Lover's video: ఇదెక్కడి ప్రేమరా బాబోయ్..! ప్రియురాలి నోట్లో పాలు పోసి మరీ.. ఇతడు చేసిన పని చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN, First Publish Date - 2023-10-24T19:16:02+05:30
ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవన్న విషయం తెలిసిందే. ఎక్కడో పుట్టి.. ఇంకెక్కడో పెరిగి.. ప్రేమ అనే రెండక్షరాలతో ఒక్కటవుతుంటారు ప్రేమికులు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ప్రేమలో పడిన తర్వాతే చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరైతే...
ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవన్న విషయం తెలిసిందే. ఎక్కడో పుట్టి.. ఇంకెక్కడో పెరిగి.. ప్రేమ అనే రెండక్షరాలతో ఒక్కటవుతుంటారు ప్రేమికులు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ప్రేమలో పడిన తర్వాతే చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరైతే ప్రపంచాన్ని మర్చిపోయి తమలోకంలో తాము విహరిస్తుంటారు. ఈ క్రమంలో వారు చేసే పనులు కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్నిసార్లు ఆగ్రహాన్ని తెప్పిస్తుంటాయి. బైకులో వెళ్తూ ముద్దులు పెట్టుకునే ప్రేమికులను చూశాం, బస్సులు, రైళ్లలో అసభ్యకరంగా ప్రవర్తించే వారినీ చూశాం. ఇటీవల ఇలాంటి ప్రేమికులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి అందరి ముందూ తన ప్రియురాలి నోట్లో పాలు పోసి మరీ చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఇటీవల ఢిల్లీ మెట్రో (Delhi Metro Rail) రైల్లో అందరి ముందూ ఓ ప్రేమ జంట కూల్‌డ్రింక్ ఒకరి నోటితో మరొకరు సిప్ చేసుకున్న వీడియో వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనను మర్చిపోకముందే ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో మరో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. రాత్రివేళ సందర్శకులు అటూ ఇటూ తిరుగుతున్న సమయంలో ఓ ప్రేమ జంట (lovers) నేలపై కూర్చుని ఉంటుంది. ఈ క్రమంలో ప్రియురాలు తన ప్రియుడి ఒడిలో పడుకోగా.. ప్రియుడు ఓ పాల ప్యాకెట్ బయటికి తీస్తాడు. తర్వాత అందులోని పాలను (milk) ప్రియురాలి నోట్లో పోసేస్తాడు.
Skydiving Video: స్కైడైవింగ్ సమయంలో షాకింగ్ అనుభవం.. తీరా విమానంలోంచి దూకుతుండగా ఊహించని విధంగా..
చివరగా ఆమె నోటిలోని పాలను ఓ స్పూన్‌తో తీసుకుని తానూ తాగేస్తాడు. ఇలా పదే పదే చేస్తూ చివరకు పాలు ఎంతో బాగున్నాయంటూ ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. అందరిముందే వారు ఇలా చేసినా కూడా.. ఎవరూ వీరిని పట్టించుకోకుండా ఎవరిదారిని వారు వెళ్లిపోవడం వీడియోలో చూడొచ్చు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు.. ఎవరు ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదు’’.. అని కొందరు, ‘‘బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి పనులు చేయడం పద్ధతికాదు’’.. అని మరికొందరు, ‘‘ప్రేమికుల పిచ్చికి హద్దూ అదుపూ లేకుండా పోతోంది’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Updated Date - 2023-10-24T19:16:02+05:30 IST