BSNL Plans: బీఎస్ఎన్ఎల్ యూజర్లు ఈ 3 ప్లాన్లలో దేనితో రీఛార్జ్ చేసుకున్నా చాలు.. ఏడాదంతా..
ABN, First Publish Date - 2023-02-05T22:14:02+05:30
అవాంతరాలు ఎదురవ్వకుండా, ప్రతినెలా రీఛార్జ్ చేసుకునే అవసరం లేకుండా ప్రభుత్వరంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ (BSNL) మూడు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఆ ప్లాన్స్ ఏవో మీరూ ఒక లుక్కేయండి..
న్యూఢిల్లీ: ప్రీపెయిడ్ యూజర్లలో చాలామంది పని బిజీలో పడిపోయి రీఛార్జ్ చేసుకోవడం మరచిపోతుంటారు. సడెన్‌గా రీఛార్జ్ అయినప్పుడు.. సొంతంగా రీఛార్జ్ చేసుకోవడానికి డేటా బ్యాలెన్స్ లేక, సమీపంలో రీఛార్జ్ స్టోర్లు కూడా లేకపోతే కాస్త అసౌకర్యానికి గురవ్వక తప్పదు. అయితే తమ యూజర్లకు ఇలాంటి అవాంతరాలు ఎదురవ్వకుండా, ప్రతినెలా రీఛార్జ్ చేసుకునే అవసరం లేకుండా ప్రభుత్వరంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ (BSNL) మూడు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఆ ప్లాన్స్ ఏవో మీరూ ఒక లుక్కేయండి..
బీఎస్‌ఎన్ఎల్ రూ.1499 ప్లాన్: ఈ ప్లాన్‌లో మొత్తం మీద యూజర్లకు 24 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ లోకల్-ఎస్‌టీడీ కాలింగ్‌తోపాటు రోజుకు 100 మెసేజులు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్‌లో 336 రోజుల వ్యాలిడిటీ మాత్రమే లభిస్తుంది.
బీఎస్ఎన్ఎల్ రూ.1570 ప్లాన్: ఈ ప్లాన్‌లో యూజర్లు రోజుకు 2 జీబీల డేటా పొందొచ్చు. కోటా అయిపోయిన తర్వాత డేటా స్పీడ్ తగ్గుతుంది. అన్‌లిమిటెడ్ లోకల్ - ఎస్‌టీడీ కాలింగ్‌తోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
బీఎస్ఎన్ఎల్ రూ.1999 ప్లాన్: ఈ ప్లాన్‌లో యూజర్లు రోజుకు 3జీబీల డేటా పొందొచ్చు. ఇందులో కూడా కోటా పూర్తయిన తర్వాత డేటా స్పీడ్ తగ్గుతుంది. అన్‌లిమిటెడ్ లోకల్ - ఎస్‌టీడీ కాలింగ్‌తోపాటు రోజు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. యూజర్లు గమనించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఢిల్లీ, ముంబై మినహా బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా సర్వీసులు అందిస్తోంది. కాగా ప్రస్తుతానికి 3జీ సేవలు అందిస్తుండగా.. త్వరలోనే 5జీతోపాటు 4జీ సర్వీసులు అందించబోతోంది.
Updated Date - 2023-02-05T22:14:03+05:30 IST