదనలు సాయంత్రం 5.15 గంటల సమయంలో ముగిశాయి. ఇవాళ అంతా సుప్రీంకు హరీష్ సాల్వే సుదీర్ఘ వాదనలు వినిపించారు. కాగా.. ఈ పిటిషన్‌పై రేపు కూడా విచారణ కొనసాగనున్నది. మంగళవారం రోజున ప్రభుత్వం తరఫున ప్రభుత్వ తరపు లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించబోతున్నారు. దీన్ని బట్టి చూస్తే.. వాదనలతోనే మంగళవారం ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే.. ఇరువర్గాల వాదనలను నిశితంగా పరిశీలించడానికి సుప్రీం కోర్టు న్యాయమూర్తి మళ్లీ ఒక్కరోజు గడువు తీసుకునే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే.. మంగళవారం నాడు క్వాష్ పిటిషన్‌పై తీర్పు రావడం కష్టమేనన్న మాట. మొత్తమ్మీద తీర్పు బుధవారం నాడు సుప్రీం నుంచి వెలువడే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
సాల్వే ఏం వాదించారు..?
17ఏ డేట్ ఆఫ్ ఎఫ్‌ఐఆర్ వర్తిస్తుందా..? లేదా..? డేట్ ఆఫ్ అఫెన్స్ కింద వర్తిస్తుందా..? అనేది కోర్టు ముందుంచాం
నేరుగా నగదు తీసుకుంటూ పట్టుబడితే తప్ప మిగిలిన అన్నింటికి 17ఏ వర్తిస్తుంది
ఈ కేసులో ఫిర్యాదును చూస్తే సీమెన్స్, డిజైన్‌టెక్, ఇతరుల పేర్లున్నాయే తప్ప పిటిషనర్ పేరు లేదు
పైగా ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు 2021 తర్వాత జరిగిందని భావించాలి.. అందువల్ల 17A సవరణ ఈ కేసుకు వర్తిస్తుంది
ఇప్పుడు మీరు మళ్లీ హైకోర్టుకు వెళ్లి వాదన వినిపించమంటే మేం నష్టపోతాం
హైకోర్టు కచ్చితంగా సెక్షన్ 17A సవరణ దీనికి వర్తించదంటారు..
ఒక డాక్యుమెంట్ కారణంగా తీర్పు మారకూడదు
నేను మీకు ఈ డాక్యుమెంట్ గురించి ఎందుకు చెప్పానంటే.. దీని వల్లే CID వారు దర్యాప్తును 2018 కంటే ముందు ప్రారంభించామంటున్నారు
హైకోర్టు ఏమంటుందంటే.. ప్యారా 15 ప్రకారం నేరం 2015-16 మధ్య జరిగిందని చెబుతోంది
వారి దృష్టిలో దర్యాప్తు తేదీకి ఎలాంటి సంబంధం లేదు.. ఎందుకంటే ఏపీ హైకోర్టు అసలు డాక్యుమెంట్‌నే పరిగణనలోకి తీసుకోలేదు : సాల్వే
లంచ్ బ్రేక్ తర్వాత..
చంద్రబాబు కేసులో విచారణ ఎప్పుడు ప్రారంభమైంది : సుప్రీం జడ్జి
2021 డిసెంబర్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారన్న సాల్వే
2017లోనే కేసు దర్యాప్తు ప్రారంభమైందనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్న సాల్వే
17A కింద గవర్నర్ అనుమతి తీసుకున్నాకే అరెస్ట్ చేయాలి..
17A విధివిధానాలను కోర్టుకు వివరించిన లాయర్ సాల్వే
2018 తర్వాత ఫిర్యాదు ఆధారంగా 2021లో ఎఫ్‌ఐఆర్ దాఖలు
2017లో విచారణకు సంబంధించిన ఏ అంశాలను కూడా..
2021 ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదంటూ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు.
Updated Date - 2023-10-09T17:55:06+05:30 IST