YuvaGalam Padayatra: రానున్న ఎన్నికల్లో పోటీ స్థానంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసేసి నారా లోకేష్.. గెలిచి చరిత్ర సృష్టిస్తానంటూ ధీమా
ABN, First Publish Date - 2023-02-24T21:07:44+05:30
టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) రానున్న ఎన్నికల్లో మంగళగిరి పోటీ స్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తిరుపతి: టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) రానున్న ఎన్నికల్లో మంగళగిరి పోటీ స్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదటిసారి 2019 ప్రత్యక్ష ఎన్నికల్లో మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేసి పరాజయంపాలయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో పక్కాగా భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి నియోజకవర్గంలో ఇవాళ జరిగిన యువగళం పాదయాత్రలో భాగంగా యూత్ ముఖాముఖిలో నారా లోకేష్ ఈ విషయాలను వెల్లడించారు.
చరిత్ర సృష్టిస్తా..
1983, 1985లో రెండుసార్లు మాత్రమే మంగళగిరిలో టీడీపీ గెలిచిందని లోకేష్ అన్నారు. టీడీపీ గెలవని చోట గెలిచి, కంచుకోటగా మార్చాలనుకున్నానని లోకేష్ స్పష్టం చేశారు. మొదటిసారి ఫెయిల్ అయ్యా.. అయినా తనలో ఫైర్ ఉందని, 2024లో మంగళగిరిలో గెలిచి చరిత్ర సృష్టిస్తామని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.
ప్రత్యేక వ్యూహంతో..
ఇందులో భాగంగా ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య సంజీవిని పేరుతో ఓ మెడికల్ వాహనం తయారు చేయించి నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. లోకేష్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఈ వాహనం.. మంగళగిరిలోని ప్రతీ గ్రామం తిరిగి ప్రజలకు వైద్య పరీక్షలు చేసి ప్రాథమిక వైద్యం అందిస్తుంది. దీంతోపాటు.. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు.. స్త్రీ శక్తి పేరుతో ట్రైలరింగ్ ఉచిత శిక్షణ కార్యక్రమాలు, కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నారు. ఇక ప్రతీ గ్రామంలో పెళ్లిళ్లు చేసుకునే పేదలకు లోకేష్ పెళ్లి కానుక పేరుతో ఆర్థిక సాయం అందజేస్తున్నారు. చిరు వ్యాపారాలు చేసుకునే వారికి తోపుడు బండ్లు ఉచితంగా పంపిణీ చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఇలా ఉచిత సేవలు అందిస్తూ లోకేష్ ప్రజల్లో పట్టు సాధిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ముఖ్యమైన నియోజకవర్గాల్లో మంగళగిరి (Mangalagiri) ఒకటి. సీఎం నివాస ప్రాంతంతో పాటు రాజధాని విస్తరించి ఉంది.ఇదే మంగళగిరి నుంచి నారా లోకేష్ (Nara Lokesh) ప్రాతినిధ్యం వహించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ టీడీపీ (Tdp) అభ్యర్థిగా మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత.. వైసీపీ నుంచి నారా లోకేష్ తీవ్రమైన విమర్శలు, హేలనలు ఎదుర్కొన్నారు. అయితే ఈసారి నారా లోకేష్ మంగళగిరిని చాలెంజ్‌గా తీసుకున్నారట. వచ్చే ఎన్నికల్లో గెలిచి అందరి నోళ్లు మూయించాలని ధృడ సంకల్పంతో ఉన్నారట. దీంతో నిత్యం మంగళగిరిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. వ్యక్తిగత సిబ్బందిని మంగళగిరిలోనే ఉంచి పార్టీ కార్యకర్తల యోగక్షేమాలను తెలుసుకుంటూ వారి అవసరాలు తీరుస్తున్నారు. నారా లోకేష్ దూకుడును గమనించిన వైసీపీకి టెన్షన్ పట్టుకుందట. ఓటు బ్యాంక్ రాజకీయాలపై వైసీపీ ఫుల్ ఫోకస్ పెట్టిందట.
ప్రభుత్వ పెద్దలపై ఆగ్రహం.. ఉద్యోగులు దాచుకున్న డబ్బులెక్కడ..
Updated Date - 2023-02-24T21:15:35+05:30 IST