ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Train: ప్రియుడితో భార్య ఎస్కేప్.. ఇద్దరూ కలిసి రైల్లో వెళ్తున్నారని ఆ భర్తకు తెలిసి మాస్టర్ ప్లాన్.. సినిమా సీన్‌ను తలపించే ట్విస్ట్ ఇచ్చాడుగా..!

ABN, First Publish Date - 2023-05-31T16:59:30+05:30

అదో పెద్ద రైల్వే స్టేషన్.. ప్రయాణికులతో స్టేషన్ అంతా హడావుడిగా ఉంది. ట్రైన్ రాక కోసం ఎదురుచూసేవారు.. అలాగే వచ్చే బంధుమిత్రులను కలుసుకోవడానికి వచ్చిన వారితో స్టేషన్ సందడిగా ఉంది. పైగా హాలీడేస్ టైమ్..

Bomb threat
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదో పెద్ద రైల్వే స్టేషన్.. ప్రయాణికులతో స్టేషన్ అంతా హడావుడిగా ఉంది. ట్రైన్ రాక కోసం ఎదురుచూసేవారు.. అలాగే వచ్చే బంధుమిత్రులను కలుసుకోవడానికి వచ్చిన వారితో స్టేషన్ సందడిగా ఉంది. పైగా హాలీడేస్ టైమ్.. ప్రయాణికుల రాకపోకలతో స్టేషన్‌ అంతా సందడి.. సందడిగా ఉంది. ఇలా ఎవరి బిజీలో వారు ఉన్నారు. ఇంతలోనే పోలీస్ సైరన్లతో ఒక్కసారిగా పోలీసులు రావడంతో ప్రయాణికుల్లో ఒకటే భయాందోళన. ఏం జరిగింది.. ఏం జరిగింది. ఇలా విషయం తెలియక అయోమయంలో ఉండిపోయారు. ఓ వైపు పోలీసులు అణువణువూ తనిఖీ చేస్తూ హడావుడి చేస్తుంటే.. ఇంకో వైపు ఏం జరుగుతుందో ప్రయాణికులు హడలెత్తిపోయారు. చివరికి అంతా తూచ్ అంటూ తేల్చేశారు. అసలేం జరిగింది... పోలీసులు అంత హడావుడి ఎందుకు చేశారో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

భార్య.. ప్రియుడితో రైల్లో పారిపోతుందన్న సంగతి తెలిసిన భర్త.. మాస్టర్ ప్లాన్ వేశాడు. ఎలాగైనా భార్యను వెనక్కి రప్పించాలని ప్రణాళిక రచించాడు. అంతే ఫోన్ తీసి.. బాంబు (Bomb threat) ఉందంటూ రైల్వేస్టేషన్‌కు కాల్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీ చేయగా ఏమీ లేదని తేల్చారు. అనంతరం కాలర్‌ను అరెస్ట్ చేసి విషయం తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. ఈ సంఘటన బీహార్ రాజధాని పాట్నాలో చోటుచేసుకుంది. అతడు మాత్రం కటకటాలపాలయ్యాడు.

పాట్నా రైల్వే స్టేషన్‌లో (patna junction) బాంబు ఉందని.. కొద్ది నిమిషాల్లో స్టేషన్‌ (railway station) మొత్తం పేలిపోతుందని సోమవారం రాత్రి ఒక ఫోన్‌కాల్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన రైల్వే రక్షణ దళం.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత స్టేషన్‌లోని అన్ని వెయిటింగ్‌ రూమ్‌లు, ఫ్లాట్‌ఫామ్‌లు, లగేజ్‌ రూమ్‌లతో పాటు ప్రయాణికుల లగేజ్‌, పార్కింగ్ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. కానీ అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువుని గుర్తించలేదు. దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఫోన్ చేసిన వ్యక్తిని (caller arrested) గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

బాంబు బెదిరింపు ఫోన్‌కాల్‌ చేసిన వ్యక్తిని రాజేష్‌ కుమార్‌ రంజన్‌గా గుర్తించారు. తన భార్య ప్రియుడితో పారిపోవడంతో ఆమెను తిరిగి ఇంటికి రప్పించేందుకు బాంబు ఉందంటూ ఫోన్ చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఇదిలా ఉంటే అతడు చెప్పేది.. నిజమేనా? లేదంటే కుట్ర కోణం దాగి ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Bride: కొద్ది గంటల్లో పెళ్లనగా ఇంట్లోంచి 21 ఏళ్ల వధువు ఎస్కేప్.. ప్రియుడితో కలిసి పారిపోతుండగానే మృతి.. అసలేం జరిగిందంటే..!

Updated Date - 2023-05-31T17:01:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising