ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crime News: ఆత్మహత్య అని తేల్చేసిన పోలీసులు.. సడన్‌గా 2 నెలల తర్వాత మళ్లీ విచారణ స్టార్ట్.. అసలు ఈ యువతి కథేంటంటే..!

ABN, First Publish Date - 2023-06-29T21:50:00+05:30

కొన్ని కేసులు పోలీసులకు సవాల్‪‌గా మారుతుంటాయి. మొదట ఆత్మహత్యగా అనుకున్న కేసుల విషయంలో చివరకు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకుంటుంటాయి. దీంతో మళ్లీ అదే కేసుపై ఏళ్లకు ఏళ్లు విచారణ చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్ని కేసులు పోలీసులకు సవాల్‪‌గా మారుతుంటాయి. మొదట ఆత్మహత్యగా అనుకున్న కేసుల విషయంలో చివరకు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకుంటుంటాయి. దీంతో మళ్లీ అదే కేసుపై ఏళ్లకు ఏళ్లు విచారణ చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా, రాజస్థాన్‌లో ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ యువతి మృతిపై పోలీసులు ఆత్మహత్యగా తేల్చేశారు. అయితే రెండు నెలల తర్వాత సడన్‌గా మళ్లీ విచారణ స్టార్ట్ చేశారు. ఇంతకీ ఈ యువతి కథేంటంటే..

బీహార్‌కు (Bihar) చెందిన ప్రమీల (26) అనే యువతికి కొన్నేళ్ల కిందట అస్సాంకి చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆనందంగా సాగుతున్న వీరి కుటుంబంలో సడన్‌గా విషాద ఘటన చోటు చేసుకుంది. ఏప్రిల్‌లో ప్రమీల ఉన్నట్టుండి రాజస్థాన్‌ (Rajasthan) జైపూర్‪‌లోని చిత్రకూట్ పరిధిలో ఉరి వేసుకుని ఆత్మహత్య (suicide) చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆమెది ఆత్మహత్య కేసుగానే నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం కేసును కూడా క్లోజ్ చేశారు. అయితే ఈ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రమీల సోదరుడు పోలీసులను ఆశ్రయించడంతో ప్రమీల మృతిపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Viral Video: స్నేహితుడే కదా అని స్కూటీ ఆపితే.. మాట్లాడాల్సిందే అంటూ యువతి వద్దకు వెళ్లి.. చివరకు అతడు చేసిన నిర్వాకం..

ప్రమీల సోదరుడి ఫిర్యాదు మేరకు.. ఏడాది క్రితం బీహార్‌కు చెందిన పరమేశ్వర్ అనే వ్యక్తి ప్రమీలను (Kidnapping) కిడ్నాప్ చేశాడు. కొంత కాలం అతను ఢిల్లీలోనే ఉండేవాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రమీల జైపూర్‌లో ఉన్నట్లు తెలియగానే ఆమె నుంచి సోదరుడికి ఫోన్ వచ్చింది. త్వరలో ఇంటికి వస్తానని, ఖర్చుల కోసం డబ్బులు కావాలని అడగడంతో సోదరుడు ఆమెకు రూ.5,000 పంపించాడు. అయితే డబ్బు పంపిన మరుసటి రోజే ప్రమీల అనుమానాస్పద స్థితిలో (woman Suspicious death) మృతి చెందింది. తమ కూతురిని పరమేశ్వరే చంపాడని ప్రమీల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పాత ఫైల్‌ను మళ్లీ తెరచి విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Dog vs Leopard: అర్ధరాత్రి సైలెంట్‌గా ఇంట్లోకి చిరుతపులి ఎంట్రీ.. పెంపుడు కుక్క చూసి అరుస్తోంటే.. అదేం చేసిందో చూస్తే..!

Updated Date - 2023-06-29T21:50:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising