ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking News: ఈ కాలం పిల్లలు ఇలా తయారవుతున్నారేంటి..? వద్దన్నా హెయిర్ కటింగ్ చేయించారని బాత్రూంలోకి వెళ్లి మరీ..

ABN, First Publish Date - 2023-04-07T15:27:47+05:30

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఉపయోగం ఉండదు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటారా? ముంబైలో జరిగిన ఓ విషాదకర దుర్ఘటన కన్నీళ్లు తెప్పిస్తోంది.

Shocking News
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రపంచం రాకెట్ యుగంలో దూసుకెళ్తోంది. ఒకప్పుడు పెద్దలకు సాంప్రదాయాలు.. విలువలు ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అవన్నీ ఇప్పటికాలపు పిల్లలపై రుద్దితే అడ్జెస్ట్ కాకపోవచ్చు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. వస్త్రాల్లో గానీ.. వేషధారణలో గానీ రకరకాలైన మార్పులు వచ్చేశాయి. ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ఇంకా పాత కాల ట్రెడిషన్‌ను ఫాలో కావాలంటే నేటి తరానికి నచ్చకపోవచ్చు. పిల్లల యొక్క మానసిక స్థితిని బట్టే ముందుకు పోవాలే తప్ప ఇలాగే చేయాలంటే మాత్రం మనసు నొచ్చుకుంటారు. ఆ తర్వాత జరగరాని ఘోరం జరిగితే ఏమీ చేయలేం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఉపయోగం ఉండదు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటారా? ముంబైలో జరిగిన ఓ విషాదకర దుర్ఘటన కన్నీళ్లు తెప్పిస్తోంది.

ఇప్పటి కాలపు పిల్లలు కానిదానికి.. అయినదానికి కోపగించుకుంటూ ఉంటారు. వాళ్లకు నచ్చనిది ఏదైనా చేస్తే ఎంతకైనా తెగించేస్తుంటారు. కారణం.. అర్థం చేసుకోలేని వయసు, పరిణితి చెందని ఆలోచనలే ఇందుకు తార్కాణం.

పిల్లలు ఎదుగుతున్నప్పుడు వారి మానసిక స్థితి మార్పు చెందుతుంది. అలాంటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వారికి ఆనందమైనా.. బాధ అయినా.. ఉద్రేకమైనా (angry) అన్నీ ఎక్కువగానే ఉంటాయి. దేన్నీ భరించగలిగే స్థితి ఆ క్షణంలో ఉండదు. ఇలాంటి సంఘటనే ముంబై(Mumbai)లోని భయాందర్‌లో చోటుచేసుకుంది.

హెయిర్ ఎక్కువగా కట్ (haircut) చేయించారన్న కోపంతో (shocking decision).. ఎనిమిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల శత్రుఘన్ (boy) ఆవేశంలో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. కటింగ్ నచ్చలేదన్న బాధతో ఏకంగా ప్రాణాలే తీసుకున్నాడు.

హెయిర్ కంటింగ్ కోసం శత్రుఘన్‌ను.. బంధువొకరు షాపు తీసుకెళ్లాడు. అప్పటికే తనకు కటింగ్ వద్దని శత్రుఘన్ మారాం చేశాడు. దీనికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. జుట్టు ఎక్కువగా ఉంది.. చదివింది బుర్రకు ఎక్కదు అంటూ కటింగ్ షాపు‌నకు పంపించారు. పేరెంట్స్ మాట కాదనలేక అయిష్టంతోనే షాపుకెళ్లాడు. కటింగ్ చేసుకున్నంత సేపు ముభావంగానే ఉన్నాడు. లోలోపల కృంగిపోయాడు. పైకి చెప్పుకోలేక బాధను దిగిమింగుకుంటూ అలానే కటింగ్ చేయించుకున్నాడు. బార్బర్ మాత్రం చాలా ఎక్కువగా జుట్టును కత్తిరించడంతో శత్రుఘన్‌కు కోపం నషాళానికెక్కింది. ఏదో కోల్పోయినట్టుగానే ఇంటికి తిరిగొచ్చాడు.

ఇక ఇంట్లోకి వచ్చాక.. దీనికే ఫీలవుతావేంట్రా.. రెండ్రోజుల పోతే అదే వచ్చేస్తుందిలే అంటూ అందరూ లైట్‌ తీసుకున్నారు. కానీ బాలుడు మాత్రం లోలోపల మదన పడుతూ అలాగే కుమిలిపోయాడు. ఇంట్లో వారందరూ నిద్రపోయినా.. తను మాత్రం నిద్రపోకుండా అదే ధ్యాసలోనే ఉండిపోయాడు. ఎంతకీ మనసును నియంత్రించుకోలేపోయాడు. అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో వాష్‌రూమ్‌కి వెళ్లి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ గ్రిల్స్ లేని కిటికీ ఉండడంతో అక్కడి నుంచి కిందికి దూకేశాడు. 16వ అంతస్తు పైనుంచి దూకేయడంతో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు దగ్గరకు వచ్చి చూసి కేకలు వేయడంతో అపార్ట్‌మెంట్‌లో ఉన్న వాళ్లంతా నిద్రలేచి గాబరాగా కిందికి పరుగెత్తుకుని వచ్చి.. గాయపడ్డ బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే శ్వాస ఆగిపోవడంతో సారీ అంటూ డాక్టర్ చావు కబురు (Shocking News) చెప్పడంతో బంధువులు.. అపార్ట్‌మెంట్ వాసులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హెయిర్ కటింగ్ చేయడం వల్ల చనిపోయాడా? లేదంటే ఇంకేదైనా కారణం ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తెలిసీ తెలీని వయసులో తీసుకునే నిర్ణయాలు.. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలిస్తాయని చెప్పడానికి ఇదొక నిదర్శనం.

ఇది కూడా చదవండి: Viral News: ఈ వ్యక్తిని చూసి ఎగతాళి చేసినోళ్లే నోరెళ్లబెట్టారు.. ఓ చిన్న పరికరంతోనే ఏకంగా రూ.1.30 కోట్లు సంపాదించాడు..!

ఇది కూడా చదవండి: Viral News: ఎర్రగా కనిపిస్తున్న దీన్ని చూసి వజ్రమేమో అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. అసలు ఇదేంటో కలలో కూడా ఊహించలేరు..!

Updated Date - 2023-04-07T15:27:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising