Crime News: టీ తాగేందుకు హోటల్‌కు వెళ్లిన పోలీసులు.. సడన్‌గా వచ్చిన ఆటోను చూసి డౌట్.. ఫోన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని మరోసారి చూసి..
ABN, First Publish Date - 2023-06-07T18:09:39+05:30
ఎంత పెద్ద నేరస్థుడు అయినా ఏదో చోట చిన్న తప్పు చేస్తాడు. అదే తప్పు చివరకు పోలీసులకు దొరిపోయేలా చేస్తుంది. అందులోనూ ప్రస్తుతం సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి.. పోలీసులు చాలా కేసులను సులభంగా పరిష్కరించగలుగుతున్నారు. తాజాగా..
ఎంత పెద్ద నేరస్థుడు అయినా ఏదో చోట చిన్న తప్పు చేస్తాడు. అదే తప్పు చివరకు పోలీసులకు దొరిపోయేలా చేస్తుంది. అందులోనూ ప్రస్తుతం సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి.. పోలీసులు చాలా కేసులను సులభంగా పరిష్కరించగలుగుతున్నారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. పోలీసులు టీ తాగేందుకు ఓ హోటల్‌కి వెళ్లారు. అదే సమయంలో సడన్‌గా వచ్చిన ఆటోను చూసి వారికి డౌట్ వచ్చింది. ఫోన్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని మరోసారి చూడగా.. చివరకు విషయం బయటపడింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లక్నోలోని ఠాకూర్‌గంజ్ పరిధి బాలక్‌దాస్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన కలాం, జహీర్, గుల్ఫాం అనే ముగ్గురు యువకులు.. జల్సాలకు అలవాటు పడి దోపిడీలు, దొంగతనాలు (Robberies and thefts) చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో వీరి కన్ను ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న హైదర్ అనే వ్యక్తి ఇంటిపై పడింది. ఎలాగైనా వారి ఇంట్లో దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం కలాం అనే యువకుడు.. హైదర్ ఇంట్లో పని చేస్తున్న తన బంధువైన యువతితో (young woman) మాట్లాడాడు. ఆమె నుంచి మొత్తం సమాచారం కనుక్కుని దోపిడీకి పక్కా స్కెచ్ వేశారు. ఆటో డ్రైవర్‌కు రూ.1000 ఇచ్చి అంతా కలిసి సోమవారం రాత్రి హైదర్ ఇంటి వద్దకు వెళ్లారు. ఆటోను దూరంగా ఆపి.. కలాం, జహీర్, గుల్ఫాం ఇంట్లోకి చొరబడ్డారు.
హైదర్ దంపతులను బంధించి నగలు, నగదును (Theft of jewelry and cash) ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజీలో (CCTV footage) ఆటోలో వెళ్తున్నట్లు గుర్తించారు. అయితే ఎంత విచారించినా ఆధారం దొరకలేదు. ఈ క్రమంలో మంగళవారం టీ దుకాణం వద్ద టీ తాగుతూ ఉన్నారు. అదే సమయంలో అక్కడికి ఓ ఆటో వచ్చి ఆగింది. ఆటోను చూడగానే అనుమానం వచ్చి.. తమ ఫోన్‌లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని సరి చూసుకున్నారు. దుండగులు ప్రయాణించిన ఆటో అదే కావడంతో వెంటనే పట్టుకునే ప్రయత్నం చేశారు. పారిపోతున్న ఆటో డ్రైవర్‌తో పాటూ జహీర్, గల్ఫామ్, సర్వేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న కలాం కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.
Updated Date - 2023-06-07T18:09:39+05:30 IST