Hostel Girls: రాత్రి 10 గంటల సమయం.. సడన్‌గా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన 60 మంది బాలికలు.. ఏడుస్తూ వాళ్లంతా చెప్పింది విని..!
ABN, First Publish Date - 2023-09-19T17:50:42+05:30
కొన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో వసతుల కొరతతో విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు పడుతుంటారో తరచూ చూస్తూనే ఉంటాం. ఇక హాస్టళ్లలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. మరోవైపు ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే విద్యార్థినులకు వివిధ రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. కొందరు..
కొన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో వసతుల కొరతతో విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు పడుతుంటారో తరచూ చూస్తూనే ఉంటాం. ఇక హాస్టళ్లలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. మరోవైపు ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే విద్యార్థినులకు వివిధ రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. కొందరు బయటికి చెప్పుకోలేక సతమతమవుతుంటారు. తాజాగా, జార్ఘండ్‌లోని కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినులకు ఇలాంటి సమస్యే ఎదురైంది. రాత్రి 10గంటల సమయంలో 60మంది బాలికలు ఏడుస్తూ పోలీస్ స్టేషన్ వెళ్లారు. చివరకు ఏం జరిగిందంటే...
జార్ఘండ్ రాంచీ (Jharkhand Ranchi) పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక మందార్‌లోని కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్లో (Kasturba Gandhi Residential School) సుమరు 60మంది బాలికలు చదువుతున్నారు. వీరంతా స్కూల్‌కు సంబంధించిన హాస్టల్లోనే ఉంటున్నారు. అయితే ఇటీవల ఈ హాస్టల్ (Hostel) స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ రోజు రాత్రి హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులంతా (students) మూకుమ్మడిగా బయటికి వచ్చారు. అంతా కలిసి స్థానికంగా ఉన్న మందర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. అంతా ఏడుస్తూ ఉండడంతో స్థానికులతో పాటూ పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఏం జరిగిందో అని అంతా ఒక్కసారిగా కంగారుపడ్డారు.
హాస్టల్ నిర్వహణ అధ్వానంగా ఉందని వాపోయారు. విద్యార్థులకు సంబంధించిన స్కాలర్ షిప్, పుస్తకాలు వంటివి ఏవీ రాలేదనన్నారు. దీనికితోడు భోజనం కూడా అధ్వానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళ దోమలతో నిద్రకూడా పట్టడం లేదని, కనీసం దోమ తెరలు కూడా లేవని ఆరోపించారు. హాస్టల్లో నెలకొన్న పరిస్థితిపై ప్రశ్నిస్తే చివరకు తమనే బెదిరిస్తున్నారని వాపోయారు. గతంలో ఇలాగే కొందరు విద్యార్థులు ప్రశ్నించడంతో వారిని నాలుగు గంటల పాటు ఎండలో నిలబెట్టారని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలంటూ నిరసన తెలియజేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారించి కారకులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బాలికలు శాంతించారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Updated Date - 2023-09-19T17:50:42+05:30 IST