ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఫుట్‌పాత్‌పై వెళ్తున్నా ప్రాణాలు దక్కలేదు.. పాపం ఈ అమ్మాయిల విషయంలో ఏం జరిగిందో చూడండి..

ABN, First Publish Date - 2023-10-19T21:32:56+05:30

కొందరు నిర్లక్ష్యంగా వ్యవహిరించడం వల్ల ప్రమాదాలకు గురవుతుంటారు. ఇంకొందరు తాము నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా ఎదుటి వారినీ ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా...

కొందరు నిర్లక్ష్యంగా వ్యవహిరించడం వల్ల ప్రమాదాలకు గురవుతుంటారు. ఇంకొందరు తాము నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా ఎదుటి వారినీ ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, కర్నాటకలో ఈ తరహా ఘటనే చోటు చేసుకుంది. నలుగురు యువతులు ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తుండగా.. విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘అయ్యో పాపం! ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కర్నాటకలోని (Karnataka) మంగళూరులో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక లేడీహిల్ సమీపంలో రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై సాయంత్రం 4గంటల సమయంలో నలుగురు యువతులు సరదాగా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్లాల్సిన కారు కాస్త.. అత్యంత వేగంగా ఫుట్‌పాత్‌ పైకి దూసుకొచ్చి (car that hit the young women) యువతులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారంతా ఎగిరి దూరంగా పడ్డారు. యువతులను ఢీకొన్న కారు ఆగకుండా వేగంగా వెళ్లిపోయింది. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పరుగెత్తుకుంటూ వెళ్లి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. వారిలో ఓ యువతి పైకి లేచి తీవ్ర గాయాలపాలైన తన స్నేహితులను చూసి బోరున ఏడ్చింది.

Viral Video: వధువును నిండా ముంచిన వింత సాంప్రదాయం.. పెళ్లిపీటలపై ఉన్నట్టుండి ఓ వ్యక్తి చేసిన పని చూడండి..

ఈ ప్రమాదంలో రూపశ్రీ(23) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రగాయాలపాలైన మిగతా యువతులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారు ఆపకుండా వేగంగా వెళ్లిన వ్యక్తి సమీపంలోని ఓ షెడ్‌లో వాహనాన్ని ఆపి, నేరుగా వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. కారును నడిపిన వ్యక్తి కమలేష్ బల్దేవ్‌గా గుర్తించారు. నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కారు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: బస్సు నడుపుతూనే రోడ్డు పక్కన మహిళను గమనించిన డ్రైవర్.. ఒక్క క్షణం ఆలస్యమైనా పెద్ద ఘోరమే జరిగేది..

Updated Date - 2023-10-19T21:32:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising