IVF: ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కు వెళ్లిన ఓ 33 ఏళ్ల మహిళకు షాకింగ్ అనుభవం.. ఆస్పత్రి నుంచి భర్తకు ఫోన్.. అవతలి వాళ్లు చెప్పింది విని..
ABN, First Publish Date - 2023-05-23T16:07:44+05:30
వారికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే సంతానం కావాలన్న వారి కల.. కలగానే మిగిలిపోయింది. పిల్లల కోసం ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినా డబ్బులు ఖర్చయ్యాయి గానీ సంతానం మాత్రం కలగలేదు. అయితే ఈ క్రమంలో మిత్రుల సలహా మేరకు సదరు మహిళ.. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంది. చికిత్స అనంతరం..
వారికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే సంతానం కావాలన్న వారి కల.. కలగానే మిగిలిపోయింది. పిల్లల కోసం ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినా డబ్బులు ఖర్చయ్యాయి గానీ సంతానం మాత్రం కలగలేదు. అయితే ఈ క్రమంలో మిత్రుల సలహా మేరకు సదరు మహిళ.. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంది. చికిత్స అనంతరం పది రోజుల తర్వాత మహిళ భర్తకు వైద్యులు ఫోన్ చేశారు. చివరకు వారు చెప్పింది విని అతను షాక్ అయ్యాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
కర్ణాటకకు (Karnataka) చెందిన 33ఏళ్ల ఓ మహిళ (woman) 2011లో వివాహం చేసుకుని.. ప్రస్తుతం స్విజ్జర్లాండ్‌లోని (Switzerland) విల్ సిటీలో స్థిరపడింది. అయితే ఈమెకు వివాహమైనప్పటి నుంచి సంతానం లేదు. పిల్లల కోసం ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. అయినా ఫలితం మాత్రం లేదు. ఈ క్రమంలో 2018 మార్చిలో బెంగళూరు (Bangalore) వచ్చింది. మిత్రుల సలహా మేరకు స్థానింగా ఉన్న ఓ ఆస్పత్రికి వెళ్లింది. చివరకు IVF టెక్నాలజీ (In vitro fertilization) ద్వారా సంతానం పొందేందుకు చికిత్స చేయించుకుంది.ఇందుకోసం మొత్తం రూ.43,839లు చెల్లించింది. చికిత్స అనంతరం 10రోజుల తర్వాత ఫలితాలను తెలియజేస్తామని వైద్యులు తెలిపారు. దీంతో అనంతరం ఆమె స్విజ్జర్లాండ్‌కి వెళ్లిపోయింది.
అయితే పది రోజుల అనంతరం వైద్యులు మహిళ భర్తకు ఫోన్ చేశారు. ‘‘ప్రయోగశాలలో చిన్న తప్పిదం కారణంగా పరీక్షకు నమూనా సరిపోలేదు’’ అని చెప్పారు. ప్రతిగా ప్రయాణ ఖర్చులతో పాటూ మిగతా అన్ని రకాల ఖర్చులనూ తిరిగి చెల్లించేలా ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తామని వైద్యులు హమీ ఇచ్చారు. అయితే అనంతరం కొద్ది రోజుల తర్వాత మహిళ.. వైద్యులకు ఫోన్ చేయగా.. ఎలాంటి ఖర్చులూ చెల్లించే స్థితిలో ఆస్పత్రి యాజమాన్యం లేదని చెప్పేశారు. దీంతో బాధితురాలు చివరకు వినియోగదారుల ఫోరంను (Consumer forum) ఆశ్రయించింది. ఈ ఘటనపై విచారణ అనంతరం.. బాధితురాలికి విమాన చార్టీలతో పాటూ రూ.35,000 పరిహారం (Compensation) అందజేయాలని ఫోరం ఆదేశించింది. కాగా, ఈ మహిళకు సంబంధించిన వార్త సోషల్ మీడియలో వైరల్‍గా మారింది.
Updated Date - 2023-05-23T16:07:44+05:30 IST