ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TeluguDesam : నారా లోకేష్‌తో చేతులు కలిపిన వైసీపీ యంగ్ ఎంపీ.. ఏదో జరుగుతోందంటూ ఎక్కడ చూసినా ఇదే చర్చ..!

ABN, First Publish Date - 2023-07-14T22:17:34+05:30

అవును.. మీరు వింటున్నది నిజమే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్‌ను (Nara Lokesh) వైసీపీ యువ ఎంపీ (YSRCP Young MP) కలిశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో వైరల్ కావడంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. అయితే ఇంతకుమునుపే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవును.. మీరు వింటున్నది నిజమే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్‌ను (Nara Lokesh) వైసీపీ యువ ఎంపీ (YSRCP Young MP) కలిశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో వైరల్ కావడంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. అయితే ఇంతకుమునుపే ఆ యంగ్ ఎంపీ వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు రావడం.. ఆ తర్వాత క్లారిటీ ఇచ్చుకోవడం.. ఇప్పుడు లోకేష్‌ను కలవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు..? ఈ ఇద్దరూ ఏ సందర్భంలో కలుసుకున్నారు..? అసలు విషయమేంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..


అసలేం జరిగింది.. ఎవరా యంగ్ ఎంపీ..?

ఆ యంగ్ ఎంపీ మరెవరో కాదండోయ్.. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు (MP Lavu Sri Krishna Devarayalu). చైతన్య విద్యాసంస్థల అధినేత బి.ఎస్ రావు (BS Rao) హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం నాడు ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తీసుకురావడంతో పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు, విద్యాసంస్థల అధినేతలు నివాళులు అర్పించారు. అయితే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నారా లోకేష్ కూడా అక్కడికి వచ్చారు. ఇక్కడో ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. బీఎస్ రావు భౌతికకాయానికి నివాళులు అర్పించి వైసీపీ ఎంపీ తిరిగి వెళ్తుండగా ఎదురుగా నారా లోకేష్ వచ్చారు. దీంతో అక్కడే ఆగిపోయిన ఆ యంగ్ ఎంపీ.. జనాలను పక్కకునెట్టి మరీ లోకేష్‌కు షేక్ హ్యాండ్ (Shake Hand) ఇచ్చారు. అనంతరం అక్కడున్న జనాలకు నమస్కరిస్తూ లోకేష్ అటు ముందుకెళ్లగా.. ఎంపీ లావు ఇటు బయటికొచ్చేశారు. ఈ సీన్‌ చూసిన కొందరు వైసీపీ, టీడీపీ కార్యకర్తలు, వీరాభిమానులు కెమెరాల్లో బంధించారు. ఈ ఇంట్రెస్టింగ్ సీన్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కామెంట్స్ అయితే వైసీపీ (YSRCP), టీడీపీ (Telugudesam) కార్యకర్తలు చిత్రవిచిత్రాలుగా చేస్తున్నారు. ఎంపీ లావునే ముందుకెళ్లి లోకేష్‌కు షేక్ హ్యాండివ్వడంతో ఏదో జరుగుతోందని వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే అక్కడున్న సందర్భం వేరు కదా.. అదే స్థానంలో సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) ఉన్నా పలకరింపులు ఉంటాయని దీన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు.

వాస్తవానికి సీన్ ఇదీ..!

వాస్తవానికి ఎంపీ లావు టీడీపీ (TDP) తీర్థం పుచ్చుకోబోతున్నారని.. టీడీపీ అధినేత చంద్రబాబుతో రహస్యంగా భేటీ అయ్యారని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. నరసారావుపేట (Narasaraopet) పార్లమెంట్ పరిధిలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో గొడవలు ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. గతేడాది టీడీపీ ఎంపీలతో కలిసి ఫొటోలు దిగడం పెద్ద చర్చకే దారితీసింది. ఈ వార్తలపై స్పందించి అదంతా అవాస్తవామని క్లారిటీ ఇచ్చుకున్నారు. నేను టీడీపీ అధినేత చంద్రబాబును కలవలేదు. టీడీపీలో ఇతర నేతలను కూడా కలవలేదు. చంద్రబాబును (NCBN) కలిసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఈ విషయంపై నన్ను కలిసిన వారు వచ్చి చెప్పినా ఓకే.. నిరూపించండిఅని అప్పట్లో లావు మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చుకున్నారు. అయితే.. తాజాగా లోకేష్‌కు ఎంపీ లావు వెళ్లి మరీ షేక్ హ్యాండ్ ఇవ్వడంతో ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. ఏమో.. రానున్న ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఎవరికి ఎరుక..!


ఇవి కూడా చదవండి


Pawan Kalyan : చింతిస్తున్నా.. అందరి ముందు క్షమాపణలు కోరిన పవన్ కల్యాణ్


BJP Vs YSRCP : మొదటి ప్రసంగంతోనే వైఎస్ జగన్‌ను ఏకిపారేసిన పురంధేశ్వరి.. కనీసం కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ సాహసించట్లేదంటే..!?


BRS : తెలంగాణలో మారిపోతున్న రాజకీయ సమీకరణాలు.. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఔట్..!?


TS Politics : హిమాన్ష్ సూచన తప్పకుండా తీసుకుంటాం.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు


Revanth Vs KCR : తెలంగాణలో ‘పవర్’ పాలిటిక్స్ నడుస్తుండగా.. షాకింగ్ సర్వే అంటూ సడన్‌గా బాంబ్ పేల్చిన రేవంత్ రెడ్డి


YSRCP : చంద్రబాబుతో రహస్య భేటీ.. టీడీపీలో చేరికపై ఒక్క ప్రెస్‌మీట్‌తో తేల్చేసిన వైసీపీ ఎంపీ.. అసలేం జరిగిందంటే..



Updated Date - 2023-07-14T22:24:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising