ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hindupuram: హిందూపురంలో బాలయ్య హ్యాట్రిక్ విక్టరీని దీపిక అడ్డుకోగలరా..? సర్వేలో ఏం తేలిందంటే..

ABN, First Publish Date - 2023-07-06T16:49:29+05:30

హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మహిళా నాయకురాలు టిఎన్ దీపికను వైసీపీ అధిష్ఠానం నియమించింది. ఈ నియామకం వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చక్రం తిప్పినట్లు సమాచారం. రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ముచ్చటగా మూడోసారి నందమూరి బాలకృష్ణ, వైసీపీ నుంచి దీపిక తలపడటం దాదాపుగా ఖాయమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ ఆవిర్భావం నుంచి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం (Hindupur) సైకిల్ పార్టీకి కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (NTR) మొదలుకుని హరికృష్ణ (Nandamuri HariKrishna), బాలకృష్ణ (Balakrishna) పోటీలో నిలిచి గెలిచిన నియోజకవర్గం హిందూపురం. 1983 నుంచి 2019 వరకూ పది సార్లు ఇక్కడ పసుపు జెండానే ఎగిరింది. ఈ ఒక్క విషయం చాలనుకుంటా తెలుగుదేశం పార్టీకి హిందూపురం ఎలాంటి కంచుకోటనో చెప్పడానికి. అలాంటి టీడీపీ కంచుకోటను బద్ధలు కొట్టడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ రెడ్డి (YCP Jagan) పావులు కదుపుతున్నారు. బాలయ్యపై పోటీ చేసే అభ్యర్థి విషయంలో కూడా ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మహిళా నాయకురాలు టిఎన్ దీపికను (Deepika Hindupuram) వైసీపీ అధిష్ఠానం నియమించింది. ఈ నియామకం వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చక్రం తిప్పినట్లు సమాచారం. రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) టీడీపీ నుంచి ముచ్చటగా మూడోసారి నందమూరి బాలకృష్ణ, వైసీపీ నుంచి దీపిక తలపడటం దాదాపుగా ఖాయమైంది. 2019 ఎన్నికల్లో బాలయ్యపై పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఐపీఎస్‌ అధికారి షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ను జగన్ పక్కనపెట్టడం వెనుక పెద్ద కథే ఉందట.

వైసీపీ అధినేత జగన్ రాయలసీమలోని రెండు నియోజకవర్గాల్లో టీడీపీని ఓడించాలని తహతహలాడుతున్నారట. ఆ రెండు నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటలు. అందులో ఒకటి టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం కాగా, మరొకటి నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తోన్న హిందూపురం. ఈ రెండు నియోజకవర్గాలపై వైసీపీ అధినేత జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు వైసీపీ సోషల్ మీడియా హడావుడితో స్పష్టమైంది. కానీ.. ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబును, బాలకృష్ణను ఓడించే సత్తా వైసీపీకి ఉందా అనే ప్రశ్నకు లేదని నిస్సందేహంగా చెప్పేయొచ్చు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. హిందూపురం నియోజకవర్గం విషయానికే వద్దాం. టీడీపీ అనేక సంక్షోభాలను, ఆటుపోట్లను ఎదుర్కొన్న సమయంలో కూడా హిందూపురం నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీనే అభిమానించారు. తెలుగుదేశం అభ్యర్థినే ఆదరించారు. నందమూరి కుటుంబానికి చెందిన వారినే కాదు టీడీపీ తరపున పోటీ చేసిన నేతలకూ ఎమ్మెల్యేలుగా పట్టం కట్టారు. 2004లో పామిశెట్టి రంగనాయకులు, 2009లో పి.అబ్దుల్ ఘని టీడీపీ నుంచే హిందూపురం ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడమే ఇందుకు ఉదాహరణ.

ఒక్కమాటలో చెప్పాలంటే.. అభ్యర్థి ఎవరనే అంశంతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీకి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు పట్టం కడుతున్నారు. 2019లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించినప్పుడు కూడా హిందూపురంలో మాత్రం పసుపు జెండానే ఎగిరింది. టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నందమూరి బాలకృష్ణ తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి అయిన ఇక్భాల్‌పై 17,028 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. 2019లో కొన్ని కీలక నియోజకవర్గాల్లో టీడీపీ బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కగా హిందూపురం నియోజకవర్గంలో మాత్రం 17 వేల మెజారిటీ రావడం హిందూపురంలో తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో ఎంత బలంగా ఉందో చెప్పేందుకు నిదర్శనం. ఇలాంటి చోట తెలుగుదేశం అభ్యర్థిని, అది కూడా నందమూరి బాలకృష్ణను ఓడించడం కష్టతరమేనని చెప్పక తప్పదు. ఇక.. కుప్పంలో ‘లక్ష మెజారిటీ’ నినాదంతో టీడీపీ దూకుడుగా ముందుకెళుతోంది. అలాంటి కుప్పంలో చంద్రబాబును ఓడించడం మాట అటుంచితే.. మెజారిటీని తగ్గించేందుకే వైసీపీ కిందామీద పడుతున్న పరిస్థితి.

హిందూపురంలో నందమూరి బాలకృష్ణపై వైసీపీ ప్రయోగించాలని డిసైడ్ అయిన జగనాస్త్రం పేరు టీఎన్ దీపిక. ఇక్భాల్‌ను సైడ్ చేసి మరీ హిందూపురం బరిలో దీపికను నిలపాలని వైసీపీ అధినేత భావించడం వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని టాక్. దీపికకు మహిళా ఓటు బ్యాంకు కలిసొస్తుందనే లెక్కలతో పాటు, బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడం కూడా ఆమె గెలుపునకు సాయపడే మరో అంశంగా వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్లు సమాచారం. పైగా.. హిందూపురం అసెంబ్లీ నియోజవర్గంలో ఇప్పటివరకూ మహిళా అభ్యర్థి పోటీలో నిలవకపోవడం కూడా దీపికకు సానుకూల అంశంగా జగన్ లెక్కలేసుకున్నట్లు తెలిసింది. వీటితో పాటు దీపికను అభ్యర్థిగా నిలపాలనేది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సలహాగా తెలుస్తోంది.

రాయలసీమ కో ఆర్డినేటర్‌గా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొంతకాలంగా ఎమ్మెల్సీ ఇక్భాల్‌పై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఆయన వర్గీయుడిగా ఉన్న పెనుకొండ నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడి ద్వారా ఎమ్మెల్సీకి చెక్‌పెట్టి, దీపికను తెరపైకి తీసుకొచ్చారని హిందూపురం నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి మరోసారి హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని నందమూరి బాలకృష్ణ భావిస్తుంటే.. టీడీపీ కంచుకోటలో ముక్కిమూలిగైనా గెలిచి తీరాలని వైసీపీ ఎంతో పట్టుదలగా ఉంది. కానీ.. వైసీపీ చేసిన అంతర్గత సర్వేల్లో కూడా హిందూపురం నుంచి బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని తెలియడంతో వైసీపీ శ్రేణులు డీలా పడిన పరిస్థితి. ఏది ఏమైనా.. హిందూపురం అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఒకింత రసవత్తరంగానూ, రాజకీయంగా ఆసక్తి రేకెత్తించే ఎన్నికలుగా మారనున్నాయనడంలో సందేహమే లేదు.

Updated Date - 2023-07-06T16:53:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising