కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: బైకులో వెళ్తున్న వ్యక్తిని టార్గెట్ చేసిన కారు డ్రైవర్.. వెనుక నుంచి వెళ్లి చివరకు ఏం చేశాడో చూడండి..

ABN, First Publish Date - 2023-06-24T21:53:38+05:30

ప్రయాణ సమయాల్లో కొందరు వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా పక్కన వెళ్లే వారు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంటుంది. చాలా మంది కావాలనే అత్యంత వేగంగా వాహనాలు నడుపుతుంటే.. మరికొందరు తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారికి కూడా హాని కలిగిస్తుంటారు. ఇలాంటి...

Viral Video: బైకులో వెళ్తున్న వ్యక్తిని టార్గెట్ చేసిన కారు డ్రైవర్.. వెనుక నుంచి వెళ్లి చివరకు ఏం చేశాడో చూడండి..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రయాణ సమయాల్లో కొందరు వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా పక్కన వెళ్లే వారు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంటుంది. చాలా మంది కావాలనే అత్యంత వేగంగా వాహనాలు నడుపుతుంటే.. మరికొందరు తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారికి కూడా హాని కలిగిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. బైకులో వెళ్తున్న వ్యక్తిని టార్గెట్ చేసిన కారు డ్రైవర్.. అంతా చూస్తుండగా దారుణానికి పాల్పడ్డాడు. చివరకు ఏమైందంటే..

తమిళనాడులో (Tamil Nadu) ఈ ఘటన చోటు చేసుకుంది. రద్దీగా ఉన్న రోడ్డుపై ఉన్నట్టుండి చోటు చేసుకున్న ఘటనకు వాహనదారులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కారు, బైకు పక్క పక్కనే వెళ్తుంటాయి. వారి మధ్య ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ, బైకులో వెళ్తున్న వ్యక్తి.. కారు డ్రైవర్ వైపు చేయి చూపించి ఏదో అంటాడు. దీంతో ఆగ్రహానికి గురైన కారు డ్రైవర్ వెళ్తూ వెళ్తూనే బైకుమీదకు పోనిస్తాడు. దీంతో కింద పడబోతున్న బైకును సదరు వ్యక్తి ఎలాగోలా కంట్రోల్ చేసుకుని రోడ్డు పక్కగా వెళ్లి నిలిపేస్తాడు. కారు ఢీకొన్న (car hit a bike) సమయంలో బైకుపై ఉన్న వ్యక్తి బ్యాగు రోడ్డు మధ్యలో పడిపోతుంది.

Viral Video: చిరుత నుంచి తప్పించుకుని కారు వద్ద సేదతీరుతున్న జింక.. భయంతో చాలా సేపు ఎదురు చూసిన పులి.. చివరకు ఏమైందంటే..

బైకు ఆపిన అతను నేరుగా నడుచుకుంటూ వెళ్లి బ్యాగు తీసుకుని, కారు డ్రైవర్‌ను నిలదీస్తాడు. దీంతో కారు డ్రైవర్ మరింత ఆగ్రహానికి గురవడంతో ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ యువకుడు అక్కడ నుంచి వెళ్లిపోతాడు. బైకును కారు ఢీకొన్న సమయంలో వెనుక నుంచి వాహనాలు వేగంగా వచ్చి ఉండుంటే పెద్ద ప్రమాదమే జరిగేది. ఆ సమయంలో వెనుక వస్తున్న వాహనాలు దూరంగా ఉండడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో (Viral video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఎక్కువ మంది కారు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Bride Video: కాసేపట్లో పెళ్లనగా పెళ్లికూతురి ఎంట్రీ.. నేరుగా పెళ్లిపీటలపైకి ఎక్కకుండా వధువు చేసిన పనికి నివ్వెరపోయిన బంధువులు..!

Updated Date - 2023-06-24T21:53:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising