Bank Holidays September 2023: సెప్టెంబర్‌లో బ్యాంకులకు ఏకంగా 16 రోజుల సెలవులు.. ఈ నెలలో ఏఏ పండుగలున్నాయంటే..!
ABN , First Publish Date - 2023-08-29T12:57:06+05:30 IST
సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు ఏకంగా 16రోజుల సెలవులున్నాయి(16days holidays in september month for banks). అంటే బ్యాంకు పనిదినాలు కేవలం 14రోజులే. సెలవు రోజులేవో తెలుసుకుంటే మిగిలిన 14రోజులలో ముఖ్యమైన పనులను చక్కబెట్టుకోవడం సులువు.
గంటలకొద్ది బ్యాంకులలో నిలబడాల్సినవారు ఆన్ లైన్ లో ఆర్థిక లావాదేవిల పుణ్యమా అని చిటికెలో పనులు చక్కబెట్టుకుంటున్నారు. అయితే బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాల లబ్ది, చెక్ లు డిపాజిట్ చేయడం వంటి వివిధ సేవలకు నేరుగా బ్యాంకును సందర్శించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు సెలవుల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు ఏకంగా 16రోజుల సెలవులున్నాయి(16days holidays in september month for banks). అంటే బ్యాంకు పనిదినాలు కేవలం 14రోజులే. సెలవు రోజులేవో తెలుసుకుంటే మిగిలిన 14రోజులలో ముఖ్యమైన పనులను చక్కబెట్టుకోవడం సులువు అవుతుంది. సెప్టెంబర్ నెలలో ఏయే రోజు ఏ పండుగలున్నాయో తెలుసుకుంటే..
సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఉండే జాతీయ, ప్రాంతీయ సెలవులు, వాటి తేదీలు ఇవే..
3 సెప్టెంబర్ 2023: ఆదివారం(sunday)
6 సెప్టెంబర్ 2023: శ్రీ కృష్ణ జన్మాష్టమి. (Sri Krishna Janmashtami)
7 సెప్టెంబర్ 2023: శీకృష్ణ జయంతి(Sri Krishna Jayanthi). దీన్ని గుజరాత్, మధ్యప్రదేశ్, చండీగఢ్, సిక్కిం, రాజస్థాన్, జమ్ము, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్ రాష్ట్రాలలో సెలవు దినంగా పరిగణిస్తారు.
సెప్టెంబర్ 9, 2023: రెండవ శనివారం.(second saturday)
సెప్టెంబర్ 10, 2023: ఆదివారం.(sunday)
సెప్టెంబర్ 17 2023: ఆదివారం.(sunday)
సెప్టెంబర్ 18, 2023: వరసిద్ధి వినాయక వ్రతం, వినాయక చవితి.(Vinayaka Chavithi)
Viral: ఆమె అమ్మాయేనని తోడబుట్టిన వాళ్లకూ తెలియదు.. 38 ఏళ్ల తర్వాత అసలు నిజాన్ని బయటపెట్టడంతో..!
సెప్టెంబర్ 19 2023: గణేష్ చతుర్థి(Ganesh Chaturthi). గుజరాత్, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, గోవా ప్రాంతాలలో 19వ తేదీ సెలవు దినంగా పరిగణిస్తున్నారు.
సెప్టెంబర్ 20, 2023: గణేష్ చతుర్థి 2వ రోజు నుఖాయ్ ఒడిశాలో దీన్ని జరుపుకుంటారు.
సెప్టెంబర్ 22, 2023: శ్రీ నారాయణ గురు సమాధి చెందిన రోజు కేరళలో ఇది ప్రాంతీయ సెలవు.
సెప్టెంబర్ 23, 2023: నాల్గవ శనివారం సెలవు(4th saturday). ఇదే రోజు మహారాజా హరి సింగ్ పుట్టినరోజు. జమ్ము& శ్రీనగర్ లో ఇది ప్రాంతీయ సెలవురోజు.
సెప్టెంబర్ 24, 2023: ఆదివారం.(sunday)
సెప్టెంబర్ 25, 2023: ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ.(Eid-e-milad-ul-nabi)
సెప్టెంబర్ 27, 2023: మిలాద్-ఎ-షెరీఫ్ ఇది మహమ్మద్ ప్రవక్త ముహమ్మద్ పుట్టినరోజు.
సెప్టెంబర్ 28, 2023: ఈద్ అల్-అధా లేదా మిలాదున్నబి. ఈ రోజు జాతీయ సెలవు దినం. అన్ని బ్యాంకులు సెలవు దినంగా పాటిస్తాయి.
సెప్టెంబర్ 30, 2023: అదివారం.