ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఆనంద్ మహీంద్రాను కట్టిపడేసిన ట్రాక్టర్ల వీడియో.. యువకులంతా గుంపులుగా థియేటర్లకు రావడం చూసి..

ABN, First Publish Date - 2023-08-15T21:50:57+05:30

సాధారణంగా సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ.. వాటిలో కొన్ని మాత్రం ఊహకందని స్థాయిలో ఉంటాయి. చివరికి అవి ప్రముఖుల్ని సైతం అవి కట్టిపడేస్తుంటాయి. వినూత్న ప్రయోగాలు చేసే వారిని నిత్యం ప్రోత్సహిస్తూ వస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా..

సాధారణంగా సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ.. వాటిలో కొన్ని మాత్రం ఊహకందని స్థాయిలో ఉంటాయి. చివరికి అవి ప్రముఖుల్ని సైతం అవి కట్టిపడేస్తుంటాయి. వినూత్న ప్రయోగాలు చేసే వారిని నిత్యం ప్రోత్సహిస్తూ వస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. తాజాగా ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశాడు. యువకులంతా గుంపులు గుంపులుగా థియేటర్లకు రావడం చూసి.. ఆయన ఏమన్నారంటే...

రాజస్థాన్‌లో (Rajasthan) ఈ ఘటన చోటు చేసుకుంది. 2001లో విడుదలైన గదర్ అనే హిందీ చిత్రం అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ తదితరులు నటించిన ఈ చిత్రం పార్ట్-2 (Gadar 2) .. ఈ నెల 11న రిలీజ్ చేశారు. 20 తర్వాత వచ్చినా కూడా అభిమానుల్లో ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఎక్కడ చూసినా థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోతున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని (Rajasthan) బిల్వారాలో కొన్ని థియేటర్ల వద్ద యువకులు వినూత్నంగా ట్రాక్టర్లపై వచ్చారు. చాలా మంది యువకులంతా గుంపులు గుంపులుగా ట్రాక్టర్లపై (Young people came to the theater in tractors) బ్యానర్లు పట్టుకుని బయలుదేరారు. అందులో చాలా ట్రాక్టర్లు.. మహీంద్రా కంపెనీకి చెందిన పాతవే ఉన్నాయి.

Viral Video: రైల్వే స్టేషన్‌లో దంపతుల మధ్య.. ఇలాంటి ఫైట్ ఇంతకు ముందెన్నడూ చూసుండరు..

యువకులంతా ట్రాక్టర్లపై ఈలలు, గోలలు చేస్తూ ఉత్సాహంగా థియేటర్లలోకి ఎంటర్ అయ్యారు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్ (Viral video) అవడంతో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Businessman Anand Mahindra) వరకూ చేరింది. దీనిపై ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ.. వీడియోను తన ట్విట్టర్ (Twitter) ఖాతా ద్వారా రీట్వీట్ చేశారు. ‘‘గదర్-2 చిత్రాన్ని చూడటానికి అభిమానులు ట్రాక్టర్లలో పోటెత్తారు. ఇది చాలా ఆనందాన్ని కలిగిస్తోంది’’.. అని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ సీన్ చూస్తుంటే.. పాత రోజులు గుర్తుకొస్తున్నాయ్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇది కంట పడితే కాస్త జాగ్రత్త.. అందంగా ఉంది కదా అని ముట్టుకున్నారనుకో.. ఇంక అంతే సంగతులు..

Updated Date - 2023-08-15T21:52:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising