ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Crime News: ప్రేయసి పెడుతున్న టార్చర్ భరించలేక కేసు పెట్టిన 48 ఏళ్ల వ్యక్తి.. ప్రేయసి వయసెంతో చెప్పగానే అవాక్కైన పోలీసులు.. చివరకు..!

ABN, First Publish Date - 2023-05-18T21:41:54+05:30

ప్రేమ ముసుగులో కొందరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం చూస్తూనే ఉంటాం. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతులను మోసం చేసేవారు కొందరుంటే.. ఆస్తిపాస్తులు చూసి ప్రేమించేవారు మరికొందరు ఉంటారు. అలాగే కొందరు యువతులు కూడా ఇదే ప్రేమ పేరుతో..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమ ముసుగులో కొందరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం చూస్తూనే ఉంటాం. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతులను మోసం చేసేవారు కొందరుంటే.. ఆస్తిపాస్తులు చూసి ప్రేమించేవారు మరికొందరు ఉంటారు. అలాగే కొందరు యువతులు కూడా ఇదే ప్రేమ పేరుతో నేరాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి నేరాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఈ తరహా ఘటనకు సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 40 ఏళ్ల ఓ వ్యక్తి తన ప్రేయసి పెడుతున్న టార్చర్ భరించలేక చివరకు పోలీసులను ఆశ్రయించాడు. అయితే చివరకు పోలీసులు అతడి సమస్య గురించి తెలుసుకుని అవాక్కయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

హర్యానా (Haryana) ఫరీదాబాద్‌‌లోని ఎత్మాద్‌పూర్‌ పరిధికి చెందిన 48 ఏళ్ల వ్యక్తి అగ్నిమాపక సిబ్బందిగా (Fire department Staff) పని చేస్తుంటాడు. ఆగ్రాకు చెందిన 20 ఏళ్ల పూనమ్ అనే యువతి (young woman) స్థానికంగా ఉంటూ ఇళ్లల్లో పని చేస్తూ ఉంటుంది. ఇలా ఉండగా, రెండున్నరేళ్ల క్రితం సదరు యువతి.. అగ్నిమాపక సిబ్బంది ఇంట్లో పని చేసేందుకు వెళ్లింది. అతడికి ఆస్తి బాగా ఉండడం చూసి యువతికి ఆశ పుట్టింది. ఎలాగైనా ఆ వ్యక్తికి దగ్గరవ్వాలని చూసింది. రోజూ చనువుగా మాట్లాడుతుండడంతో అతను కూడా ఈమెను ప్రేమించడం మొదలెట్టాడు. ఇలా వీరి మధ్య (extramarital affair) వివాహేతర సంబంధం ఏర్పడింది.

Viral Video: బాబోయ్! పడుకున్న మనిషిపై నిప్పు వెలిగించి మరీ మసాజ్.. చివరికి ఏమైందో చూడండి..

ఎవరూ లేని సమయలో యువతిని ఇంటికి పిలిపించుకుని సరసాలు ఆడుతూ ఉండేవాడు. అయితే ఇక్కడే యువతి తన కుట్రను (Young woman conspiracy) బయటపెట్టంది. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో అతడికి తెలీకుండా ఫొటోలు, వీడియోలు తీసుకుంది. కొన్నాళ్ల తర్వాత అసభ్యకరంగా ఉన్న ఫొటోలు, వీడియోలను (Indecent photos and videos) అతడికి చూపించింది. అడిగిన మొత్తం ఇవ్వకపోతే వాటిని బయటపెడతానని బెదిరించింది. దీంతో భయడిపోయిన సదరు వ్యక్తి.. ఆమె చెప్పినట్లే చేసేవాడు. ఇలా అతడి వద్ద నుంచి విడతల వారీగా సుమారు రూ.2లక్షలను తీసుకుంది. దీంతో పాటూ తన పేరు మీద స్థలాలను రిజిస్టర్ చేయాలని కూడా ఒత్తిడి చేసింది.

Shocking Video: ఓరి దేవుడో.. ఇదేం వింత.. ఈ కార్లు, బైకులన్నీ ఏమైపోతున్నాయో.. ఎలా మాయమైపోతున్నాయో చెప్పగలరా..?

అంతటితో ఆగకుండా కోటి రూపాయలు ఇవ్వాలని బెదిరించింది. అయితే అంత ఇవ్వలేనని చెప్పడంతో వాయిదాల పద్ధతిలో రూ.50వేలు ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. అయితే రోజు రోజుకూ ఆమె టార్చర్ భరించలేక బాధితుడు చివరకు పోలీసులను ఆశ్రయించాడు. అతడి సమస్య విన్న పోలీసులు అవాక్కయ్యారు. కేసు నమోదు చేసుకుని, బాధితుడికి రూ.50వేలు ఇచ్చి పంపించారు. నగదును తీసుకోవడానికి వచ్చిన యువతిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఇలా చేసినట్లు అంగీకరించింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Marriage: భర్తకు గుడ్‌బై.. 60 ఏళ్ల వృద్ధుడిని పెళ్లాడిన 28 ఏళ్ల యువతి.. ఈ వయసులో ఇదేం పనని కుటుంబమంతా వ్యతిరేకించినా..!

Updated Date - 2023-05-18T21:41:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising