Bride: పెళ్ళిరోజు బ్యూటీపార్లర్ కు వెళ్ళి ఎంతసేపైనా తిరిగిరాని వధువు.. కంగారుతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయిస్తే..

ABN , First Publish Date - 2023-05-10T17:11:24+05:30 IST

ప్రేమ వివాహాన్ని పెద్దల సమక్షంలో చేసుకోబోతున్న ఆ అమ్మాయి బ్యూటీ పార్లర్ కు వెళ్లొస్తానని బయటకు వెళ్ళింది కానీ..

Bride: పెళ్ళిరోజు బ్యూటీపార్లర్ కు వెళ్ళి ఎంతసేపైనా తిరిగిరాని వధువు..  కంగారుతో ఆమె తల్లిదండ్రులు  పోలీసులను ఆశ్రయిస్తే..

సాధారణంగానే అమ్మాయిలు అందంగా కనిపించాలని కోరుకుంటారు. ఇక పెళ్లి కూతురు విషయం అయితే సరేసరి. కాబోయే భర్త ముందు చందమామలా కనిపించాలని అనుకుంటుంది. ఆ అమ్మాయి అలాగే అనుకుంది. అందుకే తల్లిదండ్రులతో బ్యూటీపార్లర్ కు వెళుతున్నాని చెప్పి బయటకెళ్లింది. కానీ గంటలు గడిచినా ఆ అమ్మాయి ఇంటికి రాలేదు. దీంతో కంగారు పడిన అమ్మాయి తల్లిదండ్రులు పోలిస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేశారు. పోలీసులు వారి ఫిర్యాదు పట్టించుకోలేదు. దీంతో ఆ తండ్రి కూతురి ఆచూకీ కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం లక్నో(Lucknow)కు చెందిన సంజయ్ కుమార్ పాత మెట్రోపాలిస్ ఘోసియానాలో నివసిస్తున్నాడు. ఇతను చాలా పేదవాడు. బెలూన్లు అమ్మగా వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇతని కూతరు కోమల్ వయసు 22ఏళ్లు. ఒకసారి కోమల్ లక్నోలోనే కుర్సి రోడ్డులో ఉన్న ఎలక్ట్రానిక్ షాపుకెళ్లింది(electronic shop). అక్కడ షాపు నిర్వహిస్తున్న రాహుల్ తో కోమల్ కు పరిచయం అయ్యింది. వారిద్దరూ స్నేహితులుగా మారారు. ఆ తరువాత ఒకరినొకరు ఇష్టపడ్డారు. గత మూడేళ్లనుండి వారు లవ్ రిలేషన్(Love relation) లో ఉన్నారు. ఈ క్రమంలో పెళ్ళిచేసుకుందామని కోమల్, రాహుల్ తో చెప్పింది. రాహుల్ కు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా ఆమె ఒత్తిడి భరించలేక సరే అన్నాడు. దీంతో కోమల్ కుటుంబం చాలా సంతోషించింది. కోమల్ తండ్రి కూడా అంత కంటే గొప్ప సంబంధం తాను తీసుకురాలేనని రాహుల్ తో కోమల్ పెళ్లి జరిపించడానికి ఒప్పుకున్నాడు. పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేశాడు. అయితే పెళ్లిరోజు(wedding day) బ్యూటీపార్లర్(beauty parlour) కు వెళ్లొస్తానని చెప్పి ఇంటి నుండి బయటకెళ్లిన కోమల్ తిరిగి రాలేదు. గంటలు గడిచినా ఆమె తిరిగిరాకపోవడంతో ఆమె తల్లితండ్రులు భయపడ్డారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వారి ఫిర్యాదును సీరియస్ గా తీసుకోలేదు. దీంతో వాళ్లకేం చెయ్యాలో పాలుపోలేదు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా పెదవుల మీద నలుపు పోవట్లేదా? మీకే తెలియకుండా చేస్తున్నఈ తప్పుల వల్లే..


ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో కోమల్ తండ్రి తెలిసిన వారి సహాయంతో సోషల్ మీడియాలో తన కూతురును కాపాడమని పోస్ట్(social media post) పెట్టాడు. ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు కోమల్ కాల్ వివరాలు, చివరి లొకేషన్(call list, last location) ఆధారంగా ఆమెను వెతుక్కుంటూ వెళ్ళారు. కుక్రైల్ అడవుల్లో(Kukrail forest) కోమల్ మృతదేహం దొరికింది. కోమల్ మొబైల్ లో లాస్ట్ కాల్ రాహుల్ ది కావడంతో అతన్ని గట్టిగా విచారించారు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా కోమల్ ఒత్తిడి చేసిందని, అందుకే పెళ్లికి ఒప్పుకున్నానని అతను చెప్పాడు. కానీ అతను పెళ్ళికి ఒప్పుకున్నందుకు అతని కుటుంబ సభ్యులు అతనితో మాట్లాడలేదట. కోమల్ ను పెళ్లి చేసుకుంటే తమతో తెగదెంపులు చేసుకోమని వారు రాహుల్ ను హెచ్చరించారట. దీంతో అతను ప్లాన్ ప్రకారం కోమల్ ను బ్యూటీపార్లర్ కు తీసుకెళతానని చెప్పాడు. ఆ విషయం ఇంట్లో చెప్పద్దని అతను ముందే హెచ్చరించాడు. వారిద్దరూ ప్రయాణమయ్యాక లాంగ్ ట్రిప్(long trip) పేరుతో కోమల్ ను కుక్రైల్ అడవులకు తీసుకెళ్లి అక్కడ కోమల్ చున్నీతోనే గొంతు బిగించి చంపేశాడు. ఆ తరువాత ఏమీ తెలియనట్టు అక్కడినుండి వచ్చేశాడు. పోలీసులు రాహుల్ ను అరెస్ట్ చేసి కేసు విచారిస్తున్నారు. కాగా తన కూతురుతో పెళ్లి ఇష్టంలేదని చెబితే తామే పెళ్లి ఆపేసేవాళ్ళం, అన్యాయంగా కూతురిని చంపేశారని కోమల్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Viral Video: వామ్మో ఇదేం ఫిట్నెస్ ట్రైనింగ్.. వీళ్ల చేతుల్లో ఉన్నవేంటో తెలిస్తే అవాక్కవ్వకుండా ఉండలేరు..


Updated Date - 2023-05-10T19:02:57+05:30 IST