Banks: ఎస్బీఐ సహా 3 బ్యాంకులకు భారీ షాకిచ్చిన ఆర్బీఐ.. ఏకంగా రూ.3 కోట్ల జరిమానా.. అసలేం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2023-09-26T16:05:59+05:30 IST

ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులు వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. వీటిలో ఎస్బీఐ బ్యాంకుతో సహా మూడు బ్యాంకులకు ఆర్బీఐ పెద్ద షాక్ ఇచ్చింది. ఏకంగా 3కోట్లకు పైగా జరిమానా విధించింది.

Banks: ఎస్బీఐ సహా 3 బ్యాంకులకు భారీ షాకిచ్చిన ఆర్బీఐ.. ఏకంగా రూ.3 కోట్ల జరిమానా.. అసలేం జరిగిందంటే..!

బ్యాంకులు కస్టమర్లకు రుణాలు ఇస్తాయి. క్రెడిట్ కార్డులు సాంక్షన్ చేస్తాయి, ఎన్నో రకాల ఆర్థిక సేవలు అందిస్తాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులుగా ఆర్బీఐ తో అనుసంధానంగా ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వంటి ఇతర బ్యాంకులు పనిచేస్తాయి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులు వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. వీటిలో ఎస్బీఐ బ్యాంకుతో సహా మూడు బ్యాంకులకు ఆర్బీఐ పెద్ద షాక్ ఇచ్చింది. ఏకంగా 3కోట్ల జరిమానాను ముక్కు పిండి మరీ వసూలు చేసింది. అసలు ఈ బ్యాంకులు చేసిన తప్పేంటి? జరిమానా ఎందుకు కట్టాల్సి వచ్చింది? పూర్తీగా తెలుసుకుంటే..

సాధారణంగా క్రెడిట్ కార్డు అప్పు, లోను చెల్లింపు, బ్యాంకు ఖాతాలో కనీస నిల్వ, తదితర రూల్స్ పాటించకపోతే బ్యాంకులు కస్టమర్లకు జరిమానా విధిస్తుంటాయి. దీని కారణంగా కస్టమర్ల అకౌంట్ లో డబ్బు జమ అయిన వెంటనే బ్యాంకులు ఆటోమెటిక్ గా కట్ చేసుకుంటాయి. అయితే ఈ బ్యాంకులకు కూడా ఆర్బీఐ(RBI) కొన్నిఆదేశాలు జారీ చేస్తుంది. ఈ ఆదేశాలు పాటించని పక్షంలో ఈ బ్యాంకులు కూడా జరిమానా చెల్లించక చకతప్పదు.

Viral News: తెల్లారేసరికి ఇంట్లో కూతురు మిస్సింగ్.. పక్కింటి మహిళ తన తమ్ముడితో అదే పనిగా ఫోన్‌కాల్స్.. ఆ తండ్రికి డౌట్ వచ్చి..!



లోన్లు, వాటికి సంబంధించిన చట్టబద్దమైన పరిమితులు, ఇంట్రా గ్రూప్ లావాదేవీలు, ఎక్స్పోజర్ల నిర్వాహణపై మార్గదర్శకాలు మొదలైన వాటికి సంబంధించి ఆర్భీఐ జారీ చేసిన ఆదేశాలు పాటించనందుకు స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా(SBI) పై రూ. 1.3కోట్ల జరిమానాను ఆర్భీఐ విధించింది.

లోన్లు, వాటికి సంబంధించి చట్టబద్దమైన పరిమితులు, కేవైసీ, రిజర్వి బ్యాంక్ ఆప్ ఇండియా జారీ చేసిన డిపాజిట్ వడ్డీ రేట్లు మొదలైన విషయాలలో ఆర్భీఐ జారీ చేసిన ఆదేశాలు పాటించని కారణంతో ఇండియన్ బ్యాంక్(Indian Bank) పై రూ . 1.62కోట్ల జరిమానా విధించింది.

డిపాజిట్ ఎడ్యుకేషన్, అవేర్నెస్ ఫండ్ స్కీమ్ లోని కొన్ని నిబంధనలను పాటించనందుకు పంజాబ్ & సింద్(Punjab&sind) బ్యాంక్ పై రూ. 1కోటి జరిమానా విధించింది.

ఎన్‌బిఎఫ్‌సిలలో మోసాలను పర్యవేక్షించడానికి నిర్థేశించిన కొన్ని నిబంధనలను పాటించనందుకు ఫెడ్ బ్యాంక్ పైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ పై 8.80 లక్షల జరిమానా విధించింది.

Health Facts: బానపొట్ట కరిగిపోవాలా..? రోజూ పొద్దునే నిద్రలేవగానే ఈ జ్యూస్‌ను తాగితే.. చెడు కొవ్వు అంతా మటాష్..!


Updated Date - 2023-09-26T16:05:59+05:30 IST