ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: పిజ్జా బదులు ఈ పరాటా ఎంతో మేలన్న ఆనంద్ మహీంద్రా.. ఇందుకు అభిషేక్ బచ్చన్ ఏమన్నారంటే..

ABN, Publish Date - Dec 21 , 2023 | 07:07 PM

ప్రస్తుత యువత పిజ్జా, బర్గర్లకు అలవాటు పడి కొత్త కొత్త రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ చాలా మంది ఫాస్ట్ ఫుడ్‌కే అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు సాంప్రదాయక వంటలు చేస్తూ భోజన ప్రియులను ఆకర్షిస్తుంటారు. మరికొందరు...

ప్రస్తుత యువత పిజ్జా, బర్గర్లకు అలవాటు పడి కొత్త కొత్త రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ చాలా మంది ఫాస్ట్ ఫుడ్‌కే అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు సాంప్రదాయక వంటలు చేస్తూ భోజన ప్రియులను ఆకర్షిస్తుంటారు. మరికొందరు రోజూ చేసే వంటలనే సరికొత్తగా చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటారు. తాజాగా, పరాటా మేకింగ్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ప్రముఖ వ్యాపారావేత్త ఆనంద్ మహీంద్రా మనసును దోచుకుంది. పరాటా ఉన్నప్పుడు.. పిజ్జా ఎవరికి కావాలి.. అని ప్రస్తావిస్తూ వీడియోను షేర్ చేశారు. దీనిపై అభిషేక్ బచ్చన్ ఏమన్నారంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు వినూత్నమైన పరాటా చేసేందుకు సిద్ధమవుతారు. ఇందుకోసం ముందుగా పిండి కలుపుకొని చపాతీ తరహాలో వెడల్పుగా చేస్తారు. తర్వాత దాని మధ్యలో మసాలా ఉంచి మూసేస్తారు. చివరగా దాన్ని అతి పెద్ద పరాటాగా సిద్ధం చేస్తారు. చివరగా పెద్ద పాన్‌పై వేసి రెండు వైపులా బాగా కాల్చుతారు. ఇలా బాగా కాలిన తర్వాత దాన్ని పక్కకు తీసి, ముక్కలు ముక్కలుగా కట్ చేస్తారు. ఫైనల్‌గా అంతే స్థాయిలో ఉన్న ప్లేట్‌పై పరాటా ముక్కలను వేసి, వివిధ రకాల చట్నీలతో కలిపి కస్టమర్లకు వడ్డిస్తారు.

Coconut Oil: కొబ్బరినూనెతో.. మీ ఒంటికీ, వంటింటికీ కలిగే 6 లాభాలేంటో తెలుసా..

పరాటాను పరిశీలించగా.. మధ్యలో ఘుమఘుమలాడే మసాలా చూడగానే నోరూరుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. దీంతో చివరకు ఈ వీడియో ఆనంద్ మహీంద్రా వరకూ వెళ్లింది. ఈ పరాటా బాగా నచ్చడంతో వెంటనే ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘పరాఠా ఉన్నప్పుడు పిజ్జా ఎవరికి కావాలి…?’’ అని ప్రస్తావించగా.. ఆయన అభిప్రాయానాకి ఎంతో మంది స్పందిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ స్పందించారు. ఆనంద్ మహీంద్రా చెప్పిన మాటకు.. అవును అంటూ స్పందించారు. అలాగే చాలా మంది వారి వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో 1 మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Personality Test: మీ చేతి బొటనవేలిని ఇలా పెడుతున్నారా.. అయితే మీరు ఎలాంటి వారో ఈజీగా తెలుసుకోవచ్చు..

Updated Date - Dec 21 , 2023 | 07:11 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising