ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YSRCP : చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్న వైసీపీ ముఖ్యనేత.. భారీగా ఏర్పాట్లు చేస్తుండగా చంపుతామని బెదిరింపులు.. ఇంతకీ ఎవరాయన..?

ABN, First Publish Date - 2023-02-08T18:04:45+05:30

వైసీపీ అధిష్టానంపై (YSRCP High Command) కొందరు ఎమ్మెల్యేలు (MLAs) అసమ్మతి గళం వినిపిస్తుంటే.. మరికొందరు ముఖ్యనేతలను పార్టీ లైన్ దాటారని హైకమాండ్ సస్పెండ్ చేస్తోంది. అసమ్మతి ఎమ్మెల్యేలు రెబల్స్‌గా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి/విజయవాడ : వైసీపీ అధిష్టానంపై (YSRCP High Command) కొందరు ఎమ్మెల్యేలు (MLAs) అసమ్మతి గళం వినిపిస్తుంటే.. మరికొందరు ముఖ్యనేతలను పార్టీ లైన్ దాటారని హైకమాండ్ సస్పెండ్ చేస్తోంది. అసమ్మతి ఎమ్మెల్యేలు రెబల్స్‌గా (Rebals) మారుతుండగా.. సస్పెండ్ అయిన నేతలు పక్కపార్టీల వైపు చూస్తున్నారు. మరోవైపు.. వైసీపీ అధికారంలోకి వస్తే ఏదో జరుగుతుందని ఊహించిన కొందరు నేతలు చివరికి తీవ్ర నిరాశతో పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు వైసీపీకి (YSR Congress) టాటా చెప్పేసి బయటికి రాగా.. తాజాగా విజయవాడకు (Vijayawada) చెందిన ముఖ్యనేత ఒకరు టీడీపీ (TDP) తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైపోయారు. అది కూడా చంద్రబాబు (Chandrababu) సమక్షంలో పసుపు కండువా కప్పుకోవడానికి భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అసలు ఎవరాయన..? ఎందుకు వైసీపీని వీడాలని అనుకుంటున్నారు..? ఆయన టీడీపీలోకి రావడం వెనుక చక్రం తిప్పిందెవరు..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

ఇంతకీ ఎవరాయన.. ఏం జరిగింది..?

ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్యనేత గోగుల రమేష్ (Gogula Ramesh). ఈయన కృష్ణలంకకు (Krishna Lanka) చెందిన కీలకనేత. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన ఈయన టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకోవడానికి మంచిరోజు కోసం రమేష్ వేచిచూస్తున్నారు. ముఖ్య అనుచరులు, కృష్ణలంక నేతలతో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. అయితే వర్గవిబేధాల వల్లే రమేష్ వైసీపీ నుంచి బయటికి వస్తున్నట్లు తెలుస్తోంది. గోగులను అదేపార్టీకి చెందిన అరవ సత్యం బెదిరించారని వార్తలు వస్తున్నాయి.వైసీపీ యువనేత దేవినేని అవినాష్ (Devineni Avinash) , అతని అనుచరులపై అధిష్టానానికి టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ (Gadde Rammohan), ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న (Budda Venkanna) ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై నిశితంగా ఆలోచించాక వైసీపీకి గుడ్ బై చెప్పాలని గోగుల రమేష్ నిర్ణయించుకున్నారట.

గోగుల గురించి గద్దె మాటల్లో..

గోగుల రమేష్ 2019 ఎన్నికల్లో వైసీపీ నాయకుడిగా పని చేశారు. మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వ పాలన నచ్చక టీడీపీలో చేరేందుకు ముందుకు వచ్చారు. చేరికపై.. నేను, వంగవీటి రాధా కలిసి చంద్రబాబుకు కూడా సమాచారం ఇచ్చాం. మా అధినేత సమక్షంలో త్వరలోనే రమేష్ పసుపు కండువా కప్పుకోనున్నారు.ఇది తెలుసుకున్న వైసీపీ నేతలు చంపుతామని రమేష్ ను బెదిరించడం దుర్మార్గం. ఈ పరిణామాలను పోలీసు కమిషనర్‌ను కలిసి వివరించాం. అన్నీ విచారించి అవసరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చారు గద్దె రామ్మోహన్ మీడియాకు వివరించారు.

ఎందుకీ బెదిరింపులు..

టీడీపీలో చేరాలనుకున్న నాయకులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవినేని అవినాష్ , అతని అనుచురుడు అరవ సత్యంతో కలిసి చంపుతామని హెచ్చరిస్తున్నారు. పోలీసులకు కూడా ఈ ఘటనలపై గోగుల రమేష్ ఫిర్యాదు చేశారు. హత్య కేసుల్లో అరవ సత్యం ఇప్పటికే నిందితుడిగా ఉన్నాడు. పోలీసులను కూడా తప్పుదోవ పట్టించేలా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఇటీవలే కృష్ణలంకలో మహిళల పై దాడులు చేసి, అదే మహిళపై కేసులు పెట్టించారు. విజయవాడలో పాత పరిస్థితి తీసుకువచ్చేలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో పోలీసు కమిషనర్‌ను కలిసి వారి అరాచకాలను వివరించాం. వైసీపీ నాయకులూ కూడా గుర్తు పెట్టుకోండి.. రాజకీయం చేయండి తప్పు లేదు కానీ భయపెట్టి, బెదిరిస్తామంటే.. భవిష్యత్‌లో మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారుఅని బుద్దా స్ట్రాంగ్ వార్నింగ్ (Warning) ఇచ్చారు. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న జిల్లా నేతలను టీడీపీలో చేర్చేందుకు గద్దె, బుద్దా చక్రం తిప్పుతున్నారన్న మాట.

మొత్తానికి చూస్తే.. దేవినేని అవినాష్ తీరు నచ్చక ఇప్పటికే కొందరు ముఖ్యులు వైసీపీని వీడగా ఇప్పుడు మరికొందరు పార్టీని వీడుతున్నారని దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే నియోజకవర్గంలో వైసీపీలో ఫలానా వారున్నారు అని చెప్పుకునేందుకు జనాలు లేకుండా పోతారేమో అని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ్నుంచో వచ్చి విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి వచ్చి అవినాష్ హడావుడి చేస్తున్నారని.. ఆయన తీరుపై చాలా మంది నేతలు గుర్రుగా ఉన్నారనేది చాలా రోజులుగా నడుస్తున్న టాక్. మున్ముందు మరింత మంది నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో అని విశ్లేషకులు చెబుతున్నారు.. ఏం జరుగుతోందో లెట్స్ సీ.

*************************

ఇవి కూడా చదవండి..

KotamReddy : కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలేం జరిగిందో.. పూసగుచ్చినట్లుగా చెప్పిన బెస్ట్ ఫ్రెండ్.. ఇదీ అసలు కథ..


*************************

YSRCP : కోటంరెడ్డి తర్వాత పార్టీ లైన్ దాటిన కీలక నేత.. వైసీపీ నుంచి సస్పెండ్ చేసేసిన YS Jagan.. అసలేం జరిగిందంటే...

*************************

Telangana: అధికారపార్టీ ఓటుకు లక్ష ఇచ్చి.. వెయ్యి కోట్లు ఖర్చుపెట్టినా గెలుస్తానంటున్న ఎమ్మెల్యే.. ఇంతకీ ఆయన ధీమా ఏంటి.. ఏ పార్టీ నుంచి పోటీచేస్తారు..?

*************************

YS Jagan YS Sharmila : రేపో మాపో జైలుకు వైఎస్ జగన్.. షర్మిలకు సీఎం అయ్యే ఛాన్స్.. ఆ కీలకనేత ఇలా అనేశారేంటి..?

*************************

BRS MLAs Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం.. తెలంగాణ సర్కార్‌ పిటిషన్‌పై సుప్రీం నిర్ణయం ఇదీ..

*************************

YSRCP : నెల్లూరు రూరల్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టాక ఆదాల ఇచ్చిన మొదటి హామీ ఇదే.. ఇదేదో సరికొత్తగా ఉందే..

*************************


Updated Date - 2023-02-08T18:27:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising