ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking: ఈ ఫొటోలో కనిపిస్తున్న 50 ఏళ్ల పెద్దాయనకు జీవిత ఖైదు.. అసలు ఆయన చేసిన నేరమేంటో తెలిస్తే..!

ABN, First Publish Date - 2023-10-17T13:48:21+05:30

ఈ ఫొటోలో కనిపిస్తున్న 50 ఏళ్ల పెద్దాయనకు ముంబైలోని సెషన్స్ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. అతని పేరు చింతన్ ఉపాధ్యాయ (Chintan Upadhyay).

Shocking: ఈ ఫొటోలో కనిపిస్తున్న 50 ఏళ్ల పెద్దాయనకు ముంబైలోని సెషన్స్ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. అతని పేరు చింతన్ ఉపాధ్యాయ (Chintan Upadhyay). చిత్రకారుడైన అతనికి న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. అసలు ఆయన చేసిన నేరమేంటో తెలుసా? 2015లో విడిపోయిన భార్య హేమా ఉపాధ్యాయ్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నడం. విచారణలో దోషిగా తేలిన చింతన్ ఉపాధ్యాయ్‌కు ముంబై సెషన్స్ కోర్టు మంగళవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వారి మధ్య వివాహ, ఆస్తి తగాదాల కారణంగానే ఈ కుట్ర జరిగిందని కోర్టు నిర్ధారించింది. అలాగే హేమ, ఆమె న్యాయవాది హరీష్ భంభానీని హత్య చేసిన ఆరోపణలపై విజయ్ రాజ్‌భర్, ప్రదీప్ రాజ్‌భర్, శివకుమార్ రాజ్‌భర్ అనే ముగ్గురు వ్యక్తులకు కూడా కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇక చింతన్, మరో ముగ్గురు నిందితులకు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరగా, నేరం క్రూరమైనప్పటికీ ఇది 'అరుదైన' కేసుగా పరిగణించబడదని న్యాయస్థానం పేర్కొంది.

అసలేం జరిగిందంటే..

2015 డిసెంబర్ 12వ తేదీన హేమ, ఆమె లాయర్ మృతదేహాలు పోలీసులకు లభ్యమయ్యాయి. డిసెంబరు 11 హేమా ఉపాధ్యాయ్, భంభానీలను ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ తర్వాత వారి మృతదేహాలను కార్డ్‌బోర్డ్ పెట్టెల్లో పెట్టి కందివాలిలోని ఒక నాలాలో పడేశారు. ఈ క్రమంలో చింతన్‌ను అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అప్పటికే అతనికి సహకరించిన విజయ్ రాజ్‌భర్, ప్రదీప్ రాజ్‌భర్, శివకుమార్ రాజ్‌భర్ పరారయ్యారు. ఈ ఏడాది అక్టోబరు 5న భారతీయ శిక్షాస్మృతి (IPC) లోని 120B సెక్షన్ 109 ప్రకారం హేమ హత్యకు సహకరించిన, కుట్ర పన్నిన ఆరోపణలపై చింతన్‌ను కోర్టు దోషిగా తేల్చింది. పరారీలో ఉన్న నిందితులు విద్యాధర్ రాజ్‌భర్, చింతన్ మధ్య కుట్ర జరిగిందని పోలీసులు ఆరోపించారు.

Wife-Husband: వంట చేయడం లేదని కూడా విడాకులు.. విడిపోయేందుకు ఈ తరం భార్యాభర్తలు చెబుతున్న వింత కారణాలు ఇవేనట..!

శనివారం స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైభవ్ బగాడే నేతృత్వంలోని ప్రాసిక్యూషన్ నిందితులకు మరణశిక్ష విధించాలని కోరింది. అయితే నిందితుల్లో ఎవరికీ ఎలాంటి నేర చరిత్రలు లేవని, ముగ్గురు నిందితులు చిన్నవయసు వారేనని కూడా పరిగణలోకి తీసుకున్న వారికి జీవిత ఖైదును విధించింది. "వారి ఆర్థిక పరిస్థితి చాలా పేలవంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుత నేరం చేయడానికి వారు అంగీకరించిన ఏకైక కారణం ఇదే. అందువల్ల వారు ఈ నేరానికి పాల్పడ్డారు. ఈ నిందితులు నేరపూరిత మనస్తత్వంతో ఉన్నట్లు కనిపించడం లేదు" అని కోర్టు పేర్కొంది.

Wife: కట్టుకున్న భార్యను అసభ్యంగా వర్ణిస్తూ ఫ్రెండ్స్‌తో ఓ భర్త చాటింగ్.. సడన్‌గా ఓ రోజు ఆ నీచాన్ని భార్య చూడటంతో..!


Updated Date - 2023-10-17T13:48:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising