ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఇంట్లో గోడకు ఉన్న అందమైన ఫొటోఫ్రేమ్ వెనుక.. గుండెలు అదిరే భయంకర దృశ్యం..!

ABN, First Publish Date - 2023-08-26T12:32:58+05:30

చాలా మందికి తమ ఇంట్లోని గోడలపై అందమైన సీనరీలతో కూడిన ఫొటోఫ్రేమ్స్‌ను పెట్టే అలవాటు ఉంటుంది. ఎందుకంటే అవి ఆ గోడలకు ఓ ప్రత్యేకమైన అందాన్ని ఇవ్వడంతో పాటు ఇంటికి వచ్చిన అతిథులను కూడా ఇట్టే ఆకట్టుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Viral Video: చాలా మందికి తమ ఇంట్లోని గోడలపై అందమైన సీనరీలతో కూడిన ఫొటోఫ్రేమ్స్‌ను పెట్టే అలవాటు ఉంటుంది. ఎందుకంటే అవి ఆ గోడలకు ఓ ప్రత్యేకమైన అందాన్ని ఇవ్వడంతో పాటు ఇంటికి వచ్చిన అతిథులను కూడా ఇట్టే ఆకట్టుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చాలామంది తమకు నచ్చిన ఫొటోఫ్రేమ్లను (Photo Frames) తమ ఇంటి గోడలకు వేలాడదీస్తుంటారు. ఇక కొంచెం సౌండ్ పార్టీలైతే మాత్రం ఖరీదైన పెయింటింగ్స్‌ను గోడలపై తగిలేయడం మనం చూసే ఉంటాం. అలాంటి ప్రత్యేక పెయింటింగ్స్ ఇంటి అందాన్ని మరింత ఇనుమడింప జేస్తాయి కూడా. ఇంతవరకు బాగానే ఉంది. ఒకవేళ అలాంటి అందమైన ఫొటోఫ్రేమ్స్ వెనక భయంకరమైన దృశ్యం ఆవిష్కృతమైతే. వామ్మో.. మదిలో ఆ ఊహ మెదిలితేనే హడలెత్తిపోతున్నారు కదూ.

కానీ, ఆస్ట్రేలియా (Australia) లో ఓ ఇంటి యజమానికి ఇలాంటి భయంకర అనుభవమే ఎదురైంది. ఎంతో ముచ్చపడి ఇంట్లో గోడకు వేలాడదీసిన ఒక ఫొటోఫ్రేమ్ వెనక గుండెలు అదిరే దృశ్యం కనిపించింది. ఆ ఫొటోఫ్రేమ్ వెనకాల ఒక పెద్ద కొండచిలువ (Python) తిష్ట వేసింది. ఇంకేముంది.. దాన్ని చూడగానే మనోడికి గుండెలు ఆగినంత పనైంది. వెంటనే పాములను పట్టేవారికి కబురు అందించాడు. దాంతో వారు వచ్చి కొండచిలువను పట్టుకెళ్లారు. ఆ సమయంలో తీసిన వీడియోను ఇంటి యజమానితో పాటు స్నేక్‌ క్యాచర్స్ నెట్టింట పెట్టారు. అంతే.. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

KBC 15: కేబీసీలో మరోసారి క్రికెట్‌పై ప్రశ్న.. సరైన సమాధానానికి ఈసారి ఏకంగా రూ.25 లక్షలు..!


Updated Date - 2023-08-26T12:35:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising