Bride Sister: సొంత అక్క పెళ్లిలో ఓ చెల్లి రచ్చ.. వరుడిని నేనే పెళ్లాడతానంటూ బాంబు పేల్చడంతో అంతా షాక్.. అసలు నిజం తెలిసి..!

ABN , First Publish Date - 2023-05-04T18:28:16+05:30 IST

'అక్కకు అతనితో పెళ్లి జరగడానికి వీల్లేదు.. అతనితో నా పెళ్లి జరగాలి అంతే..'అని అరిచింది. ఆ అమ్మాయి సరదా చేస్తోందేమో అనుకున్నారు అక్కడున్నవారందరూ. కానీ ఆ అమ్మాయి అక్కడున్న వాళ్లు తన మాట వినట్లేదని ఏకంగా..

Bride Sister: సొంత అక్క పెళ్లిలో ఓ చెల్లి రచ్చ.. వరుడిని నేనే పెళ్లాడతానంటూ బాంబు పేల్చడంతో అంతా షాక్.. అసలు నిజం తెలిసి..!

ఆ అమ్మాయికి ఏడాదికిందటే నిశ్ఛితార్థం జరిగింది. తల్లిదండ్రులు ఎంతో ఘనంగా పెళ్ళి ఏర్పాట్లు చేశారు. పెళ్లివేడుక జరగాల్సిన ముందురోజు రాత్రి వరుడు, అతని కుటుంబ సభ్యులు అందరూ అమ్మాయి ఇంటికి చేరుకున్నారు. వరుడిని ఎంతో ఘనంగా లోపలికి తీసుకొస్తున్నారు. అప్పటిదాగా సైలెంట్ గా ఉన్న వధువు చెల్లెలు ఒక్కసారిగా రచ్చచేసింది. 'అక్కకు అతనితో పెళ్లి జరగడానికి వీల్లేదు.. అతనితో నా పెళ్లి జరగాలి అంతే..'అని అరిచింది. ఆ అమ్మాయి సరదా చేస్తోందేమో అనుకున్నారు అక్కడున్నవారందరూ. కానీ ఆ అమ్మాయి అక్కడున్న వాళ్లు తన మాట వినట్లేదని ఏకంగా బిల్డింగ్ పైకెక్కి దూకేస్తానని డ్రామా క్రియేట్ చేసింది. అక్కకు కాబోయే భర్తను పెళ్లిచేసుకుంటానని ఓ అమ్మాయి చేసిన రచ్చ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

బీహార్(Bihar) రాష్ట్రం ఛప్రా నగరంలో బింటోలిలో జగన్మోహన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతని కుమారుడు రాజేష్ కు, ఛప్రా నగరంలోనే నివసిస్తున్న రింకూ అనే అమ్మాయికి పెద్దల నిర్ణయంతో ఏడాది కిందట నిశ్చితార్థం జరిగింది. రింకూకు పుతుల్ అనే ఓ చెల్లి(Bride sister) ఉంది. నిశ్చితార్థం జరిగిన తరువాత వరుడి కుటుంబానికి , వధువు కుటుంబానికి మధ్య చనువు పెరిగింది. రాజేష్ తరచుగా రింకూ ఇంటికి వచ్చివెళ్లేవాడు. ఈ క్రమంలోనే రింకూ చెల్లి పుతుల్, రాజేష్ తో ఫోన్ లో మాట్లాడేది. అతను కూడా పుతుల్ తో సన్నిహితంగా మాట్లాడేవాడు. అప్పుడప్పుడు పుతుల్ ను హాస్పిటల్స్ కు, బయటకు తీసుకెళ్లేవాడు. అతను బాద్యతగా ఉంటున్నాడని అందరూ అనుకున్నారు. కానీ వారిద్దరి మధ్య దగ్గరితనం పెరిగింది. వారిద్దరూ ఒకరిని మరొకరు ఇష్టపడ్డారు. అయితే ఈ విషయాన్ని బయటకు తెలియకుండా దాచిపెట్టారు.

Viral Video: ఆటో ఆగకుండానే.. యమా స్పీడ్‌గా వెళ్తూనే పంక్చర్ అయిన టైర్‌ను మార్చేసిన డ్రైవర్.. చూస్తే అవాక్కవడం ఖాయం..!


ఈ నెల 2వ తేదీన రాజేష్ పెళ్ళివేడుక(Marriage ceremony) కోసం తన కుటుంబంతో కలసి ఊరేగింపుగా రింకూ ఇంటికి చేరుకున్నాడు. రింకూ తండ్రి అల్లుడిని మేళతాళాల మధ్య రిసీవ్ చేసుకుని ఇంట్లోకి తీసుకెళుతుండగా ఈ పెళ్లి ఆపండంటూ పుతుల్ అరవడం మొదలుపెట్టింది. ఆమె సరదాకు అంటోందని ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఆ తరువాత 'రాజేష్ తో అక్కకు పెళ్లి జరిపించకండి, అతడిని నేనే పెళ్లిచేసుకోవాలి' అని రచ్చ చేయడం మొదలుపెట్టింది. 'పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడకు సరదాకు ఓ హద్దు ఉంటుంది' అని పెద్ద వాళ్ళు ఆమె అల్లరిచేస్తోందేమోనని సర్థిచేప్పాలని చూశారు. తన మాట ఎవరూ వినడం లేదని పుతుల్ ఇక అక్కడినుండి ఇంటి పైకి పరుగుతీసింది. 'రాజేష్ తో నాకు పెళ్లి జరిపించకపోతే నేను పైనుండి దూకి చచ్చిపోతాను' అని బెదిరించింది. ఆమె ఏం చేసుకుంటుందోనని అందరూ భయపడ్డారు. ఆ తరువాత పెద్దవాళ్లు ఆమెకు నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నించారు. కానీ రాజేష్ కు పుతుల్ కు మధ్య సాగిన వ్యవహారం కాస్తా బయటపడటంతో పెద్దవాళ్లు కూడా ఏమీ చేయలేకపోయారు. చివరకు ముందు పెట్టుకున్న ముహూర్తానికే రాజేష్ కు పుతుల్ కు వివాహం జరిపించారు. పెళ్లింట్లో జరిగిన రచ్చ గురించి తెలుసుకున్నపోలీసులు అక్కడి చేరుకున్నారు. ఇరుకుటుంబాలు పోలీసులకు వివరణ ఇచ్చి పంపేశారు. తరువాత పుతుల్ ను రాజేష్ తనతో తన ఇంటికి తీసుకెళ్లాడు.

Viral News: 80 ఏళ్ల క్రితం నాటి అయిదో తరగతి ప్రశ్నాపత్రం.. ఒక్క ప్రశ్నకయినా సమాధానం చెప్పగలిగితే చాలా గ్రేట్ అట..!


Updated Date - 2023-05-04T18:32:18+05:30 IST